Home /News /telangana /

KARIMNAGAR FAMILY MEMBERS INVITED TO THE HOUSE TO CELEBRATE THE BIRTH OF A BABY GIRL IN JAGITYALA DISTRICT SNR KNR

Telangana : కోడలికి మళ్లీ ఆడపిల్లే పుట్టింది .. కుటుంబ సభ్యుల రియాక్షన్ చూస్తే షాక్ అవుతారు

(Birth Celebrations)

(Birth Celebrations)

Telangana : ఆ తల్లి జన్మధన్యమైంది. ఆడబిడ్డను కన్నందుకు మెట్టినింట్లో ఘనస్వాగతం లభించింది. రెండో కాన్పులో కూడా మగబిడ్డ పుట్టలేదనే నిరాశపడకుండా ..కోడలితో పాటు పుట్టిన బిడ్డకు మంగహారతులతో స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు.

    (P.Srinivas,New18,Karimnagar)
    నిత్యం ఏదో ఓ చోట లింగ వివక్షతో వేధింపులు, ఆడబిడ్డను కన్నందుకు తల్లులకు చిత్రహింసలు, ఆడపిల్ల పుట్టినందుకు అదనపు కట్నం తీసుకురావాలనే కండీషన్స్‌ పెడుతున్న సంఘటనలో చూస్తూనే ఉన్నాం. కాని ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం కాదు..ఇంటికి భాగ్యలక్ష్మి అని భావించే రోజులు వస్తున్నాయి. తెలంగాణ(Telangana)లోని జగిత్యాల(jagtial)జిల్లాలో అలాంటి అరుదైన సంఘటనే ఇప్పుడు అందరికి ఆదర్శవంతంగా నిలిచింది. గర్బిణిగా వెళ్లిన కోడలు పండంటి ఆడబిడ్డను ప్రసవించిందని తెలిసి భర్త, అత్త,మామలు సంబరపడిపోయి తల్లీ,బిడ్డలకు ఘనంగా స్వాగతం పలికారు.

    Telangana : అంకాపూర్‌ మొక్కజొన్న కంకులకున్న డిమాండే వేరు .. ఈ సీజన్లో రోజుకు వెయ్యి మందికిపైగా ఆదాయం


    పుట్టగానే తల్లికి గౌరవం తెచ్చిన బిడ్డ..
    జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణానికి చెందిన మోటూరి శ్రావణ్ - అశ్విని దంపతులకు మొదటి సంతానంగా పాప పుట్టింది. ఇప్పుడు రెండవ సంతానంగా మళ్ళీ పాప పుట్టింది. అయినప్పటికీ ఎలాంటి నిరాశ చెందకుండా మా ఇంటికి శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందంటూ భర్త, అత్త,మామలతో పాటు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. తల్లీ, బిడ్డలకు ఘనస్వాగతం పలుకుతూ ఇల్లంతా పూలతో అలంకరించారు. ఇంటికి మహాలక్ష్మిని తీసుకొస్తున్న సందర్భంగా కోడలితో పాటు మనవరాలికి మంగళ హరతులు ఇచ్చి మరీ ఇంట్లోకి ఆహ్వానించారు.



    ఆడపిల్ల అడుగుపెట్టిందని సంబరాలు..
    ఆడపిల్ల అంటే భారం అనుకొని...ఆడబిడ్డను కంటే కోడల్ని రాచి రంపాన పెడుతున్న ఈరోజుల్లో రెండో కాన్పులో కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చిన కోడలిని ..ఆమె బిడ్డను అదృష్టంగా భావించి .. ఆత్మీయ,అనురాగాలతో స్వాగతం పలకడం చూసి అందరూ హర్షిస్తున్నారు. అంతే కాదు ఆడపిల్ల ఎప్పుడూ ఇంటికి భారం కాదని మహాలక్ష్మి అని ప్రతి ఒక్కరు భావించాలని శ్రావణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా గమ్మతైన విషయం ఏమిటంటే శ్రావణ్‌ సోదరికి కూడా ఇద్దరూ ఆడ సంతానమే కలిగినప్పటికి ఆ తల్లిదండ్రులు ఎలాంటి విచారం చెందకుండా ప్రేమానురాగాలు పంచడం గొప్ప విషయమని స్థానికులు అంటున్నారు. శ్రావణ్ తల్లిదండ్రులు మాత్రం తమ ఇద్దరు బిడ్డలకు నలుగురు ఆడపిల్లలు పుట్టినప్పటికి ఎంతో సంతోషంగానే ఉన్నామన్నారు.

    Crime news : ఆ ఒక్క మాటతో ఆంటీ మనసు దోచుకున్నాడు.. తన కోరిక తీరగానే ఆ విధంగా బ్లాక్‌మెయిల్



    ఆదర్శవంతులు ..
    గతంలో కూడా ఇదే విధంగా జగిత్యాలలోని విద్యానగర్‌లో ఉంటున్న రాహుల్ - సుప్రియ దంపతులకు మొదటి కాన్పులోనే ఆడపిల్ల జన్మించింది . ఆడపిల్ల పుట్టిందని తెలిసిన వెంటనే ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి . తమ కోడలు ఆడపిల్లకు జన్మనిస్తే ఇల్లంతా అందంగా అలకరించి , పూల మధ్యలో పడుకోబెట్టి వైభవంగా వేడుకలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇంట్లో 8 రూపాల్లో అమ్మవారి ప్రతిమల్ని ఏర్పాటు చేసి , ఇంట్లోకి హారతితో పాపను ఆహ్వానించారు . ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని పాపకు మహాలక్ష్మిగా పేరు పెట్టారు కుటుంబసభ్యులు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Karimnagar, Save Girl Child, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు