Huzurabad: గులాబీ గూటికి చేరుతున్న ఈటెల అనుచరులు.. గులాబీ బాస్ ప్లాన్ అదేనా.. అసలేం జరుగుతోంది..

సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్)

Huzurabad: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టిఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది . ఇప్పటికే మోత్కుపల్లి కూడా దళితబంధుకు ఆకర్శితులయ్యారు. అలాగే కౌశిక్ రెడ్డి ఇప్పటికే సిఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. ఇలా ప్రతీ ఒక్కరూ టీఆర్ ఎస్ లో చేరడంతో ఈటెల ఒక్కరే ఏకాకి అవుతున్నారు. దీని వెనకాల సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.

 • Share this:
  (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

  బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టిఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది . ఇప్పటికే మోత్కుపల్లి కూడా దళితబంధుకు ఆకర్శితులయ్యారు . అలాగే కౌశిక్ రెడ్డి ఇప్పటికే సిఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు . అంతకు ముందే ఎల్ . రమణ కూడా టిఆర్ఎస్ తీర్థం పుంజుకున్నారు . అన్ని సామాజిక వర్గాలను గుప్పిట్లో పెట్టుకునే కార్యక్రమాన్ని చేరికలతో చేపట్టారు . తాజాగా దళితబంధుకు సంబంధించి హుజూరాబాద్ కు చెందిన పలువురు సిఎం కెసిఆర్‌తో సోమవారం ప్రగతిభవన్లో భేటీ అయ్యారు . మొత్తంగా ఇప్పుడు హుజూరాబాద్ లో ప్రత్యేక ఆకర్శన పథకం నడుస్తోంది . వివిధ పార్టీల నేతలను చేర్చుకోవడం , స్థానికంగా ఉన్న ప్రజల్లో భరోసా కల్పించడం .. ఈటెలకు అనుచరులుగా ఉన్న వారిని విడదీయడం.. వంటి చర్యలు శరవేవంగా సాగుతున్నాయి .

  ఈటెలకు హుజూరాబాద్ లో స్థానం లేకుండా చేయడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ పావులు కదుపుతున్నారు . ఇందులో భాగంగా హుజారాబాద్ నుంచే దళితబంధు పథకం చేపట్టాలని నిర్ణయించారు . దళితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం , ఇళ్లకు ఆర్థిక సాయం చేయడం , స్థానికంగా ఉన్న పంచాయితీలను తెంపడం , భూ సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ప్రగతిభవన్ సమావేశం సాగింది . మొత్తంగా ఈటెలకు ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా వివరాలు లేకుండా చేసే కార్యక్రమాలు ముమ్మరం అయ్యాయి . బిజెపి కూడా ఈటెల రాజేందరకు ఉన్న ఛరిష్మాపై ఆధారపడి ముందుకు సాగడం తప్ప సొంతంగా చేసిందేమీ లేకపోవడం గమనించాలి . బండి సంజయ్ సొంత జిల్లా కావడం కొంత కలసివచ్చే అంశం . అయినా కెసిఆర్ వ్యూహం ముందు కేవలం విమర్శలు పనికి వస్తాయా అన్నది చూడాలి . ఇంతకాలం ఈటెలకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు తాజాగా సిఎం తీసుకుంటున్న చర్యలు .. నేతల రాకతో మారిపోతున్నాయి .

  మళ్లీ మెల్లగా టిఆర్ఎస్ కు అనుకూల పరిస్థితులు బలపడుతున్నాయి . ఈ నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి కూడా చేరడం ఓ సానుకూల అంశంగా మారింది . ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ .. ప్రజలకు దగ్గరై పనిచేయలనుకున్న పరిస్థితులు బీజేపీలో లేవని ఆరోపించారు . ఈటల రాజేందర్ చేరడంతో ఇక బిజెపిలో తన అవసరం లేదని అన్నారు . ఈటల చేరిక , చేరిన క్రమంపై తనకు చెప్పలేదని విమర్శించారు . ఆయన చేరడం కాదు , చేర్చుకున్న విధానాన్ని తప్పుబట్టారు . టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం ఉంది .. నియోజక వర్గ ప్రజల అభివృద్ధి కొసం టీఆర్ఎస్ తోనే సాధ్యం . పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉంటారు . నేను పోటి చేయాలా లేదా అనేది టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు . హుజురాబాద్ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో మరి గులాబీ అధిష్టానం పెద్దిరెడ్డికి టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కుతుందో లేక ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తుందో అన్న చర్చ సాగుతోంది . ఇదే క్రమంలో ఈటల రాజేందర్ వెంట ఉన్న క్యాడర్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను టీఆర్ఎస్ వేగవంతం చేసింది . మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యాక ఈటలకు అండగా నిలిచిన నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్ర తినిధులు , లోకల్ లీడర్లకు మళ్లీ గులాబీ కండువాలు కప్పుకుంటు న్నారు .

  ఇప్పటివరకు జై ఈటల అంటూ మాజీమంత్రి ఈటల రాజేందర్ వెంట తిరి గిన నేతలు ... రాత్రికి రాత్రే మనస్సు మార్చుకుని అధికార పార్టీలో చేరుతున్నారు . మొదటి రోజు పాదయాత్రలో పాల్గొనడంతో పాటు .. గతంలో టీఆర్ ఎస్ నేతలతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాట్లాడిన నియోజకవర్గంలోని ఇల్లంద కుంట ఎంపీపీ పావని , ఆమె భర్త వెంకటేశ్ .. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరారు . వీరితో పాటు .. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య గౌడ్ , మరికొంత మంది నేతలు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు . అందరినీ టీఆర్ఎస్ నేతలు , మంత్రులు పిలిపించుకుని మాట్లాడి తమవైపు తిప్పుకున్నారు . సొంత పార్టీ నేతలనే టీఆర్ఎస్ కొనుగోలు చేస్తోందంటూ ఈటల రాజేందర్ కొద్దిరోజులుగా ఆరోపిస్తున్నారు . హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన మెజార్టీ ప్రజాప్రతినిధులు మొదట్లో ఈటలకు మద్దతు ప్రకటించినట్లే ప్రకటించి .. ఆ తర్వాత టీఆర్ఎస్ వైపు వెళ్లారు . మొత్తంగా ఇప్పుడు టిఆర్ఎస్ హుజురాబాద్ లో ఈటెలను ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తోంది . ఇందులో భాగంగానే ఈటల రాజేందర్‌కు అనుకూలంగా మాట్లాడిన వారిలో చాలా మందిని ఇప్పుడు తమవైపు తిప్పుకుంది .

  ఈటలకు మొదటి నుంచి అండగా ఉన్న హుజురాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక ... మంత్రి పదవి నుంచి ఈటల బర్తరఫ్ అయ్యాక ఆయన మొదటిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు . ఆమే ప్లేట్ ఫిరాయించి తిరిగి టీఆర్ఎస్లో కొనసాగుతానని ప్రకటించారు . ఒక్కొక్కరుగా ఈటల శిబిరం నుంచి జారుకోవడంతో బిజెపి కూడా ఏమీ చేయలేకపోతోంది . హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల తో పాటు , 127 గ్రామ పంచాయితీల్లోని నేతలు , గెలిచిన సర్పంచులు , ఎంపీటీసీలు , జెడ్పీటీసీలు , మున్సిపల్ ఛైర్మన్లు , కౌన్సిలర్ల విజయం వెనక ఈటల పాత్ర ఉంది . కానీ వీరిలో 90 శాతం మంది ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిపోయారు . ఈటలపై అభిమానమున్నప్పటికీ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి ప్రలోభాలు , బెదిరింపులే కారణమన్న విమర్శలున్నాయి.
  Published by:Veera Babu
  First published: