హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఒకప్పుడు రాళ్లు రప్పలతో ఎడారిగా ఉన్న గుట్ట ఇప్పుడు పచ్చని రంగు వేసినట్టు ఉంది ఎక్కడంటే ..?

Telangana: ఒకప్పుడు రాళ్లు రప్పలతో ఎడారిగా ఉన్న గుట్ట ఇప్పుడు పచ్చని రంగు వేసినట్టు ఉంది ఎక్కడంటే ..?

KARIMNAGAR FOREST

KARIMNAGAR FOREST

Telangana: మైదానం ఉన్న గుట్టల ప్రాంతంలో పచ్చదనం పెంపొందించదాన్నిసవాల్ తీసుకొని ఒక ప్రణాళిక ని ఏర్పాటు చేసుకొని దశలవారిగా లక్ష మొక్కలు నాటి మొక్కలని సంరక్షిండంతో ఇప్పుడు వెదురుగట్ట చిట్టడవి పచ్చదనం అందరిని ఆకర్షిస్తుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  అటవీశాఖ  అధికారుల కృషితో పచ్చదనం పరుచుకుంది. ఇన్ని రోజులుగా రాళ్ళూ రప్పలతో ఉన్న ప్రాంతం నేడు తీరొక్క చెట్లతో కళకళ లాడుతుంది. ఎడారిని తలపించిన ప్రాంతం ఇప్పుడు ప్రకృతి అందాలకి నిలయం గా మారింది. వేలాది వన్య ప్రాణులకి, పక్షులకి ఆవాసంగా మారింది. నూతనంగా రూపొందించిన రిజర్వ్ ఫారెస్ట్ జాబితాలో ముందు వరుసలో నిలిచి తెలంగాణా రాష్ట్రంలోనే కరీంనగర్Karimnagar జిల్లా చొప్పదండి(Choppadandi)లోని వెదురుగట్ట(Vedurugatta)శివారులోని గుట్ట ప్రాంతం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

  అడవి తెచ్చిన కళ..

  మూడేళ్ళ క్రిందట కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట శివారులోని గుట్ట ప్రాంతం నిరుపయోగంగా ఉండేది. రాళ్ళూ రప్పలతో నిరుపయోగంగా ఉన్న గుట్ట మూడేళ్ళలో రూపురేఖలు మార్చుకుంది. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేబట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అటవీశాఖ భూములని కేటాహించింది. దీనికి బదులుగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలోని సర్వే నంబర్ 354 లో 175 ఎకరాల భూమిని అటవీశాఖకేటాహించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో నష్టపోయిన అటవీ విస్తీర్ణానికి బదులుగా కేటహించిన భూమిలో ఒక చిట్ట అడవిని సృష్టించాలని అటవీశాఖ నిర్ణ హించుకుంది. ప్రభుత్వం కేటాహించిన భూమిలో హద్దులు ఏర్పాటు చేసుకొని తమ అధినంలోకి తీసుకొని పనులు మొదలు పెట్టారు అధికారులు.

  రూపు దిద్దుకున్నతీరు..

  కేటాయించిన 175  ఎకరాలలో దాదాపుగా లక్ష మొక్కలు నాటలని నిర్ణహించుకున్నారు. నాటిన ప్రతి మొక్కని కాపాడటంతో పాటుగా ఒకవేళ మొక్క ఎండితే ఆ మొక్క స్థానంలో కొత్త మొక్కని నాటారు. ఎర్రని గుట్ట ప్రాంతం కావడంతో మొక్కలని ఎలాగైనా బ్రతికించుకోవాలని  మూడేళ్ళు శ్రమించారు. ఎందుకు పనికి రాదు అనుకున్న వెదురుగట్ట గుట్ట ఇప్పుడు దట్టమైన చిట్టడివిని తలపిస్తుంది. చెట్లతో పాటుగా కొమ్మలు  కూడా విస్తరించడంతో ఇప్పుడు ఆ గుట్ట ప్రాంతమంతా దట్టమైన అడవిని తలపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంది. గుట్టపై నుండి క్రిందికి చుస్తే లోయ ప్రాంతాలు అన్ని కూడా పచ్చదనంతో హరిత శోభని సంతరించుకుంది.

  Telangana : నెక్స్ట్ కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేసేది అక్కడి నుండేనా .. రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ

  కరీంనగర్ జిల్లాకే ప్రత్యేక గుర్తింపు..

  ఇప్పుడు వెదురుగట్ట ప్రాంతం రిజర్వ్ ప్రాంతం జాబితాలో చేర్చేందుకు ముందు వరుసలో ఉంది. ఏపుగా పెరిగిన మొక్కలతో ఇప్పుడు వెదురుగట్ట గుట్ట చిట్టడివిని తలపిస్తుంది. పండ్ల మొక్కలతో పాటుగా ఇరవై ఐదు రకాల మొక్కలని నాటారు. రావి, మర్రి,వెలగ, సీతాఫల్ , ఇరికి, మామిడి, తాని , నేరేడు, దిరిసినం, బాదం,ఉసిరి ,బబుల్,ఇరుమద్ది,వేప,తాప్సి,చిందుగ ,నెమలినార,జిట్రేగి,సిస ,గుమ్మడి టేకు,నారెప,బట్టగానం ,కానుగ మొక్కలు ఇప్పుడు దట్టంగా పెరగడంతో వన్యప్రాణులకి సురిక్షతమైన ఆవాసంగామారింది. మామిడి, బాదం, వెలగ ,నేరెడి,సీతాఫలం,ఎప్పుడు వన్య ప్రాణులకి  ఆహారంగా మారింది. వెదురుగట్ట చిట్టడివిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో కుందేళ్ళు,కోతులు,పక్షులు ఆవాసంగా ఏర్పరుచుకున్నాయి.

  గుట్టల్లో అఢవిని సృష్టించారు..

  అనేక ఇబ్బందులను అధిగమించి 175 ఎకరాలలో కొత్తగా ఒక అడవినే రూపొందించడంతో రాష్ట్ర స్థాయిలో కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పునర్విభజన తర్వాత కరీంనగర్ జిల్లాకి అడవి లేదనే లోటుని పూడ్చడంలో కరీంనగర్ జిల్లా అటవీశాఖ అధికారులు సఫలికృతం అయ్యారు. వెదురుగట్ట అటవీ ప్రాజెక్ట్ ని సందర్శించిన అధికారులు, మంత్రులు , ఎంపిలు అటవీశాఖ అధికారుల కృషిని మెచ్చుకున్నారు. మిగితా జిల్లలో కూడా ఇదే తీరుగ అడవులని పెంచాలని నిర్దేశించారు.

  Telangana Politics: అధికార పార్టీలో ముసలం .. మాజీ మేయర్ రవీందర్ సింగ్ .. అల్లుడి ఆడియో టేపు కలకలం

  ఇక్కడ మొక్కలు పెంచడం అధికారులకి సవాల్

  వెదురుగట్ట ప్రాంతం రాళ్ళూ రప్పలు ఉండడం తో మొక్కలు పెరిగేందుకు ఏమాత్రం అనుకూలమైనది కాదు. ఒక్క మొక్క కూడా బ్రతికే పరిస్థితి లేకపోవడం ఇక్కడ మొక్కలు పెంచడం అధికారులకి సవాల్ గా మారింది. ఉన్నత అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది అంతా కూడా సమన్వయంతో కదిలారు. 175 ఎకరాలలో సర్వే చేసి గుట్ట ప్రాంతాన్ని పన్నెండు భాగాలుగా విభజించారు. పదిహేను ఎకరాలు దారుల కోసం వదిలి మిగిలిన 160 ఎకరాలలో మొక్కలు నాటేల ప్రణాళికలు రూపొందించారు. l2019 జూన్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటివరకి దాదాపుగా లక్ష మొక్కలు నాటారు. నీటి కోసం భాగిరథ ప్రయత్నంనిస్సారమైన భూముల్లో నాటిన మొక్కలని కాపాడుకునేందుకు అధికారులు నీటి కోసం భగీరథ ప్రయత్నం చేసారు. గుట్ట దిగువన బోరు వేయగా పుష్కలంగా నీరు పడడంతో  మొక్కలకి నీరు అందించేందుకు మూడు చోట్ల కాంక్రీట్ ట్యాంక్లని నిర్మించారు. ఐదు వేల సామర్థ్యం గా రెండు ప్లాస్టిక్ ట్యాంక్‌లను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌ల నుంచి దిగువ ప్రాంతాలకి పైప్‌ లైన్‌లు వేసి నడి వేసవిలో కూడా నీటిని అందించి మొక్కలు ఎండిపోకుండా రక్షించారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimangar, Telangana News

  ఉత్తమ కథలు