Home /News /telangana /

Etela Rajender: ఈటల పర్యటనలో ఉద్రిక్తత.. చిరిగిన స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐ చొక్కా..

Etela Rajender: ఈటల పర్యటనలో ఉద్రిక్తత.. చిరిగిన స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐ చొక్కా..

ఈటల రాజేందర్(ఫైల్ ఫొటో)

ఈటల రాజేందర్(ఫైల్ ఫొటో)

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈటల రాజేందర్ సోమవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్‌లో పర్యటించారు.

  మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈటల రాజేందర్ సోమవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్‌లో పర్యటించారు. అక్కడ ఈటల రాజేందర్ సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఆ సమయంలో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్‌ఐ బాపిరెడ్డి బీజేపీలో చేరుతున్నవారి ఫొటోలు తీసినట్టుగా బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే అక్కడ తోపులాట చోటుచేసుకోవడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలో ఏఎస్‌ఐ చొక్కా చిరిగిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Bjp, Etela rajender, Karimnagar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు