Home /News /telangana /

KARIMNAGAR FARMER DIED AFTER FALLING INTO A WELL WHILE LEARNING TO DRIVE A TRACTOR IN KARIMNAGAR DISTRICT SNR KNR

Karimnagar : ఆ పథకంతో తలరాత మారుతుందనుకున్నాడు ..బ్రేక్ అనుకొని క్లచ్ తొక్కాడు .. అంతే

(రైతును మింగేసిన బావి)

(రైతును మింగేసిన బావి)

Karimnagar: లక్షలు పోసి కొనుక్కున్న వాహనం అతని ప్రాణాలు పోవడానికి కారణమవుతుందని అనుకోలేదు. డ్రైవింగ్ నేర్చుకుంటే త్వరగా పనులకు వెళ్లవచ్చనే తొందరపాటు అతని ప్రాణాలకు ముప్పు తెచ్చింది. డ్రైవింగ్ మోజులో పడి బ్రేక్‌కు బదులు క్లచ్ తొక్కాడు ప్రాణం పోయింది.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,New18,Karimnagar)
    వాహనం ఉపాధి కల్పిస్తుందని ఆశపడ్డాడు. కాని ఊపిరి తీసింది. ట్రాక్టర్‌ డ్రైవింగ్ నేర్చుకుంటే పొలం పనులకు వెళ్లవచ్చు అనే ఆలోచనతో సాగు భూమిలో ట్రాక్టర్ డ్రైవింగ్(Tractor driving) నేర్చుకునే క్రమంలోనే జలసమాధి అయ్యాడు. అందర్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సంఘటన కరీంనగర్(Karimnagar)జిల్లా బంజేరుపల్లి(Banjerupally)గ్రామంలో చోటుచేసుకుంది.

    ప్రాణం తీసిన వాహనం..
    కరీంనగర్ జిల్లా మానకొండూర్ పంచాయతీ పరిధిలోని బంజేరుపల్లికి చెందిన 45సంవత్సరాల కాంపెల్లి శంకర్‌కు ఇటీవలే దళితబంధు యూనిట్ మంజూరవడంతో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు . ప్రస్తుతం వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో డ్రైవింగ్ నేర్చుకుంటే పనులకు వెళ్లవచ్చని భావించాడు. రెండు రోజులుగా తిమ్మాపూర్ మండలంలోని యాదవులపల్లె శివారు వ్యవసాయ భూమిలో డ్రైవర్ మల్లేశ్‌ సహకారంతో పొలందున్నే పని నేర్చుకుంటున్నాడు శంకర్. గురువారం సాయంత్రం కూడా శంకర్‌ రోజు మాదిరిగానే ట్రాక్టర్‌ నడుపుతున్నాడు. ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.



    ఉత్సాహం తీరక ముందే ఊపిరి పోయింది..
    ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న శంకర్‌, డ్రైవింగ్ నేర్పిస్తున్న మల్లేశ్‌ వాహనంతో పాటు నీళ్లలో పడిపోయారు. ఈ ఘటనలో మల్లేశ్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. శంకర్ నీటిలోనే మునిగి మృతిచెందాడు. మల్లేశ్ ఇచ్చిన సమాచారంతో గ్రామస్తులు వెంటనే బావి వద్దకు చేరుకున్నారు. ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రమోద్‌రెడ్డి తన సిబ్బందితో సహా ఘటన స్తలానికి చేరుకొని పరిశీలించారు. వ్యవసాయ బావి పెద్దది కావడం వర్షానికి నీళ్లు చేరడంతో మృతదేహాన్ని, ట్రాక్టర్‌ని గుర్తించడం సాధ్యం కాలేదు.వెంటనే పోలీసులు క్రేన్‌ని తెచ్చింపి ట్రాక్టర్‌ని బయటకు తీయించేందుకు ప్రయత్నించారు.

    OMG : వివాహితపై అత్యాచారం..ఆమె భర్తపై దాడి ..బాధితుల ఫిర్యాదుతో సీఐ నాగేశ్వరరావుపై వేటు



    డ్రైవింగ్ నేర్చుకుంటూ జలసమాధి..
    భారీ వర్షం కారణంగా గురువారం రాత్రి సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. గజ ఈత గాళ్లు బావిలోకి దిగేందుకు వెనుకాడారు . వర్షంలో పోలీసులు , స్థానికులు రాత్రి 8 గంటల వరకు శ్రమించినా ఫలితం లేకపోయింది . దీంతో ఎస్సై మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వర్షం తగ్గగానే శంకర్ మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీయించారు.

    బ్రేక్ అనుకొని క్లచ్ తొక్కాడు..
    శంకర్‌ ట్రాక్టర్‌తో సహా పడిపోయిన బావి వాడకంలో లేక చుట్టూ చెట్లు  మొలకెత్తిన నేపథ్యంలో అక్కడ బావి ఉన్న విషయాన్ని మృతుడు గుర్తించలేకపోయాడని కమిషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. ట్రాక్టర్ కొన్న కొత్త సంతోషంలో బ్రేకులు తొక్కకుండా ఎక్సలేటర్ తొక్కడం వల్ల ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడిందన్నారు. ఆ ట్రాక్టర్ శంకర్‌పై పడటం వల్ల శంకర్ మృతి చెందాడన్నారు కమిషనర్. ఇలాంటి అనుమతులు లేని బావులను రైతులు మూసివేయాలని రైతులకు సూచించారు.

    Telangana: తెలంగాణలో మరో 3 రోజుల పాటు కుండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

    Published by:Siva Nanduri
    First published:

    Tags: Farmer, Karimnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు