హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : లక్షలు కమీషన్ ఇస్తేనే అక్కడ ఉద్యోగం .. పని చేసిన తర్వాత జీతం రాదు .. జాబ్ గ్యారెంటీ లేదు

Telangana : లక్షలు కమీషన్ ఇస్తేనే అక్కడ ఉద్యోగం .. పని చేసిన తర్వాత జీతం రాదు .. జాబ్ గ్యారెంటీ లేదు

Godavarikhani

Godavarikhani

Telangana : నెల జీతం 25 వేలకు పైగా ఉంటుంది. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా సదుపాయాలు. కాంట్రాక్టర్‌ మారినా కార్మికుల ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఇలాంటి మాటలు చెప్పి కరీంనగర్ జిల్లాలో దళారులు కాయ, కష్టం చేసుకునే వాళ్లను మోసం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  నెలసరి వేతనం రూ .25 వేలకు పైగా ఉంటుంది. పర్మినెంట్ ఉద్యోగు(Permanent employee)లతో సమానంగా సదుపాయాలు. కాంట్రాక్టర్‌ (Contractor)మారినా కార్మికుల ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఇలాంటి మాటలు మోసపూరితమైన మాటలతో నమ్మబలికిన కొందరు దళారులు రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచారు. ఇది మర్చిపోక ముందే గోదావరిఖని(Godavarikhani)లోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి(Government General Hospital)లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలో పారిశుద్ధ్య(Sanitation), పేషెంటు కేర్ (Patient Care),సెక్యూరిటీ(Security)విభాగాల్లో ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ .1 లక్ష నుంచి రూ .3 లక్షల వరకు దళారులు వసూలు చేశారు.

  Kalvakuntla kavitha : లిక్కర్ స్కాంతో నాకు సంబంధం లేదు .. ప్రతిపక్షాలపై బీజేపీ బురదచల్లడం మానుకోవాలి : కల్వకుంట్ల కవిత  ఆసుపత్రిలో అడ్డగోలు దందా..

  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండం ఆర్ఎఫ్‌సీఎల్ వ్యవహారం తరహాలోనే మరో మోసం బయటపడింది. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆస్పత్రిలో పారిశుద్ధ్య , పేషెంటు కేర్ , సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగం కోసం దళారులకు ఒక్కొక్కరు లక్ష రూపాయల నుంచి 3.3 లక్షల వరకు ఇచ్చారు. అయితే ఇప్పుడు తాము ఎవరికీ డబ్బులు చెల్లించలేదంటూ ఆసుపత్రి వర్గాలు ఉద్యోగులతో బాండు పేపర్లు రాయించుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి పనిలో చేరిన వాళ్లంతా ఇప్పుడు ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని రాసివ్వడంతో భవిష్యత్తులో తమను తొలగిస్తే ఎవరికి చెప్పుకోవాలనే ఆందోళనలు వ్యక్తమవుతున్నారు . ఆసుపత్రితో ఏమాత్రం సంబంధం లేని ఓ వ్యక్తి ప్రమేయంతోనే ఇదంతా సాగుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికి డబ్బులు చెల్లించకుండా , కొందరు ప్రజాప్రతినిధుల సిఫారసులతో ఆస్పత్రిలో విధుల్లో చేరిన పారిశుద్ధ్య కార్మికులపై పని ఒత్తిడి పెంచుతూ వెళ్లిపోయేలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారి స్థానంలో డబ్బులు దండుకొని కొత్తవారిని నియమించుకుంటున్నారు.

  అడిగే వారేరి ..

  తాజాగా ఓ ఇద్దరు మహిళా కార్మికులతో వారం , పది రోజులు పని చేయించుకొని ప్రవర్తన సరిగా లేదని తొలగించడం గమనార్హం. ఆస్పత్రిలో పారిశుద్ధ్య , రక్షణ , పేషెంటు కేర్ కార్మికులను కలుపుకొని మొత్తం 120 మంది పనిచేస్తున్నప్పటికీ ఇంకా 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని , డబ్బులు చెల్లిస్తే పనిలో పెట్టిస్తానంటూ ఆస్పత్రితో ఏమాత్రం సంబంధం లేని ఒకరు చెప్పుకుంటూ తిరుగుతున్నారనే ఆరోపణలున్నాయి . ఆస్పత్రిలోని ఆచార్యులు , వైద్యులు , వైద్య సిబ్బంది సైతం ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఆయనకే చెప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి . పారిశుద్ధ్య , పేషెంటు కేర్ , సెక్యూరిటీ సిబ్బంది విధులకు సంబంధించిన రోస్టర్ సైతం తయారు చేస్తున్నాడు. హాజరు పట్టికలో ఈ రోజు ఉన్నవారి పేరు మరుసటి రోజు ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. డ్యూటీ రోస్టర్ వారానికోసారి మారాల్సి ఉండగా , గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం రోజు రోజుకు ఆ మారిపోతుంది.

