Huzurabad: రసవత్తరంగా హుజురాబాద్ రాజకీయం.. ఈటెలకు చెక్ పెట్టేందుకు నాడు తండ్రి ప్రయత్నిస్తే.. నేడు తనయుడు..

హుజూరాబాద్ (ప్రతీకాత్మక చిత్రం)

Huzurabad: 17 ఏళ్ల కిందట తండ్రి ప్రత్యర్ధిగా నిలిస్తే .. ఇప్పుడు తనయుడు ఎన్నికల బరిలోకి దిగాడు . అయితే , కొన్ని అనివార్య కారణాల వలన తండ్రి ఈటలకు మద్దతిస్తే ... నేడు కొడుకు సవాల్ విసురుతున్నాడు . నాడు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటల పోటీ చేయగా ప్రత్యర్థిగా తండ్రి నిలిచాడు. నేడు తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ కొడుకు బరిలో నిలిచాడు . దీంతో హుజురాబాద్ ఎన్నికల ముఖ చిత్రంలో సరికొత్త అధ్యాయనం మొదలైంది.

  • Share this:
    (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

    17 ఏళ్ల కిందట తండ్రి ప్రత్యర్ధిగా నిలిస్తే .. ఇప్పుడు తనయుడు ఎన్నికల బరిలోకి దిగాడు . అయితే , కొన్ని అనివార్య కారణాల వలన తండ్రి ఈటలకు మద్దతిస్తే ... నేడు కొడుకు సవాల్ విసురుతున్నాడు . నాడు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటల పోటీ చేయగా ప్రత్యర్థిగా తండ్రి నిలిచాడు. నేడు తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ కొడుకు బరిలో నిలిచాడు . దీంతో హుజురాబాద్ ఎన్నికల ముఖ చిత్రంలో సరికొత్త అధ్యాయనం మొదలైంది. 2004 లో ఈటల రాజేందర్ తొలిసారిగా కమలాపూర్ నుండి పోటీ చేశారు . టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈటలపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెల్లు మల్లయ్య యాదవ్ నిలబడ్డారు . ఎన్నికల కమిషన్ మల్లయ్యకు గొడ్డలి గుర్తు కేటాయించింది . ఐదు రోజుల పాటు గ్రామగ్రామాన తిరుగుతూ మల్లయ్య యాదవ్ తన ప్రచారాన్ని కొనసాగించారు. ఈ తరుణంలో ఈటల రాజేందర్ మల్లయ్య యాదవ్ ను మెప్పించి , ఒప్పించి పోటీ నుండి తప్పుకునేలా చేశారు . అప్పటినుండి మల్లయ్య యాదవ్ ఈటల గెలుపుకోసం ప్రచారం చేశారు. హుజురాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో గెల్లు మల్లయ్య తనయుడు , టీఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

    అయితే , తండ్రి మల్లయ్య కమలాపూర్ నుండి ఈటలకు ప్రతర్థిగా బరిలో నిలిస్తే .. నేడు కొడుకు శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ నుండి ప్రత్యర్థిగా మారారు. అంతేకాకుండా నాడు ఈటల ఉద్యమ పార్టీ అభ్యర్థి కాగా , నేడు ఆయన బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న మొన్నటివరకు జోష్ మీద ఉన్న బీజేపి గెల్లు ప్రకటన తో డీలా పడిందని చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు , గ్రేటర్ హైదరాబాద్ లో గట్టిపోటీ ఇచ్చిన తర్వాత బీజేపీని ప్రత్యమ్నాయంగా చెప్పుకుంటూ వచ్చారు . ఇదే సమయంలోనూ అధిష్టానం దగ్గర బండి సంజయ్ జోరు పెరిగింది . కానీ , ఆ తర్వాత మండలి ఎన్నికలు , నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఘోర వైఫల్యాలను మూటగట్టుకుంది . దీన్ని అధిష్టానం దగ్గర ఒక వర్గం సంజయ్ ఫెయిల్యూర్ గా చూపించినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు . ఇదే సమయంలో హుజురాబాద్ లో ఈటల గెలుపుతో మళ్లీ ఊపు వచ్చే అవకాశం ఉందనుకున్న సమయంలో పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు . హుజురాబాద్ సెగ్మెంట్ లో ఈటల పాదయాత్రలో గానీ , నియోజకవర్గంలో గానీ ఆ నేతలు పెద్దగా పాల్గొనడం లేదు .

    కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్‌రెడ్డి ఇప్పటివరకూ నియోజకవర్గంలో అడుగు పెట్టిన దాఖలు లేవు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పార్లమెంటు సమావేశాల కారణాన్ని చూపి అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు . ఇప్పుడు పాదయాత్రను ముందేసుకుంటున్నారు . ఇదే ప్రాంతానికి చెందిన బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు ఒక్కసారి వచ్చి వెళ్లారు . బీజేపీ సీనియర్ నేతలు విద్యాసాగర్ రావు , రఘునందన్ రావుతో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్ యాక్టివ్ గా ఉండటం లేదు . డీకే అరుణ , కె లక్ష్మణ్ వంటి నేతలు కనిపించడమే లేదు . దీంతో సొంత పార్టీ నేతల మద్దతు ఈటెల కరువైందని ఇప్పటి నుండే ఊహాగానాలు వినబడుతున్నాయి.
    Published by:Veera Babu
    First published: