హోమ్ /వార్తలు /తెలంగాణ /

Farmers Power: ఒకడొచ్చి ప్రాజెక్టు అంటడు.. మరొకడు బ్రిడ్జి అంటడు.. మా భూములన్నీ మీకిస్తే మా పిల్లలకేం ఇవ్వాలి.. ప్రభుత్వంపై ఆ ఊరి రైతన్నల ఆగ్రహం

Farmers Power: ఒకడొచ్చి ప్రాజెక్టు అంటడు.. మరొకడు బ్రిడ్జి అంటడు.. మా భూములన్నీ మీకిస్తే మా పిల్లలకేం ఇవ్వాలి.. ప్రభుత్వంపై ఆ ఊరి రైతన్నల ఆగ్రహం

రైతులు ఏర్పాటు చేసిన బ్యానర్​

రైతులు ఏర్పాటు చేసిన బ్యానర్​

రాజ రాజేశ్వర జలాశయంకు అదనపు టీఎంసీ తరలింపు కోసం ప్రభుత్వం సంకల్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే రైతులు ప్రభుత్వానికి అదిరిపోయే షాక్​ ఇచ్చారు.

  (పి.శ్రీనివాస్, న్యూస్ 18, కరీంనగర్)

  మామూలుగా ఏ లోన్ కట్టకుంటేనో.. లేకపోతే చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడితేనో వివిధ ప్రభుత్వ అధికారులు (Government officials) ఫ్లెక్సీల పనిష్మెంట్ వాడుతుంటారు. లోన్ ఎగ్గొట్టిన వారి వివరాలో , లేక గ్రామ పరిధిలో నేరం చేసేవాళ్ళ డీటెయిల్స్ సదరు ఫ్లెక్సీలలో పెడతారు . అయితే ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు రైతులను ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. చూసి చూసి విసిగెత్తిన ఆ ఊరి రైతులు అధికారులకు జలక్​ ఇచ్చారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా రామడుగు (Ramadugu) మండలం లక్ష్మిపూర్ గాయత్రి పంప్ హౌజ్ నుంచి రాజ రాజేశ్వర జలాశయం(Reservoir) కు అదనపు టీఎంసీ (TMC) తరలింపు కోసం ప్రభుత్వం సంకల్పించింది. రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లా బోయినపల్లి మండలంలో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే రైతులు ప్రభుత్వానికి షాక్​ ఇచ్చారు. తమ భూములు ఇవ్వమని తేల్చిచెప్పారు. 46 రోజులుగా విలసాగర్ లో దీక్ష చేస్తున్నారు  రైతన్నలు . గత రెండు నెలల క్రితం  అధికారులు మా అనుమతి లేకుండా అడుగుపెడితే బడితే పట్టి జోపుడుకాయం చేస్తాం అనే ప్లెక్స్ ని ఏర్పాటు చేశారు రైతన్నలు. ఇప్పుడు అదే మండలంలో కొత్త ప్లెక్సీలు ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా భూధర్మం చేయండి రైతు గారు అంటే ఇచ్చేది లేదురా.. అనే టాగ్ లైన్ లో కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు అనే ప్లెక్సీని కట్టారు రైతులు.

  మా పిల్లలు ఎలా బతికేది..?

  ఇలా ఎందుకు చేస్తున్నారని రైతులను పలకరించగా గతంలోనే ఎకరాల ఎకరాలు భూమిని ప్రభుత్వనికి (Government) ధారదత్తం చేశాం. ఇంత వరకు సగం నష్టపరిహారం కూడా చెల్లించకుండా మళ్ళీ ఇప్పుడు భూములు (lands) ఇవ్వమంటే మేమేలా, మా పిల్లలు ఎలా బతికేది.. అంటున్నారు. ఒకరు వచ్చి భూమి అంటడు, మరొకడు వచ్చి బ్రిడ్జి అంటడు, ఇంకొక్కడు వచ్చి ప్రాజెక్టులు (Projects) అంటడు. ఇలా ఉన్న కాస్త భూములను  వారికే ఇస్తే మా పిల్లలు భవిష్యత్తు ఏంటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

  పాత బ్రిడ్జి కూలిపోయే దుస్థితి..

  మొన్నటికి మొన్న ఇదే మండల కేంద్రలో రైతులు ఏర్పాటు చేసిన బ్యానర్లు చర్చనీయాంశం అయ్యాయి. కరీంనగర్​లోని(Karimnagar) రామడుగు (Ramadugu) మండల కేంద్రానికి సమీపంలో నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జి (Bridge) నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడు సంవత్సరాలు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు . మరోవైపు రేపోమాపో పాత బ్రిడ్జి కూలిపోయే దుస్థితి ఏర్పడింది . దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. నిర్మాణ సమయంలో భూమి కోల్పోయిన నిర్వాసితులకు కూడా ఇప్పటివరకు నష్ట పరిహారం చెల్లించలేదు సరికదా కొత్త బ్రిడ్జి ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియని పరిస్థితి.

  ఎన్నిసార్లు అధికారులను అడిగినా ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు . కానీ సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేదు . దీంతో కోపం వచ్చిన రైతులు అధికారుల నిర్లక్ష్యాన్ని ఇలా బ్యానర్ కట్టి బ్యాండ్ వాయిస్తున్నారు బాధిత రైతులు .. అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారి పేర్లు , హోదా , నంబర్లు వేసి మరీ ఫ్లెక్సీలు కట్టిపడేశారు.

  రైతు ఏర్పాటుచేసిన బ్యానర్​

  ఇప్పటికైనా మారాలని కోరుతున్నారు రైతులు . మొదట ఓ రైతుకు ఈ ఆలోచన వచ్చింది . అంతే రోడ్డుపై ఫ్లెక్సీలు పెట్టాడు . దాన్ని అధికారులు వచ్చి  చించేశారు . ఇక ఊరంతా కూడబలుక్కొని కనిపించిన చోట ఫ్లెక్సీలు కట్టేశారు . ఇప్పుడు ఏం చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు. ఇదండీ రైతుల పవర్ (Farmers power in Karimnagar) . ఇది కాస్త సోషల్ మీడియాను ఆకర్షించింది . దీంతో రైతులు చేస్తున్న పోరాటానికి నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు . ఇది కాస్త వైరల్ కావడంతో అధికారులు , కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు . దీన్ని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్నారు

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Farmer, Karimangar, Siricilla

  ఉత్తమ కథలు