KARIMNAGAR DOUBLE TOLL COLLECTION FROM MOTORISTS AT RENIGUNTA TOLL PLAZA VB KNR
Toll Plaza: వాహనదారుల నుంచి డబుల్ టోల్.. ఫాస్టాగ్ పనిచేయడం లేదంటూ.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Toll Plaza: మీరు ఏదైనా వాహనంలో హైదరాబాద్ కానీ, ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే టోల్ ప్లాజా దగ్గర కాస్త ఆగి చూసుకొని వెళ్లాలి లేదంటే జేబుకు చిల్లులు పడినట్లే. ఎందుకంటే ఫాస్టాగ్ పని చేయడం లేదంటూ డబ్బుల వసూలు చేస్తున్నారు. కొద్ది దూరం పోయేసరికి ఫాస్టాగ్ లో డబ్బులు కట్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
(పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)
కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో రేణుగుంట టోల్ ఫ్లజా ఉంది. ఐతే గత కొన్ని రోజులుగా టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ టాగ్ ఏర్పాట్లు చేశారు. కానీ ఇది సరిగ్గా పనిచేయక పోవడంతో మళ్ళీ అమౌంట్ తీసుకోని వదిలేస్తున్నారు. ప్లాజా వద్ద పెద్ద అవినీతి జరుగుతుందని వాహనదారులు అంటున్నారు. కొద్ది రోజులుగా రోజుకు లక్షలో అక్రమంగా సంపాదిస్తున్నారు. ఫాస్ట్ టాగ్ పనిచేయడం లేదని రెగ్యులర్ గా తీసుకునే విధంగా తీసుకుంటూ, అక్కడి నుండి వాహనాలు కొద్ది దూరం బయటకు రాగానే మళ్ళీ ఫాస్ట్ టాగ్ అమౌంట్ ఆన్లైన్ లో కట్ అవడం తో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇదేంటి అని అడిగిన వారికి టోల్ ఫ్లాజా యాజమాన్యం వింత వింత సమాధానాలు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ నుండి కరీంనగర్ వస్తున్నా చిదురాల రాంమోహన్ అనే వ్యక్తి రేణికుంట టోల్ ప్లాజా దగ్గరకు రాగానే ఫాస్ట్ టాగ్ పని చేయట్లేదు అని చెప్పి డబ్బులు వసూలు చేశారు.
దాన్ని నమ్మేసి డబ్బులు ఇచ్చేసి అతను వెళ్లి పోయాడు. కొంత దూరం వెళ్లినాక ఫాస్ట్ టాగ్ ద్వారా డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ రాగానే మళ్ళీ యూటర్న్ తీసుకొని జరిగిన మోసాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని సరియైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇలా రోజుకు వెయ్యి నుండి పదిహేను వందల కు పైగా ఫాస్ట్ టాగ్ ఉన్న వెహికల్స్ వెళ్ళినా కూడా రూ.57 ఒక ట్రిప్ కు చొప్పున వేల రూపాయల దోపిడీ చేస్తున్నారు. చాలా మంది పట్టిచ్చుకోకుండా వెళ్లడంతో వీళ్ల మోసాలను గుర్తించకపోవడంతో లక్షల్లో దోపిడీ చేస్తున్నారంటూ వాహనదారులు వాపోతున్నారు. మరికొందరు వాహనదారులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. టోల్‌సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో వాగ్వాదం చోటుచేసుకోగా.. 1033 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. టోల్‌ఫ్రీ సిబ్బంది సూచనల మేరకు వాట్సాప్ నంబరుకు వివరాలు పంపారు.
ఈ విషయమై హెచ్‌కేఆర్ టోల్‌ప్లాజా నిర్వాహకులను ప్రశ్నించగా.. 10-15 రోజులుగా ఈ సమస్య నెలకొందని తెలిపారు. ఆర్ఎఫ్ఐ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్)లో లోపాలు ఉన్నట్లు చెప్పారు. ఫాస్టాగ్ ద్వారా టోల్ కట్ అయిన వాహనదారులు 1033 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేస్తే.. వారం రోజుల్లో తిరిగి వారి ఖాతాల్లో జమ అవుతాయని వివరించారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. డబుల్ టోల్ బాదుడు వ్యవహారంపై పోలీసులు కూడా దృష్టిసారించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.