హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gangula vs Eetala : ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ టీఆర్ఎస్.. ఘోరి ఎలా కడతావ్...?

Gangula vs Eetala : ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ టీఆర్ఎస్.. ఘోరి ఎలా కడతావ్...?

మంత్రి కమలాకర్, ఈటల రాజేందర్ (ఫైల్)

మంత్రి కమలాకర్, ఈటల రాజేందర్ (ఫైల్)

Gangula vs Eetala : ఈటల రాజేందర్ హుజురాబాద్ అభివృద్దిని పట్టించుకోలేదని మంత్రి గంగుల కమాలాకర్ విమర్శించారు..ఆయన తన వ్యక్తిగత అభివృద్దిని ఆకాంక్షించాడు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. సీఎం కేసిఆర్ పథకాలు తప్ప హుజురాబాద్‌లో అభివృద్ది శూన్యం అని ఫైర్ అయ్యారు.

ఇంకా చదవండి ...

మాజీ మంత్రి ఈటెల రాజెంద‌ర్ పై రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీలోకి యువ‌త చేరిన కార్య‌క్ర‌మంలో గంగుల క‌మ‌లాక‌ర్ వారికి ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ తెలంగాణ‌ను ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపిస్తున్న కేసీఆర్ లాంటి గొప్ప వ్య‌క్తిని ఇష్టానుసారంగా అనుచిత వాఖ్య‌లు చేస్తే ప్ర‌తీ తెలంగాణ బిడ్డ తిర‌గ‌బ‌డ‌తాడ‌ని దీటుగా బ‌దులిచ్చారు. కేసీఆర్ వ‌ద్ద ఉన్న‌ప్పుడు ఆత్మ‌గౌర‌వంతో ఈటెల, ఇప్పుడు త‌న ఆత్మ‌గౌరవంతో పాటు తెలంగాణ బిడ్డ‌లైన హుజురాబాద్ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని డిల్లీ చెట్ల‌కింద తాక‌ట్టు పెట్టాడ‌ని, కేవ‌లం ఆస్థులు కాపాడుకోవ‌డం కోసం నీచంగా డిల్లీ పెద్ద‌ల‌కు గులామ్ అయ్యాడ‌ని మండిప‌డ్డారు.

బిజేపీలో చేరిన త‌ర్వాత తొలిసారి హుజురాబాద్ వ‌చ్చిన ఈటెల కేసీఆర్ కు ఘోరీ క‌డుతామ‌ని చేసిన వాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం తెలిపారు. స‌మైక్య పాల‌నలో అరిగోస ప‌డుతున్న తెలంగాణ‌ని విముక్తి చేసిన కేసీఆర్, బంగారు తెలంగాణ కోసం అహ‌ర్నిష‌లు కృషిచేస్తున్నార‌ని, దేశంలో ఎక్క‌డాలేని విధంగా రైతుబంధు, రైతుబీమా, 24గంట‌ల ఉచిత క‌రెంట్, బిసి, ఎస్సీ,ఎస్టీ అణ‌గారిన వ‌ర్గాల బంగారు భ‌విష్య‌త్ కోసం గురుకులాలు, అవ్వ అయ్యా ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌ని ఆస‌రా ఫించ‌న్లు ఇంకా ఎన్నో ప‌థ‌కాలు అందిస్తున్నందుకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి ఘోరీ క‌ట్టాలా అని ప్ర‌శ్నించారు.

సంక్షేమ ప‌థ‌కాల‌ను ప‌రిగ‌ల‌కు తీసేసే ఈటల రాజేందర్ కు రాబోయే హుజురాబాద్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఘోరీ క‌డతార‌ని, ఆయ‌న చేసిన అక్ర‌మాల‌ని ప్ర‌శ్నిస్తార‌ని అన్నారు. ఆర‌వై ఏళ్ల ఆత్మ‌గౌర‌వ పోరుతో సాధించిన తెలంగాణ క‌న్నా.. స‌మైక్య పాల‌నే బాగుంద‌నే త‌న అభిప్రాయాన్ని ఈటెల త‌న భార్య జ‌మున‌తో చెప్పించార‌ని విమర్శించారు. స‌మైక్య‌మే ముద్ద‌న్న ఈటెల‌ను చేర్చుకున్న బీజేపీ ఈ విష‌యంలో త‌మ వైఖ‌రి ఏంటో బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేసారు. తెలంగాణ మెత్తం గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారి నాయ‌క‌త్వంలో ముందుకు పోతే.. తామంతా అడిగిన వెంట‌నే నిదులిచ్చి మా నియోజ‌క‌వ‌ర్గాల‌ను అభివృద్ది ప‌థంలో నిలుపుకున్నామ‌ని, కానీ ఈటెల ఏనాడు హుజురాబాద్‌ను ప‌ట్టించుకోలేద‌ని, కేవ‌లం త‌న ప్ర‌యోజ‌నాల కోస‌మే మాట్లాడి హుజురాబాద్‌ను వెనుక‌కు నెట్టార‌ని దుయ్య‌బ‌ట్టారు.

అయితే హుజురాబాద్ అభివృద్దిపై సీఎం కేసిఆర్ అడిగిన వెంటనే నిధులు విడుదల చేశారని అన్నారు. రానున్న రోజల్లో హుజురాబాద్‌ ప్రజలు టీఆర్ఎస్‌కు జై కొడతారని అన్నారు. ఈ క్రమంలోనే పలువురు స్థానికులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

First published:

Tags: Eetala rajender, Gangula kamalakar

ఉత్తమ కథలు