Dalitha Bandhu: ఆ ఐదుగురు దళితబంధును తిరస్కరించారు.. ఎందుకో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

Dalitha Bandhu:హుజురాబాద్ బై ఎలక్షన్ కు సంబంధించి వ్యవహారం మొదలైన దగ్గర నుంచి ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఎవరి వేసే ఎత్తులు వాళ్లు వేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ఎన్నికల నేపథ్యంలోనే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. దానిలో ఐదుగురు దళితబంధు ను తరిస్కరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 • Share this:
  హుజురాబాద్ బై ఎలక్షన్ కు(Huzurabad By Elections) సంబంధించి వ్యవహారం మొదలైన దగ్గర నుంచి ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఎవరి వేసే ఎత్తులు వాళ్లు వేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ఎన్నికల నేపథ్యంలోనే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ రూ.10 లక్షలను ఉపాధి పొందేదుకు పెట్టుబడిగా ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే చాలామంది దళితుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. కేవలం హుజురాబాద్ లోనే కాకుండా రాష్ట్రం మొత్తం అమలు చేయాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఒకేసారి కాకుండా అందరికీ ఈ పథకం లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

  Etala Rajender: ఈటల పాదయాత్రకు బ్రేక్ పడటానికి కారణం అదేనా..?


  అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర నుంచి నాలుగు మండలాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలన్న నియమం ఏం లేదు కానీ.. ఆ ఐదుగురు ఆ డబ్బును తిరస్కరించారు. తాము మంచి స్థితిలోనే ఉన్నామని, దళితబంధు కింద వచ్చే ఆ డబ్బు పేద సోదరులకు ఉపయోగపడాలంటూ ఆ ఐదుగురు పెద్ద మనసు చాటుకున్నారు. తాము ఆర్థికంగా ఉన్నతస్థితిలోనే ఉన్నామని, తమకు రూ.10 లక్షల సాయం అవసరం లేదని స్పష్టంచేశారు. దీంతో ఇప్పుడు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ ఐదుగురి గురించే చర్చించుకుంటున్నారు.

  వీరిలో ముగ్గు రు వ్యక్తులు తండ్రీకొడుకులు కావడం గమనార్హం. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దళితుల పురోభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హు జూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రత్యేకంగా సర్వే చేసి 5 మండలాల్లో దాదాపు 23 వేలకుపైగా దళితులను గుర్తించింది. వీరికోసం రూ.2,000 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకూ హు జూరాబాద్‌ నియోజకవర్గంలో 14,421 మంది లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం దళితబంధు నిధులు జమచేసింది. అయితే వాళ్లు డబ్బులను వదులుకోవడానికి గల కారణాలను పేర్కొన్నారు.

  Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


  అందులో ఒకరు హుజురాబాద్ కు చెందిన కర్రె నరసింహాస్వామి. ఇతడు గెజిటెడ్ ప్రధానోపాధ్యుయుడిగా పదవీ విరమణ పొందాడు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా.. దళితులు ఇంకా అట్టడుగునే ఉన్నారని.. నాకు వచ్చే దళితబంధు డబ్బులను వాళ్లు ఉపయోగించండంటూ పేర్కొన్నాడు. రైల్లే ఇంజనీర్ గా చేస్తున్న మరొకరు కర్రె కిరణ్ కుమార్. ఇతడు ప్రస్తుతం రైల్వేలో డిప్యూటీ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ మంచి జీతంతో ఉన్నత స్థితిలో ఉన్నా. మా తండ్రి, తల్లి ప్రభుత్వ టీచర్లుగా పదవీవిరమణ పొందారు. వారికి పెన్షన్‌ కూడా వస్తోంది.

  అందుకే.. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద మంజూరు చేసిన 10 లక్షల రూపాయలను పేద దళిత కుటుంబాలకు ఉపయోగపడాలని గివిట్‌ అప్‌ కింద ప్రభుత్వానికి తిరిగి ఇచ్చానంటూ చెప్పుకొచ్చాడు. పంచాయతీరాజ్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా రిటైరయిన మరొకరు కూడా తన డబ్బులను పేదలకు ఇవ్వాంటూ విన్నవించాడు. వాళ్లతో మరొక ఇద్దరు కూడా ఇలాగే తన దళితబంధు డబ్బులను వదులుకున్నారు. దీంతో వీళ్లు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
  Published by:Veera Babu
  First published: