Home /News /telangana /

KARIMNAGAR FARMERS WERE ATTACKED WITH KNIVES IN THE FIELD DUE TO LAND DISPUTE IN KARIMNAGAR KNR PRV

Land disputes: హద్దులు చూడటంలో తేడా.. 4 గుంటల భూమి కోసం కత్తులతో రణరంగం.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మానవత్వాలు మంట కలిసి పోతున్నాయి.. చిన్న చిన్న సమస్యలకే కొట్టుకొని,  చంపుకుని పరిస్థితి వరకు వెళ్తున్నాయి.. భూ తగాదా (Land Dispute) విషయమై  కత్తులతో (Knife) పొలం రణరంగంగా మారిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India
    (Srinivas. P, News18, Karimnagar)

    మానవత్వాలు మంట కలిసి పోతున్నాయి.. చిన్న చిన్న సమస్యలకే కొట్టుకొని,  చంపుకునే పరిస్థితి వరకు వెళ్తున్నాయి.. భూ తగాదా (Land Dispute) విషయమై  కత్తులతో (Knife) పొలం రణరంగంగా మారిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు,  మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులు వివరాల ప్రకారం .. ఉమ్మడి కరీంనగర్​ (Karimnagar) జిల్లా వీణవంక మండల నికి చెందిన నోముల శ్రీనివాస్​కు గ్రామంలో 4 గుంటల భూమి (Land) ఉంది . దాన్ని మల్లయ్యకు విక్రయించాడు . అయితే హద్దులు (Boundaries) చూపించే విషయంలో గ్రామానికే చెందిన గెల్లు సమ్మయ్యకు , శ్రీనివాస్​కు గొడవలు జరుగుతున్నాయి . ఈ క్రమంలో బుధవారం శ్రీనివాస్ హద్దులు చూపించేందుకు వెళ్లగా సమ్మయ్య కుమారుడు కౌశిక్ తన వెంట తెచ్చుకున్న కత్తితో అతని కుమారుడు అక్షయ్ తోపాటు అక్కడే ఉన్న గెల్లు మల్లయ్యలపై దాడి చేశాడు . ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి . తండ్రి మృతి చెందాడు.. క్షతగాత్రులను హైదారాబాద్లోని (Hyderabad) ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు . నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. ఎస్సై శేఖర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు . అక్షయ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని , దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు .



    పెద్దపెల్లి జిల్లాలో..

    భార్యపై అనుమానం పెంచుకొని నిత్యం గొడవలు పడుతూ .. వేధింపులకు గురి చేస్తున్న భర్త భార్యను అతి కిరాతకంగా  చంపిన సంఘటన పెద్దపెల్లి (Peddapalli) జిల్లాలో కలకలం సృష్టిస్తుంది. పోలీసులు తెలిపిన ప్రకారం పెద్దపల్లి జిల్లా.పాలకుర్తి మండలం రాణాపూర్లో  కొలనూరి క్రాంతి ( 29 ) అనే మహిళను ఆమె భర్త అజయ్ అరెళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు.. భార్య పై (Wife) అనుమానం తో భర్త  నిన్న ఉందయం ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టి హత్య చేసి బసంత్నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడని ఎస్సై మహేందర్ తెలిపారు .

    Singareni: అదో మాయా ప్రపంచం.. ఆ గనుల్లో ఊపిరి అందదు.. వెంటిలేషన్​ ఉండదు.. నీరు దొరకదు.. 

    కొలనూరి అజయ్ వృత్తిరీత్యా లారీ డ్రైవర్ .. క్రాంతికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు . అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉండి డిగ్రీ వరకు చదువుకుంది . మేనమామ వరసైన అజయ్ కిచ్చి వివాహం చేయగా ఆరేళ్లపాటు దాంపత్య జీవితం సాఫీగానే సాగింది . అయితే కొంతకాలంగా దంపతులిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి . క్రాంతిని అజయ్ అనుమానిస్తూ వేధిస్తుండేవాడు .. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇనుప రాడ్డుతో తలపై గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలంలో గాజులు పగిలి ఉండటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది . హత్య అనంతరం అజయ్ ఫోన్ చేసి పోలీసులకు లొంగిపోయాడు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Karimangar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు