(P.Srinivas,New18,Karimnagar)
జగిత్యాలjagityal జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడటం విషాదం నింపింది. కృష్ణానగర్(Krishnanagar)కు చెందిన ఆకోజు కృష్ణమూర్తి(Krishnamurthy)అప్పుల బాధ తాళలేక గత నెల 21 న భార్య శైలజ(Shailaja), కుమారుడు ఆశ్రిత్ (Ashrit), కుమార్తె గాయత్రి(Gayatri)లతో కలిసి పురుగు మందు తాగాడు. వారందరినీ మొదట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్(Hyderabad) తరలించారు. చికిత్స పొందుతూ మొదట అదే నెల 24 న కృష్ణమూర్తి మృతి చెందగా ఈనెల 5 న కుమార్తె గాయత్రి బుధవారం కుమారుడు ఆశ్రిత్ , గురువారం ఉదయం భార్య శైలజ మృతి చెందారు . శైలజ , ఆశ్రిత్ మృతదేహాలను గురువారం సాయంత్రం జగిత్యాలకు తెచ్చి అంత్యక్రియలు నిర్వహించారు . తల్లీకుమారులిద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించడం చూపరులను కంటతడి పెట్టించింది.
24రోజుల్లో ఒకే ఫ్యామిలీలో నలుగురు..
జగిత్యాల జిల్లాలో ఫ్యామిలీ సూసైడ్ కలకలం రేపింది. బంగారం, వెండి ఆభరణాలు చేసే ఆకోజు కృష్ణమూర్తి అనే వ్యక్తి అవసరాల నిమిత్తం 30 లక్షల అప్పులు చేశాడు. ఏడాదిన్నర క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా కొన్ని రోజులకు ఉమ్మడి ఆస్తిని విక్రయించారు. అయితే అప్పుల బాధతో ఉన్న కృష్ణమూర్తి విషయమై బంధు, మిత్రులు సైతం ఆసరాగా నిలవకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆర్ధిక ఇబ్బందులల్లో తనకు అప్పుల ఊబిలోంచి బయటపడే మార్గం లేకపోవడంతో కుటుంబ సభ్యులకు పురుగుల మందు తాగించి ...అటుపై తాను తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గతేడాది కంటే ఎక్కువే ..
ఆగస్ట్ 24న ఈసంఘటన జరిగింది. ఆ రోజు అందరూ కలిసే పురుగు మందు సేవించినప్పటికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నెల రోజులు తిరగకుండా భార్య ఇద్దరు పిల్లలతో పాటు కృష్ణమూర్తి చనిపోవడం అందర్ని కలచివేసింది. కేవలం 24 రోజుల వ్యవధిలో ఒక్కొక్కరూ రాలిపోవటంతో కుటుంబమంతా కడతేరినట్లయింది. జగిత్యాల జిల్లాలో బలవన్మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతేడాది 282 మంది బలవన్మరణం చేసుకుంటే...ఈ సంవత్సరం 9నెలల్లోనే 172 మంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా అధికార లెక్కలు చెబుతున్నాయి.
పెరుగుతున్న ఆత్మహత్యలు..
నెలరోజుల్లో పది మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అందులో ఆరుగురు కేవలం ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలోని ఒకే కుటుంబంలో నలుగురు అప్పుల బాధతో బలవన్మరణం చెందగా గత నెల 23 న గొల్లపల్లి మండల కేంద్రంలో ఒకరు , 24 న మల్యాల మండలం మద్దుట్లలో ఒకరు అప్పుల బాధతో సూసైడ్ చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కాకుండా అనేక కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.గత నెల 26 న రాయికల్ మండలం రామారావుపల్లెలో ఓ యువకుడు తల్లిదండ్రులు ద్విచక్ర వాహన కొనివ్వలేదని బలవన్మరణానికి పాల్పడగా జిల్లా కేంద్రంలోని సమస్యలతో ఆత్మహత్యలు చేసుకోవటం పరిష్కారం కాదని జగిత్యాల డీఎస్పీ ఆర్.ప్రకాష్ అన్నారు . ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో నిలదొక్కుకోవాలని ఆత్మహత్యలపై పోలీసు కళాబృందాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Family suicide, Jagityal, Telangana News