KARIMNAGAR EXCITED HIJRAS DEMANDING MONEY AT WEDDINGS AND FACING PROBLEMS MANY FAMILIES IN KARIMNAGAR KNR VB
Hijras With Nude Appearance: రెచ్చిపోతున్న హిజ్రాలు.. పెళ్లిలో డబ్బులు ఇవ్వలేదని నగ్న ప్రదర్శనలు.. ప్రశ్నించారో ఇక ఆగమాగం..
పెళ్లిలో హల్ చల్ చేస్తున్న హిజ్రాలు
Hijras With Nude Appearance: పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక . దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరిపించాలని అనుకుంటారు . కానీ ఈ మధ్య హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి . మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు.
Hijras With Nude Appearance: పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక . దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరిపించాలని అనుకుంటారు . కానీ ఈ మధ్య హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి . మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు.తాజాగా నిన్న జగిత్యాల రూరల్ మండలం పారండ్ల గ్రామానికి చెందిన భీమయ్య కుమారుడి వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిపించారు . రాత్రి బరాత్ జరుగుతున్న సమయంలో హిజ్రాలు వచ్చి , వీరంగం సృష్టించారు . పెళ్లి కుమారుడిని డబ్బులు డిమాండ్ చేశారు . అతను నిరాకరించడంతో రెచ్చిపోయి , నగ్నంగా డ్యాన్స్ చేయడంతో అక్కడున్నవారు పారిపోయారు .
రెండు రోజుల కిందట జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన రమణ కుమారుడి పెళ్లి స్థానిక ఓ ఫంక్షన్ హాలులో జరిగింది . హిజ్రాలు వేదికపైకి వెళ్లి .. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు . డబ్బులివ్వాలంటూ అసభ్య పదజాలం వాడారు . దీంతో ఆయన రూ .5 వేలు ఇచ్చాడు. మాకు అవి సరిపోవని.. రూ.50 వేలు కావాలని.. అవి ఇస్తేనే ఇక్కడ నుంచి వెళ్లి పోతామని వీరంగం స్పష్టించారు. ఎంత చెప్పినా వినకుండా పెళ్లి మండపంపైనే కూర్చున్నారు. చేసేది ఏమి లేక వధువు వరుడు తరుఫున రూ. 50 వేలు ఇచ్చి అక్కడి నుండి పంపించారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని ఫంక్షన్‌హాళ్లలో హిజ్రాలు హల్ చల్ చేస్తున్నారు . ఒక్కో పెళ్లికి రూ .5 వేల నుంచి రూ .50 వేల వరకు వసూలు చేస్తున్నారు .
దీంతో వధూవరుల తల్లిదండ్రులు తమ బంధువులు , స్నేహితుల ముందు హేళన కావొద్దనివారు అడిగినంత ముట్టజెబుతున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు , కుటుంబ సభ్యులు , స్నేహితులు భయపడుతున్నారు . ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు . దీంతో అందరూ జంకుతున్నారు .
హిజ్రాల ఆగడాలను అరికట్టాలని.. జిల్లాలో వివాహ వేడుకలకు వచ్చి , హిజ్రాలు మామూళ్లు కావాలని డిమాండ్ చేస్తున్నారని.. ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో ఫంక్షన్ కు వచ్చిన వారంతా భయపడుతున్నారని.. వీటిపౌ పోలీసులు స్పందించి , హిజ్రాల ఆగడాలను అరికట్టాలని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. హిజ్రాలు మామూళ్ల కోసం డిమాండ్ చేస్తే బాధితులు 100 డయల్ కాల్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా ఏసీపీ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.