హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలోనే బండి సంజయ్ పాల్గోన్నారు. ఈ సంధర్బంగా ఆయనకు సంఘీబావం తెలుపారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశిస్తూ...ఆయన మాట్లాడారు..ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.. నిన్ననే హుజూరాబాద్ నియోజవర్గానికి సంబంధించిన సర్వే వచ్చిందని...ప్రభుత్వం చేయించిన సర్వేలోనే ఈటలకు అనుకూలంగా 71శాతం ప్రజలు ఉన్నారని అన్నారు. దీంతో సీఎం కేసీఆర్‌కు పాలుపోవడం లేదని అన్నారు.ఇక టీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో అభ్యర్థే లేడని ఎద్దేవా చేశారు.
మరోవైపు డబ్బు సంచులతో కేసీఆర్ అనుచరులు నియోజకవర్గంలో తిరుగుతున్నారని,వాళ్లే ఈటలను గెలిపిస్తారని అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. హుజురాబాద్ ఎన్నికలు కేవలం నియోజకవర్గానికే సంబందించినవి కాదని..రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలని చెప్పారు.
ప్రజాస్వామిక తెలంగాణ కోసం మలిదశ ఉద్యమం కొనసాగించే సమయంలోనే హుజూరాబాద్ ఎన్నికల రూపంలో ఓ అవకాశం వచ్చిందని,దేశంలో ఎక్కడికి పోయినా బీజేపి గెలుస్తుందని చెబుతున్నారని అన్నారు. అందుకే అధికార టీఆర్ఎస్ కోట్ల రూపాయలు నియోజకవర్గంలో వెచ్చిస్తున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్ లేకపోతే దళిత బంధుకు వేల కోట్ల రూపాయలు వచ్చేవి కాదని అన్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ అభినవ అంబెడ్కర్ గా చెప్పించుకుంటున్నారని..ఆయన అభినవ అంబేడ్కర్ అయితే.. జయంతి వేడుకలకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తానన్న హమిని తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా నగరంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని హామి ఇచ్చారు.
ఇక దళిత బంధు పేరిట మరోసారి ఎన్నికల్లో మోసం చేసేందుకు సీఎం కేసిఆర్ కుట్రలు పన్నుతున్నారని అన్నారు. దళిత బంధులో భాగంగా కొద్దిమందికి ఇచ్చి ఆ తర్వాత ఎన్నికల్లో లబ్దిపొందిన తర్వాత ఆయనే కోర్టుకు వెళతారని, కోర్టు పేరుతో పథకాన్ని నీరు గారుస్తారని విమర్శించారు. దళిత బంధుతో పాటు రాష్ట్రంలోని ప్రతి వెనకబడిన కుటంబానికి పదిలక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ జిమ్మిక్కులను అర్థం చేసుకోవాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Eetala rajender