  ఇష్టారాజ్యంగా నియామకాలు..

  రోటేషన్ విధానానిక మంగళం పాడి నచ్చిన వారికి సులభమైన పనులను కేటాయించి నచ్చని వారిపై పని ఒత్తిడి పెంచుతూ నెలల తరబడి అక్కడే పని చేయిస్తున్నారు . కొత్తగా విధుల్లో చేరిన సెక్యూరిటీ సిబ్బందికి ఆస్పత్రి లోపల విధులు కేటాయిస్తుండగా దశాబ్దకాలంగా పనిచేస్తున్న వారిని నెలల తరబడి బయటి విధులు అప్పజెప్పుతున్నారు . కొత్తగా విధుల్లో చేరిన సూపర్ వైజర్లు , సెక్యూరిటీ సిబ్బంది పేషెంట్ల బంధువులపై దురుసుగా వ్యవహరిస్తున్నారు . ఇటీవల ఆస్పత్రిలోంచి ఓ బాలింతను తీసుకెళ్లేందుకు కారులో వచ్చిన ఆమె బంధువు కారును ప్రధాన ద్వారం వద్ద నిలిపినందుకు సెక్యూరిటీ సిబ్బంది , పర్యవేక్షకులు మూకుమ్మడిగా గొడవకు దిగడం గమనార్హం. బాలింతల వార్డుల్లో మహిళా పారిశుద్ధ్య కార్మికులకే విధులు కేటాయించాల్సి ఉండగా పురుషులకు విధులు కేటాయిస్తున్నారు . ఇదేమంటే .. షాడో సూపరింటెండెంట్ వ్యవహరిస్తున్న వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారని కార్మికులు చెబుతున్నారు.

  Family suicide : వ్యాపారి ఫ్యామిలీ చావుకి ఆ నలుగురే కారణం .. సూసైడ్‌ లెటర్‌లో ఏముందంటే..?  హాస్పటల్‌లో జాబ్‌ పేరుతో మోసం..

  ప్రభుత్వ ఆస్పత్రి పారిశుద్ధ్య , పేషెంటు కేర్ , సెక్యూరిటీ కార్మికులకు పాత గుత్తేదారు రెండు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉండగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న గుత్తేదారు మరో రెండు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. దీంతో గత నాలుగు నెలలుగా జీతాలు లేక ఆస్పత్రిలోని పారిశుద్ధ్య , పేషెంటు కేర్ , సెక్యూరిటీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు . పాత గుత్తేదారు ఇ.ఎస్.ఐ. , పి.ఎఫ్ . డబ్బులు సైతం జమచేయలేదు . రెండు నెలల క్రితం కొత్తగా బాధ్యతలు తీసుకున్న గుత్తేదారు ఇంత వరకు ఎవరెవరికి నెలసరి జీతం ఎంత చెల్లిస్తారో స్పష్టం చేయడం లేదు . మిగతా ఆస్పత్రిలో ఎలా చెల్లిస్తే తాను అలా చెల్లిస్తానంటున్నాడే తప్ప వేతనాలివ్వడం లేదు.

  శ్రమ దోపిడీ..

  గతంలో ఆస్పత్రిలో అవసరానికి మించి కార్మికులున్నారంటూ అప్పటి కాంట్రాక్టర్ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ . 7500 , సెక్యూరిటీ సిబ్బందికి నెలకు రూ .8000 చెల్లించేవాడు . తాజాగా నిర్వహించిన టెండరులో తప్పనిసరిగా కార్మికులకు నెలకు రూ .15,600 వేతనంలో ఇ.ఎస్.ఐ. , పి.ఎఫ్ . మినహాయింపులు పోను మిగతా వేతనం చెల్లించాల్సిందేనంటూ పేర్కొన్నారు . తాజాగా విధుల్లో చేరిన గుత్తేదారు ఈ విషయాన్ని స్పష్టం చేయకుండా మిగతా చోట ఎలా చెల్లిస్తే తాను అలా చెల్లిస్తాననడంలో ఆంతర్యమేంటోననే కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimangar, Telangana jobs, Telangana News

  ఉత్తమ కథలు