Home /News /telangana /

KARIMNAGAR FORMER MP VINOD KUMAR APPRECIATED THE RELIGIOUS HARMONY AMONG THE MUSLIM YOUTH OF KARIMNAGAR SNR KNR

Religious harmony : టీఆర్ఎస్ మాజీ ఎంపీకి ముస్లిం యువకుల సర్‌ప్రైజ్ గిఫ్ట్ .. ఇంప్రెస్ చేసిన ఆ కానుక ఏమిటంటే

(Muslim youth Gift)

(Muslim youth Gift)

Muslims Gift: ఆరాధించే మనసు మంచిదైతే కుల,మతాలతో సంబంధం లేదని నిరూపించారు కరీంనగర్‌కు చెందిన ముస్లిం యువకులు. తమకున్న నిష్కల్మషమైన అభిమానాన్ని చాటుకొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India
(P.Srinivas,New18,Karimnagar)
ఆరాధించే మనసు మంచిదైతే కుల,మతాలతో సంబంధం లేదని నిరూపించారు కరీంనగర్(Karimnagar)జిల్లాకు చెందిన ముస్లిం(Muslim)యువకులు. ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా తమకున్న నిష్కల్మషమైన అభిమానాన్ని చాటుకొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ముస్లిం యువకులు తన పట్ల చూపించిన అభిమానానికి ...హిందూ దేవుళ్లు, పూజలను గౌరవించడాన్ని మాజీ ఎంపీ(Ex MP) హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీ యువకుల్లో సెక్యులర్‌ స్పూర్తిని అభినందించారు.

Telangana : జాతీయ జెండా మార్ఫింగ్ చేసి టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రచారం..మండిపడుతున్న దేశభక్తులుమతసామరస్యానికి ప్రతీక..
కరీంనగర్ మాజీ ఎంపీ , రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పట్ల ముస్లిం యువకులు చూపించిన అభిమానం వెలకట్టలేనిదిగా చూడాలి. జూన్‌ 4వ తేదిన వినోద్‌కుమార్ సిరిసిల్ల రాజన్న జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అప్పుడు అక్కడే ఉన్న మాజీ ఎంపీ అభిమానులు ఆయన పూజలు చేస్తుండగా సెల్‌ఫోన్ల ద్వారా ఫోటోలు తీశారు. ఆ ఫోటోలను జాగ్రత్తగా భద్రపరిచి వాటిని మెసెంజర్ ద్వారా ముంబైకి పంపించారు.ఫోటోని ఆర్ట్ వేయించిన ముస్లింలు..
ముంబైలో ఫిలిం స్టూడియో ఆర్టిస్టుగా పని చేస్తున్న తమ స్నేహితుడికి ఆ ఫోటోను ఆర్ట్ గీయించి ఫ్రేమ్‌ కట్టించారు. ఆ ఫోటో ఫ్రేమ్‌ని గురువారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు బహూకరించారు ముస్లిం మైనారిటీ యువకులు. అందరూ ముస్లింలు అయినప్పటికి వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేయించిన ఫోటోను ఇస్తియాక్ అహ్మద్‌తో ఆర్ట్ వేయించారు. ఆ ఫ్రేమ్‌ని అహ్మద్‌ తన స్నేహితులైన సాజిద్ ఖాన్, షేక్ యూసుఫ్, మొహమ్మద్ సలీం ఖాన్, మీర్ షౌకత్ అలీ, సయ్యద్ మజీద్‌ కలిసి మంత్రుల నివాస ప్రాంగణంలో వినోద్ కుమార్ కు బహూకరించారు.

Fake Doctor : 43వేల మందికి ట్రీట్‌మెంట్ చేసిన సింగిల్ డాక్టర్ .. అతనే వరంగల్‌ శంకర్‌దాదా MBBSఅందరిలో ఇదే స్పూర్తి కలగాలి..
ముస్లిం యువకులు అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పూజా, తీర్థ ప్రసాదాల దృశ్యాన్ని మొబైల్ లో తీసిన ఫోటోను ప్రత్యేకంగా ఆర్ట్ వేయించి తనకు బహుకరించడం పట్ల వినోద్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది మత సామరస్యానికి ప్రతీకగా అభివర్ణించారు. వారిలోని సెక్యులర్ స్ఫూర్తిని అభినందించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో ముందుకు సాగాలని, మతాలు, కులాలకు అతీతంగా ఒకరికి మరొకరు గౌరవించుకోవాలని వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Karimnagar, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు