Home /News /telangana /

KARIMNAGAR FACK FACE BOOK ID CREATED BY CYBER GANG AND DEMANDED MONEY VS KNR

cyber crime : పోలీసు కమీషనర్‌కు ఫేక్ ఐడి... డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ ముఠా...

రామగుండం సీపీ వి.సత్యనారాయణ

రామగుండం సీపీ వి.సత్యనారాయణ

cyber crime : సైబర్ నేరగాళ్ల బెడద పోలీసులను సైతం తాకింది ..తెలంగాణలో ఓ పోలీసు ఉన్నతాధికారి నకిలీ ఫెస్‌బుక్ అకౌంట్ సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు.



సైబర్ నేరగాళ్లకు సామాన్యులైనా..ఉన్నత స్థాయిలో ఉండే అధికారులైన పర్వాలేదు..తమకు కావల్సింది డబ్బు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. డబ్బులు రావాలంటే ఎవరిని ఎలా సైబర్ వలలో వేయాలనే వ్యూహలే నిరంతరం వేస్తున్నారు. ఈజీగా నమ్మెందుకు వీలుండే వారికి ఫేక్ అకౌంట్లు సృష్టించి డబ్బులు కాజేస్తున్నారు. కొసమెరుపు ఏమంటే సామాన్యులను మోసం చేస్తే...పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తారు...అలాంటిది ఏకంగా ఓ ఐపిఎస్ ఉన్నతాధికారినే మోసం చేసేందుకు ప్రయత్నం చేశాడు.. పోలీసులైతే ఎవరు ఫిర్యాదు ఉండదని ప్లాన్ వేశాడు. అయితే విషయం తెలిసిన పోలీసు అధికారి అలర్ట్ అయి.. తన బలగాల చేత నిందితున్ని పట్టుకునే పనిలో ఉన్నారు.

వివరాల్లోకి వెళితే రామగుండం పోలీసు కమీషనర్ వీ సత్యనారయణ పేరుతో ఓ నకిలీ ఫేస్‌బుక్ ఐడిని సృష్టించారు సైబర్ నేరగాళ్లు. V sathyanarayana Ips పేరుతో పలువురిని డబ్బులు అడిగి ఫోన్ పే, గూగుల్ పే అకౌంట్‌కు డబ్బులు పంపాలంటూ మెసేజ్‌లు పంపారు. తనకు అత్యవసరం ఉందంటూ 10 నుండి 20వేల వరకు అకౌంట్‌లో వేయాలని మెసెజ్‌లలో పేర్కోన్నారు. సీపీ మాట్లాడుతున్నట్టుగా నమ్మించి తక్కువ మొత్తంలో డబ్బులు అడిగారు , పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు చిన్న మొత్తంలో అడగడంతో తెలిసిన వారు వెంటనే అకౌంట్‌లలో వేశారు.

కాగా డబ్బుల వసూలు పై సీపీ సత్యనారయణ నేడు స్పందించారు. తన పేరుతో డబ్బులు అడుగుతున్న ఫేస్ బుక్ అకౌంట్ తనది కాదని స్సష్టం చేశారు. తనకు కనీసం గూగుల్ పే అకౌంట్ కూడ లేదని చెప్పారు. ఇది నకిలీల పనేనంటు తెలిపారు. మరోవైపు ఫేక్ ఐడి క్రియోట్ చేసిన అడ్రస్ ట్రేస్ చేసినట్టు చెప్పారు. అది యూపికి చెందిన మిత్లేష్ నవీన్ అనే పేరు మీద ఉందని చెప్పారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పారు. తన పేరు మీద ఎవరు డబ్బులు అడిగినా పంపవద్దని సీపీ తెలిపారు.
Published by:yveerash yveerash
First published:

Tags: CYBER CRIME, Peddapalli, Police commissionarate, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు