Home /News /telangana /

KARIMNAGAR FIVE STUDENTS DROWNED AFTER SWIMMING TRAGEDY IN SIRISILLA DETAILS HERE KNR VB

Five Students: ముగ్గురు పిల్లలు బట్టలు లేకుండా పరుగెత్తారు.. ఏంటా అని గ్రామస్తులు చూసేసరికి షాక్..

గల్లంతైన విద్యార్థులు

గల్లంతైన విద్యార్థులు

Five Students: ఈత సరాదాగా అనిపిస్తుంది. కానీ టైం బాగాలేకపోతే.. దురదృష్టం తన్నుకుంటూ వస్తుంది. ఇక్కడ ఈతకు ఎనిమిది మంది విద్యార్థులు వెళ్లారు. అందులో ఐదుగురు పిల్లల తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
    (P.Srinivas,News18,Karimnagar)

    సిరిసిల్ల పట్టణానికి చెందిన ఎనిమిది మంది విద్యార్ధులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మానేరు వాగులోని చెక్‌డ్యాం సమీపంలో ఈత కొట్టేందుకు వెళ్ళారు. ఈత కొట్టేందుకు మానేరు వాగులోకి దిగగా.. చెక్‌ డ్యాం సమీపంలో ఐదుగురు గల్లంతయ్యారు. మునిగిపోయిన వారిలో గణేష్, వెంకట సాయి, అజయ్, రాకెష్, శ్రీరామ్, క్రాంతి ఉన్నారు. వీళ్లలో పదవ తరగతి చదువుతున్న కొలిపాక గణేష్‌(14) మృతదేహంతో పాటు మరో ఇద్దరి మృతదేహాలు లభించాయి. దీంతో తల్లితండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది . చెదిరిన ఆశల మధ్య తల్లి తండ్రులను తల్లడిల్లేలా చేసింది . సరదాగా ఈత కోసం వెళ్ళిన విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థులు గల్లంతైయ్యారు .

    OMG: ఆ బాలుడు ఇంటర్ చదువుతున్నాడు.. ఓ ఘటనకు బాధ్యుడిగా మారాడు.. దీంతో తన కాలేజీకి వెళ్లి ఇలా చేశాడు..


    వీరిలో ముగ్గురు చనిపోయారు. వారి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ లో ఈ ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి . స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. సోమవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రాజీవ్ నగర్ కు చెందిన 8 మంది విద్యార్ధులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సరదాగా ఈత కోసం మానేరు వా గులోని చెక్ డ్యాం సమీపంలోకి వెళ్ళారు . వీరిలో ఐదుగురు విద్యార్ధులు అప్పటికే ఈత కొట్టేందుకు వాగులోకి దిగారు. వారు మునిగిపోతుండడంతో భయాందోళనకు గురైన మిగిలిన ముగ్గురు విద్యార్థులు బట్టలు లేకుండా పరుగులు పెట్టడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

    Disha Patani: హీటెక్కిస్తోన్న దిశా ప‌టానీ బికినీ ఫొటోలు.. చూసి తట్టుకోవడం కష్టమే..


    వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు మానేరు వాగు వద్దకు రావడంతో అక్కడ విద్యార్థుల చెప్పు లు , సైకిళ్లు తప్ప ఎవ్వరూ కనిపించలేదు. అక్కడ గాలింపు చర్యల తర్వాత 10 వ తరగతి చదువుతున్న కొలిపాక గణేష్ ( 14 ) మృతదేహంతో పాటు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

    Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అనుకోని ఘటన.. తెల్లవారుజామున ఇలా జరగడంతో..


    వీరంతా సిరిసిల్ల పట్టణం లోని వెంకంపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు . తీగల అజయ్ మినహా మిగిలిన వారంతా చేనేత కుటుంబాలకు చెందినవారు. ఘటనా స్థలానికి వచ్చిన విద్యార్ధుల తల్లితండ్రుల రోదనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి . మరోవైపు జోరుగా కురుస్తున్న వర్షంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతుంది . గాలింపు చర్యల కోసం పోలీసు సిబ్బంది ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు .

    Double Shocking: ఇద్దరూ మగవాళ్లు అయి ఉండి ఇదేం బుద్ది.. ఆ పని కోసం ఎంత పనిచేశావయ్యా..


    విద్యార్దులంతా రాజీవ్ నగర్ చెందిన వారే కావడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి .రాత్రి ఐనా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ముగ్గురి చిన్నారుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగతా వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సిరిసిల్ల యస్పి రాహుల్ హెగ్డే తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Sircilla

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు