హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar:పంటను కాపాడుకోడానికి రైతు వినూత్న ప్రయోగం.. మర్కట బాధకు భల్లూక మంత్రం!

Karimnagar:పంటను కాపాడుకోడానికి రైతు వినూత్న ప్రయోగం.. మర్కట బాధకు భల్లూక మంత్రం!

రైతులు ఎక్కడికక్కడే కోతుల కట్టడికి వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు వినూత్న ప్రయోగాన్ని చేపట్టాడు. మర్కట బాధ విరుగుడుకు భల్లూక మంత్రమా అన్నట్టు..

రైతులు ఎక్కడికక్కడే కోతుల కట్టడికి వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు వినూత్న ప్రయోగాన్ని చేపట్టాడు. మర్కట బాధ విరుగుడుకు భల్లూక మంత్రమా అన్నట్టు..

రైతులు ఎక్కడికక్కడే కోతుల కట్టడికి వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు వినూత్న ప్రయోగాన్ని చేపట్టాడు. మర్కట బాధ విరుగుడుకు భల్లూక మంత్రమా అన్నట్టు..

    (P.Srinivas,News18,Karimnagar)

    గడిచిన ఏడేళ్లలో కోట్ల కొద్దీ మొక్కలు నాటడంతో అటవీ విస్తీర్ణం పెరిగిందని, కోతులను తిరిగి అడవుల్లకి పంపడమూ తమ లక్ష్యాల్లో ఒకటని సర్కారువారు చెబుతున్నా.. పల్లెల్లో రైతుల దుస్థితి ఏమీ మారలేదు. కోతుల గుంపులు పొలాలపై దాడి చేసి, పంటను నాశనం చేస్తోన్న ఘటనలూ తరచూ వెలుగులోకి వస్తున్నాయి. గ్రామస్తులు, రైతులు ఎక్కడికక్కడే కోతుల కట్టడికి వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు వినూత్న ప్రయోగాన్ని చేపట్టాడు. మర్కట బాధ విరుగుడుకు భల్లూక మంత్రమా అన్నట్టు కోతులను తరిమేయడానికి ఎలుగుబంటి వేషాన్ని ఆశ్రయించాడా రైతు. పూర్తి వివరాలివే..

    ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే మరోవైపు వన్యప్రాణుల దాడితో రైతులకు పంట నష్టం తప్పడం లేదు. అయితే వానారాలు(కోతులు) అడవిపందుల బారి నుండి పంటను రక్షించుకోవడానికి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల గ్రామానికి చెందిన రైతు భాస్కర్ రెడ్డి వినూత్నంగా ఆలోచించాడు.

    YS Sharmila: వైఎస్ షర్మిలపై తేనెటీగల దాడి.. కండువాలనే ఆయుధాలుగా ఇలా కాపాడారు..

    గ్రామ శివారులో తనకున్న పది ఎకరాల వ్యవసాయ భూమిలో ఐదు ఎకరాల్లో మొక్కజొన్న, మూడు ఎకరాలు బీర, రెండెకరాలు కాకరకాయ పంటను రైతు భాస్కర్ రెడ్డి సాగు చేస్తున్నాడు. అయితే పంటకు కోతుల ద్వారా ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉండడాన్ని గమనించి కోతుల బారి నుండి పంటను రక్షించుకోవడానికి ఏలుగుబంటి వేషధారణ ఉపయోగపడుతుందని గమనించాడు. హైదరాబాదులో తయారు చేస్తారని తెలుసుకున్న రైతు భాస్కర్ రెడ్డి  హైదరాబాద్ వెళ్లి 10 వేయిల రూపాయలు వెచ్చించి ఎలుగుబంటి వేషధారణను తయారు చేయించి తీసుకు వచ్చి పంటకు రక్షణగా ఉపయోగిస్తున్నాడు.

    Telangana : అప్పుడే 40 డిగ్రీలు దాటేసింది.. రాబోయే రోజులు అగ్నిగుండమే.. IMD ఆరెంజ్ అలర్ట్ జారీ

    పంటకు రక్షణగా ఉదయం, సాయంత్రం కోతుల గుంపు, అడవి పందులు రాకుండా ఎలుగుబంటి వేషధారణతో కూలీని పెట్టుకొని రోజుకు అతనికి 500 రూపాయలు చెల్లిస్తూ పంటకు కాపలా కాయిస్తున్నాడు. రైతు భాస్కర్ రెడ్డి పంటతో పాటు పక్కనే ఉన్న దాదాపు 25 ఎకరాల పంటకు కూడా నష్టం వాటిల్లకుండా ఈ ఎలుగుబంటి వేషధారణ ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఎలుగుబంటి వేషధారణతో కోతులను తరిమితే తిరిగి పది రోజుల వరకు పంటల వైపు రావని రైతులు తెలుపుతున్నారు.ఈ ఆలోచన బాగున్నదని రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    CM KCR.. మానవత్వం లేదా? బోయిగూడ మృతులకు రూ.5లక్షలేనా? : వీహెచ్ ఫైర్ -షాకింగ్ నిజాలు

    గతంలో రైతులు కోతుల కోసం ఇతర వన్యప్రనుల కోసం కరెంట్ షాక్ లు పెట్టి పంటను కాపాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు టెకనాలజీ పెరిగి రైతులు కూడ వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చూడుతున్నారు. సౌండ్ సిస్టమ్ పెట్టి లేక ఎయిర్ గన్ అలాంటి ఉపయోగించి పంటలను కాపాడుకునేవారు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగి రైతులు వివిధ రకాలుగా పంటలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ సత్ఫలితాలను పొందుతూ పంట దిగుబడి ఎక్కువ కూడా రాబడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం రోజు చూస్తున్న పరిస్థితి. ఎవరికైనా ఎలుగుబంటి వేషం కావాలంటే తనను సంప్రదిస్తే  ఇస్తానని రైతు తెలిపారు.

    First published:

    Tags: Farmer, Karimnagar, Telangana, VIRAL NEWS

    ఉత్తమ కథలు