Home /News /telangana /

KARIMNAGAR FAKE PREGNANCY CREATES A MARRIED WOMAN DUE TO GET MARRY HER LOVER KNR VRY

Karimnagar : మాములు కి"లేడి' కాదు.. భర్తను వద్దనలేక, ప్రియుడిని విడవ లేక, ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karimnagar : పెళ్లి ముందే ఒకరిని ప్రేమించింది.తల్లిదండ్రుల మాటను కాదనలేక మరో యువకున్ని పెళ్లి చేసుకుంది.. తీరా పెళ్లి తర్వాత ప్రియుడిపై మనసు పారేసుకోవడంతో భర్త నుండి దూరంగా ఉండేందుకు ఓ నాటకానికి తెరతీసింది.

    ప్రేమించడం ఆ తర్వాత పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు అబ్బాయిలు, అమ్మాయిల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. సాధారణ పెళ్లిళ్లతో పాటు ప్రేమ పెళ్లిల్లు కూడా ఎక్కువ సంఖ్యలోనే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఓ చిక్కు వచ్చిపడింది. తాము ప్రేమించిన అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో ఒప్పించలేక చాలా మంది పారి పోయి పెళ్లిలు చేసుకోవడం కూడా కామన్ మారింది. అయితే ఇంకా కొంతమంది కాస్త వెరైటి గా ప్రవర్తిస్తున్నారు. తామ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా తల్లిదండ్రులను ఎదిరించే ధైర్యం లేక వారు చూసిన సంబంధాన్నే చేసుకుంటున్నారు.. ఆ తర్వాత ఆసలు కథ అప్పుడు నడిపిస్తున్నారు. ప్రేమించిన వారిని మరిచిపోలేక పెళ్లి చేసుకున్నవారికి చెక్ పెడుతున్నారు. ఇలా చాలా మంది పెళ్లి తర్వాత భర్తల నుండి భార్యలు, భార్యల నుండి భర్తలు దూరంగా ఉంటూ తమకు అనుకూలంగా పరిస్థితులను మలచుకుంటున్నారు..

    ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన ఓ వివాహితకు తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లి తర్వాత కూడా మరిచి పోలేక ఓ సరికొత్త నాటకానికి తెరతీసింది. భర్త నుండి దూరంగా ప్రియుడికి దగ్గరయ్యెందుకు ఓ ప్లాన్ వేసింది. పెళ్లి తర్వాత కొద్ది రోజుల పాటు భర్తతో పాటు ఉన్న ఆమె ఆ తర్వాత తన ప్రియుడిని చేరుకునేందు గర్భం అనే నాటకానికి తెరతీసింది.తనకు గర్భం వచ్చిందని చెప్పడంతో పాటు అందుకు సంబంధించి ఆసుపత్రి రికార్డులు కూడా సృష్టించింది. ఈ కారణంతో పుట్టింటికి వెళతానని చెప్పి తొమ్మిది నెలల పాటు అక్కడే ఉంది. ఆ తర్వాత ప్రియుడి ప్రేమలో సేద తీరింది. అయితే ఈ విషయం తెలియని భర్త నిజమే అనుకుని నమ్మాడు. అయితే తొమ్మిది నెలలు గడుస్తున్న పుట్టింటి నుండి రానంటున్న భార్యపై అప్పుడు భర్తకు అనుమానం వచ్చింది. ఫోన్ చేస్తే లిఫ్టు చేయడం లేదు. ఇదేంటని తన వద్ద ఆసుపత్రి రికార్డులను పట్టుకుని ఆసుపత్రికి వెళితే అవి ఫేక్ అని తేల్చారు.

    Khammam : ముందుగా మర్యాద రామన్న ఆ తర్వాత మున్నాభాయ్ ఎంబీబీఎస్.. మాములుగా లేదు కథ..

    దీంతో విషయాన్ని తెలుసుకునేందుకు ఆ యువకుడు అత్తవారింటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసింది. ప్రియుడిని విడిచి రానని మొండికేసింది. దీంతో ఖంగుతిన్న భర్త, తన భార్యతో పాటు ప్రియుడి పై కేసు పెట్టడడం తో మొత్తం వ్యవహారం బయటకు పొక్కింది. అయినా తాను రాలేనని మొండికేయడంతో చేసేది ఏమి లేక భర్త మౌనంగా వెళ్లి పోయాడు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Karimnagar, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు