Home /News /telangana /

KARIMNAGAR ETELA RAJENDER TO TAKE OATH AS HUZURABAD MLA IN TELANGANA ASSEMBLY MKS

Etela Rajender : అసెంబ్లీలో RRR -Huzurabad ఎమ్మెల్యేగా నేడు ఈటల ప్రమాణం

ఈటల ప్రమాణం నేడు

ఈటల ప్రమాణం నేడు

హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండు సార్లు మంత్రిగానూ పనిచేసిన ఈటల ఇప్పుడు బీజేపీ నుంచి గెలవడంతో కమలనాథుల అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ కల నెరవేరినట్లయింది..

ఇంకా చదవండి ...
తెలంగాణ బీజేపీ నేతలు గత ఆరు నెలలుగా వల్లెవేస్తోన్న ‘అసెంబ్లీలో RRR’ దృశ్యం నేడు సాక్షాత్కారం కానుంది. ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభ స్పీకర్ ఛాంబర్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈటల ప్రమాణస్వీకారం కోసం అసెంబ్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయని, వీలును బట్టి ప్రమాణ స్వీకారానికి ముందు లేదా తర్వాత బీజేపీ కార్యాలయానికి ఈటల ర్యాలీగా వెళ్లే అవకాశాలున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ఎన్నికల, పరిపాలనకు సంబంధించి ఈటలది సుదీర్ఘ ప్రస్థానం. గతంలో టీఆర్ఎస్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్.. రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. తాజా ఉప ఎన్నికతో ఆయన ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచినట్లయింది.

సీఎం కేసీఆర్ తో, టీఆర్ఎస్ తో దాదాపు 20ఏళ్ల అనుబంధమున్న ఈటల.. అనూహ్యరీతిలో భూకబ్జా ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయారు. ఈటల భూములపై విచారణకు ఆదేశించి కేసీఆర్.. ఉన్నపళంగా ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం సంచలనం రేపింది. ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి జూన్‌ 12న ఈటల రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 24వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థిగా ఈటల విజయం సాధించారు.

ఇప్పటిదాకా తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి రాజాసింగ్(గోషామహల్), రఘునందన్ రావు (దుబ్బాక) ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా, ఇప్పుడు రాజేందర్ (హుజూరాబాద్) తోడు కావడంతో RRR కాంబినేషన్ ఏర్పడిందని, ఇక కేసీఆర్ సర్కారుకు చుక్కలు చూపిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాగా, హుజూరాబాద్ లో విజయం తర్వాత కూడా ఈట‌ల రాజేంద‌ర్ భూముల వ్య‌వ‌హారంలో మ‌రోసారి అధికారులు చ‌ర్య‌లకు దిగారు. మెద‌క్ జిల్లా హ‌కీంపేట‌లోని ఈటల సంస్థల్లో స‌ర్వే చేస్తామని, దానికి హాజరు కావాల్సిందిగా ఈటల సతీమణి జమున, కొడుకు నితిన్ రెడ్డిలకు తూప్రాన్ ఆర్డీవో నోటీసులు జారీ చేశారు.

మీ నగరం నుండి (కరీంనగర్)

తెలంగాణ
కరీంనగర్
తెలంగాణ
కరీంనగర్
Published by:Madhu Kota
First published:

Tags: Etela rajender, Huzurabad, Huzurabad By-election 2021, Telangana Assembly

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు