హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ukraine Russia war: రష్యా‌‌-ఉక్రెయిన్​ వార్​ ఎఫెక్ట్​.. ఉక్రెయిన్​లో చిక్కుకున్న కరీంనగర్​ వాసులు.. రహదారులన్నీ మూసివేత​

Ukraine Russia war: రష్యా‌‌-ఉక్రెయిన్​ వార్​ ఎఫెక్ట్​.. ఉక్రెయిన్​లో చిక్కుకున్న కరీంనగర్​ వాసులు.. రహదారులన్నీ మూసివేత​

రష్యా దాడుల నేపథ్యంలో పలువురు భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. స్వదేశానికి తిరిగివచ్చేందుకు సిద్ధమైన 15 మంది కరీంనగర్ జిల్లా విద్యార్థులు కీవ్ ఎయిర్ పోర్టులో ఆగిపోయారు .

రష్యా దాడుల నేపథ్యంలో పలువురు భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. స్వదేశానికి తిరిగివచ్చేందుకు సిద్ధమైన 15 మంది కరీంనగర్ జిల్లా విద్యార్థులు కీవ్ ఎయిర్ పోర్టులో ఆగిపోయారు .

రష్యా దాడుల నేపథ్యంలో పలువురు భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. స్వదేశానికి తిరిగివచ్చేందుకు సిద్ధమైన 15 మంది కరీంనగర్ జిల్లా విద్యార్థులు కీవ్ ఎయిర్ పోర్టులో ఆగిపోయారు .

  (న్యూస్ 18, తెలుగు కరస్పాండెంట్​. శ్రీనివాస్. పి.)

  రష్యా దాడుల (Ukraine Russia war)నేపథ్యంలో పలువురు భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ (Ukraine) లో చిక్కుకుపోయారు. స్వదేశానికి తిరిగివచ్చేందుకు సిద్ధమైన 15 మంది కరీంనగర్ జిల్లా విద్యార్థులు (Students) కీవ్ ఎయిర్ పోర్టులో ఆగిపోయారు . ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీయులంతా దేశాన్ని విడిచి వెళ్లాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . దీంతో విమానం టికెట్లు బుక్ చేసుకున్న విద్యార్థులు ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు . అయితే ప్రభుత్వం అప్పటికే ఎయిర్ పోర్టుతో పాటు బయటకు వెళ్లే దారులన్నీ మూసివేసింది . తెలంగాణ (Telangana)కు చెందిన పలు విద్యార్థులతోపాటు కరీంనగర్​కు చెందిన  విద్యార్థులు కూడా చిక్కుకోవడంతో వారి కుటుంబంలో ఆందోళన నెలకొంది . విద్యార్థులు భయంతో కాలం వెళ్లదీస్తున్నట్లు తెలియడంతో భారత రాయబారి కార్యాలయం హెల్ప్​లైన్​ ఏర్పాటు చేసింది . భారత్ విమానాన్ని ఉక్రెయిన్​లో నిలిపివేయడంతో విద్యార్థులను ఇతర మార్గాల గుండా రప్పించే ప్రయత్నం భారత రాయబార కార్యాలయం చేస్తున్నట్లు తెలసింది.

  ఉక్రెయిన్, రష్యా యుద్ధం  (Ukraine Russia war) కారణంగా ఉక్రెయిన్​​లో చిక్కుకుపోయిన వారిలో కరీంనగర్ కు చెందిన మెడికల్ విద్యార్థి కడారి సుమాంజలితోపాటు తెలంగాణకు చెందిన రమ్యశ్రీ , ఎన్.శ్రీనిధి , లిఖిత ఇతరులు ఉన్నారు . వీరంతా ఉక్రెయిన్ లోని జాఫ్రోజియా మెడికల్ యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వారే . వీరితోపాటు దాదాపు 20 మంది ఎయిర్ పోర్ట్ వద్ద చిక్కుకుపోయారు . ఈ విషయాన్ని కరీంనగర్ ( Karimnagar) కు చెందిన కడారి సుమాంజలి తన సోదరుడు కడారి స్వామికి ఫోన్ చేసి తాము ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన విషయాన్ని వివరించారు. తమను ఎటూ వెళ్లనీయ డం లేదని అవస్థలు ఎదుర్కొంటున్నామని వాపో యారు.

   ఏం చేయాలో తెలియడం లేదు..

  కరీంనగర్ ( Karimnagar) లోని జ్యోతినగర్ కు చెందిన మమత, రామగుడు మండలం రామచంద్రాపురంకు చెందిన కడారి సుమాంజలి, జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన భవానీ , మల్యాల మండలం రాంపూర్ కు చెందిన నిహారికలు ఉక్రెయిన్ చిక్కున్నట్టుగా ప్రాథమికంగా అందిన సమాచారం. ఉక్రెయిన్ ఎయిర్ పోర్టులోనే చాలా మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని రామడుగు మండలం రామచంద్రాపూర్ కు చెందిన సుమాంజలి తల్లిదండ్రులకు ఫోన్లో వివరించారు . కన్సల్టెన్సీలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని తిరిగి హాస్టళ్లకు తరలిస్తామని చెప్తున్నారని తెలిపారు . ఉక్రెయిన్ లో చిక్కుకున్న మెడిసిన్ విద్యార్థిని కడారి సుమాంజలితో పాటు అక్కడున్న భారతీయుల పరిస్థితిని వాకబు చేశారు . రామడుగుకు వెళ్లి ఉక్రెయిన్ లో చిక్కుకున్న కడారి సుమాంజలి కుటుంబ సభ్యు లను కలిసి ఎంపీ బండి సంజయ్ కలిసి ధైర్యం అందించారు . కరీంనగర్ లోని కట్టరాం పూర్కు చెందిన విద్యార్థి పున్నం శ్రీకాంత్ కుటుం బసభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు.

  అక్కడ తమ పిల్లలు అవస్థలు పడుతున్నామంటూ కుటుంబ సభ్యుల ద్వారా కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సమాచారం అందించారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న సంజయ్ తక్షణమే స్పందించి ఉక్రెయిన్​లో చిక్కుకున్న విద్యార్థులను వెంటనే భారత్ రప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కార్యాలయానికి లేఖ రాసి మెయిల్​ ద్వారా పోస్టు చేశారు. కేంద్ర మంత్రి జైశంకర్ కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైన భారతీయులు ఉక్రెయిన్ లోని కీవ్ ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయారు . దీంతో అటు స్వదేశం రాలేక , ఇటు యూనివర్శిటీకి వెళ్లలేక దాదాపు 15 మంది ఎయిర్ పోర్టు వద్దే చిక్కుకుపోయారు .

  First published:

  Tags: Karimangar, Russia-Ukraine War, Telangana students

  ఉత్తమ కథలు