(P.Srinivas,News18,Karimnagar)
ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఉప ఎన్నిక సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. అయితే ఎన్నికలు జరిగే తీరును ఇందిరా నగర్ పోలింగ్ సెంటర్ ను కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. ఇదిలా ఉండగా.. హుజురాబాద్ లోని ఇల్లందకుంట శ్రీరాములపల్లిలో గొడవ జరిగింది. తొలి రెండు గంటల్లో హుజూరాబాద్ లో 10 శాతానికి పైగా ఓటింగ్ ఓటింగ్ శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్ 262 పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం అతడు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరాడు.
తదనంతరం హుజురాబాద్ మండలం.. కందుగుల ZP హైస్కూల్ లో ఓటింగ్ సరళిని పరిశీలించారు ఈటల. ఉప్పలపల్లిలోని పోలింగ్ బూత్ ను కూడా పరిశీలించారు. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. “ అధికార పార్టీ మద్యం ఏరులై పారిస్తోంది . మాకు డబ్బులు అందలేదని ఓటర్లే ఆందోళన చేసే పరిస్థితి తీసుకువచ్చారు . పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచుతున్నారు . ఈసీ కూడా డబ్బు పంపిణీని అడ్డుకోలేకపోతోంది . మంచి చెడులను ఆలోచించే సత్తా ప్రజలకు ఉంది " అని ఈటల చెప్పారు .సాదుకున్నా మీరే.. చంపుకున్నా మీరే అని ఈటల అన్నారు. దర్మం గెలుస్తుంది. ప్రేమ అభిమానం ముందు డబ్బులు, మద్యం పని చేయవు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటే మంచికి సంకేతం అన్నారు. ఈ రోజు వారి ఆత్మను ఆవిష్కరించి, గుండెళ్ళో గూడుకట్టుకున్న అభిమానాన్ని, ప్రేమని ఆవిష్కరిస్తున్నారన్నారు.
ఎన్నికల కమిషన్ నిచ్చేస్టం అయ్యింది. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాలి. 90 శాతం పోలింగ్ అవుతుంది అని అనుకుంటున్నట్లు అన్నారు. ఇదిలా ఉండగా.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఉప ఎన్నిక సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. అయితే ఎన్నికలు జరిగే తీరును ఇందిరా నగర్ పోలింగ్ సెంటర్లో కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. ఇదిలా ఉండగా.. హుజురాబాద్ లోని ఇల్లందకుంట శ్రీరాములపల్లిలో గొడవ జరిగింది. ఇల్లందుకుంటలోని పోలింగ్ కేంద్రం 224 బూత్ లో ఈవీఎం మెరాయింపుతో పోలింగ్ ఆలస్యం అవుతుంది. అయితే ఈ విషయంపై లైన్లో ఉన్న కొంతమంది ఓటర్లు వెనుదిరగడంతో అక్కడ గొడవ జరిగింది.
సాంకేతిక లోపం ఏర్పడటంతో గంట పాటు ఓటర్లు క్యూ లైన్లో నిలబడి వెనుదిరిగారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని హుజూరాబాద్, వీణవంక, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్ జరగుతుంది. ఈ పోలిగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ తో అనుసంధానం చేశారు. ఓటర్లకు మాస్క్ ఉంటేనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 3 లోక్ సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో హుజురాబద్, ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ లో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.