Fake Mask Mafia: మాస్క్ మాఫియా.. ఫేమస్ కంపెనీ లోగోతో వ్యాపారం.. జోరుగా నకిలీ మాస్క్ ల దందా..

నకిలీ ఫేస్ మాస్క్ లు , లోగోలు

Fake Mask Mafia: కాదేది నకిలీలకు అనర్హం అన్న చందంగా మారింది నకిలీల బాగోతాలు. ఫేస్ మాస్క్ లను కూడా లోగో లను మార్చి కొందరు వ్యాపారులు విక్రయిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించడం వారి వద్ద నుంచి కొన్ని లక్షల రూపాయలను విలువచేసే మాస్క్ లను , ప్రింటింగ్ సామాన్లను స్వాధీనం  చేసుకున్నారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

 • Share this:
  గత సంవత్సరం నుంచే కరోనా వైరస్ కారణంగా ఎక్కడ చూసినా మాస్క్ ల విక్రయాలు జోరందుకున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించడం జరుగుతుందని ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రతీ ఒక్కరూ మాస్క్ లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ మాస్క్ లల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులోనే ఎక్కువగా ఇష్టపడే మాస్క్ రామ్ రాజ్ కాటన్ మాస్క్ . దానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అయితే దీనినే ఆసరా చేసుకొని ఓ వ్యాపారి వినియోగదారులను మోసం చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ కు చెందిన ఈగ బలరాం సెస్ రోడ్ లో గత కొన్ని సంవత్సరాల నుండి బలరాం క్లాత్ స్టోర్ దుకాణం నడిపిస్తున్నాడు. ప్రస్తతం కరోనా వైరస్ వ్యాప్తి సందర్బంగా.. మాస్కుల ఆవశ్యకత దృష్టిలో పెట్టుకుని మామూలు మాస్కులు  అమ్ముతున్నారు. వాటికి సరైన ధర రాకపోవడం.. సరైన అమ్మకాలు జరగడం లేదని భావించి,అదే బ్రాండెడ్ మాస్కులు అయితే విరివిగా అమ్మకాలు,అధిక ధరలు పొందవచ్చని భావించాడు. ప్రస్తుతం మార్కెట్ లో రాంరాజ్ కాటన్ కంపనీ మాస్కులకు మంచి గిరాకీ ఉంది.

  ప్రజలు ఇష్టాలకు అనుగుణంగా రామ్ రాజ్ కాటన్ మాస్క్ లోగోను కాపీ కట్టాలని నిర్ణయించుకున్నాడు. గత మూడు నెలల కాలంగా ఈగ బలరాం తనకు తెలిసిన ఉమా శంకర్ ప్రింటింగ్ ప్రెస్ యజమాని వద్ద అతని ప్రింటింగ్ ప్రెస్ లో రాం రాజ్ కంపని వారి లోగొను కంప్యుటర్ లో డిజైన్ చేయించి తాను తయారు చేసిన మాస్క్ లపై పెట్టి విక్రయిస్తున్నాడు. ఇలా ఉమా శంకర్ ఇంట్లో స్క్రీన్ ప్రింటింగ్ చేసి తాను రాం రాజ్ కాటన్ హోల్ సేల్ డీలర్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి ప్రతీ షాప్ లో విక్రయించేవాడు.   ఒక్కో మాస్క్ కు హోల్ సేల్ గా సుమారు 20/- నుండి 50/- రూపాయల వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇతను సిరిసిల్ల లోకల్ లో కాకుండా.. రాష్ట్రం లో వివిధ ప్రాంతాలైన హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తూ అక్రమ లాభార్జన చేస్తున్నాడు.

  వివరాలను వెల్లడిస్తున్న పోలీసులు


  సడన్ గా తమ కంపెనీ మాస్క్ ల అమ్మాకాలు తగ్గడం, అతి తక్కువ ధరలో తమ కంపెనీ మాస్క్ లు దుకాణాలలో అమ్ముతున్నారని కంపెనీ కి సమాచారం అందింది. దీంతో వారు సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ పరిశోధనలొ ఈగ బలరాం ఈ పనికి పాల్పడుతున్నాడని తెలిసి, ఈగ బలరాం మరియు ఉమా శంకర్ ల ను అదుపులోకి తీసుకుని వారి దుకాణంలో మరియు ఉమా శంకర్ ఇంటి పై రైడ్ చేశారు. వారి వద్ద ఉన్న సుమారు ఐదు లక్షలు రుపాయలు విలువైన నకిలీ రాంరాజ్ కాటన్ మాస్క్ లు, ప్రింటింగ్ సామగ్రి, కంప్యూటర్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిజినల్ లోగో ను ఎలాంటి కంపెనీ అనుమతులు లేకుండా ట్రేడ్ మార్క్, పేటెంట్ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలను, కంపెనీని మోసం చేస్తుండటంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి నకిలీ మాస్క్ ల అమ్మకం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైన ఇటువంటి చర్యలకు పాల్పడుతే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల పోలీసులు హెచ్చరించారు.
  Published by:Veera Babu
  First published: