Home /News /telangana /

Karimnagar : కరీంనగర్‌లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్.. మిగిలింది ఆ నలుగురే..?

Karimnagar : కరీంనగర్‌లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్.. మిగిలింది ఆ నలుగురే..?

కాంగ్రెస్

కాంగ్రెస్

Karimnagar : కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకంతో ఆపార్టీలో జోష్ నిండిందని.. భవిష్యత్‌లో ఆ పార్టీ మరింత బలపడేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఉన్న నేతలు సైతం కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు..

    కరీంనగర్ జిల్లా...న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి.

    కరీంనగర్ జిల్లాలో ( Karimnagar Congress ) కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఆ జిల్లాలో నలుగురు ముఖ్య నాయకులు మాత్రమే మిగిలారు. తాజాగా పీసీసీ ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన సీనియర్ నాయకుడు చల్మెడ లక్ష్మీ నర్సింహారావు బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ ( TRS party ) వర్కింగ్ ప్రెసిడెంట్ , రాష్ట్ర ఐటీ , పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ( KTR ) సమక్షంలో పార్టీలో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు . చల్మెడ తో పాటు కరీంనగర్ , రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు .

    దీంతో ఆ పార్టీకి చెందిన నేతల్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ , పార్టీ జిల్లా అధ్యక్షుడు మానకొండూరు ఇన్చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ , చొప్పదండి ఇన్చార్జీ మేడిపల్లి సత్యం, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లాంటి నేతలు తప్ప పార్టీలో మిగిలింది ఎవరు లేరని చెప్పవచ్చు.. ( Karimnagar Congress ) . గత అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికల సమయం నుంచి నిన్నటి హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు వరకు చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ గూటికి చేరారు..


    Khammam : ఈ మద్యం రవాణాతో.. మతి పోవాల్సిందే.. పోలీసుల ఎత్తులకు స్మగ్లర్ల పై ఎత్తులు..


    అయితే.. టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టిన తరువాత పార్టీ బలపడుతుందని కార్యకర్తలు భావిస్తున్న తరుణంలో సీనియర్లు దూరమవు తుండటంతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు .గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏకంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఏకంగా గుడిని సైతం జిల్లా నేతలు నిర్మించారు.( Karimnagar Congress ) అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ మనుగడ సాధించడం కష్టంగా మారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తాజాగా నేడు డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీ సోనియా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోలేని పరిస్థితికి వచ్చింది . దీంతో ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై పార్టీ కేడర్‌ కొంత ఆందోళన కనిపిస్తుంది. ( Karimnagar Congress ) తిరిగి పార్టీ నిలదొక్కుకుంటుందా అనేది సమాధానం లేని ప్రశ్నగా మారిపోయిందని వాపోతున్నారు. మరోవైపు ఇటివల హుజూరాబాద్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు సైతం ఆపార్టీని మరింత ఆఘాతం లో పడేశాయని విశ్లేషకులు బావిస్తున్నారు.

    Hyderabad : ఆదిలాబాద్ కలెక్టర్ పై గోనే ప్రకాశ్ రావు వివాదస్పద వ్యాఖ్యలు... కేసిఆర్ బాషలో ఆమె...


    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

    మీ నగరం నుండి (కరీంనగర్)

    తెలంగాణ
    కరీంనగర్
    తెలంగాణ
    కరీంనగర్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Congress, Karimnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు