హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: క్యాన్సర్ వ్యాధి రోగుల కోసం జుట్టు దానం..దాతృత్వం చాటిన ఈ యువకునికి సలాం కొట్టాల్సిందే!

Karimnagar: క్యాన్సర్ వ్యాధి రోగుల కోసం జుట్టు దానం..దాతృత్వం చాటిన ఈ యువకునికి సలాం కొట్టాల్సిందే!

క్యాన్సర్ వ్యాధి రోగుల కోసం జుట్టు దానం చేసిన యువకుడు

క్యాన్సర్ వ్యాధి రోగుల కోసం జుట్టు దానం చేసిన యువకుడు

క్యాన్సర్ వ్యాధికి ప్రస్తుత కాలంలో అందరికీ  అందుబాటులో వున్న చికిత్సలు కీమో మరియు రేడియో చికిత్సలు మాత్రమే. కీమో థెరఫీ అనేది క్యాన్సర్ బాధితుల శరీరంలోని క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్య వంతమైన కణాలను కూడా ప్రభావితం చేస్తుంది. దీని ఫలితంగా చాల మంది క్యాన్సర్ బాధితులలో జుట్టు పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రాలిపోవడం సర్వ సాధారణం అయిన విషయం. ఇది క్యాన్సర్ బాధితుల్లో ఆత్మన్యూన్యతా భావానికి దారి తీస్తుంది. వారు నలుగురిలో కలవడానికి ఇబ్బందిపడతారు. కొంత మంది అయితే జుట్టు రాలుతుంది అని చికిత్సను కూడా వద్దంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Karimnagar

(కరీంనగర్ జిల్లా, శ్రీనివాస్. పి, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి)

క్యాన్సర్ వ్యాధికి ప్రస్తుత కాలంలో అందరికీ  అందుబాటులో వున్న చికిత్సలు కీమో మరియు రేడియో చికిత్సలు మాత్రమే. కీమో థెరఫీ అనేది క్యాన్సర్ బాధితుల శరీరంలోని క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్య వంతమైన కణాలను కూడా ప్రభావితం చేస్తుంది. దీని ఫలితంగా చాల మంది క్యాన్సర్ బాధితులలో జుట్టు పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రాలిపోవడం సర్వ సాధారణం అయిన విషయం. ఇది క్యాన్సర్ బాధితుల్లో ఆత్మన్యూన్యతా భావానికి దారి తీస్తుంది. వారు నలుగురిలో కలవడానికి ఇబ్బందిపడతారు. కొంత మంది అయితే జుట్టు రాలుతుంది అని చికిత్సను కూడా వద్దంటారు.

సింగరేణిలో ఎర్ర గులాబీలు వికసించేనా..? ఎన్నికల జాప్యానికి కారణం ఇదేనా..?

అలాంటి వారి కోసం దాతల నుండి వెంట్రుకలు సేకరించి కృత్రిమ జుట్టు అలంకారంగా పెట్టుకునే విదంగా చేసి క్యాన్సర్ పేషంట్స్ కి అందించే సదుద్దేశ్యంతో హైదరాబాద్ లో నడపబడుతున్న 'హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషంట్స్' అనే సంస్థకు కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి తన తల వెంట్రుకలను స్వచ్ఛందంగా పంపించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..తన  బంధువులు, మిత్ర బృందం తనను గత రెండున్నర సంవత్సరాలుగా తాను జుట్టు పెంచడం వలన తనను వ్యక్తిగంతంగా అపహేళనకు గురి చేసినప్పటికీ  క్యాన్సర్ పేషంట్స్ లో ఆత్మ విశ్వాసం నింపడంలో ఉన్న ఆనందం కోసం  తన తల వెంట్రుకలను పెంచి దానంగా ఇస్తున్నాన్నాని తెలిపారు.

ఈ సందర్బంగా శ్యామ్ సుందర్ రెడ్డిని హెయిర్ డొనేషన్ సంస్థ బాద్యులు అభినందించడం జరిగింది. గతంలో కూడా హుజురాబాద్ మండలం కు చెందిన ఒక మహిళా కూడా తన పొడవాటి జుట్టును దానం చేసి తన దాతృత్వం చాటుకుంది. తనే కాకుండా తన తోటీ స్నేహితులతో కూడా జుట్టు దానం చేపించింది. ఇలా చాలా మందితో జుట్టు దానం చేపించే పని పెట్టుకొని సేవ అవార్డ్స్ కూడా తీసుకుంది. ఇలా హైదరాబాద్ లాంటి మహానగరంలో చాలా చారిటీస్ తరుపున జుట్టు దానం పోగ్రామ్ పై కూడా అవగాహన సదస్సు కార్యక్రమాలు చేపడుతున్న ప్రజల్లో అవగాహనా సదస్సు లు కూడా నిర్వహిస్తున్నారు. ఇలా చాల మంది ఇన్స్పిరేషన్ తో కూడా జుట్టు దానం చేస్తున్నారు. క్యాన్సర్ వ్యాది వాళ్లకు జుట్టు దానం చేయడంతో ఎంతో కొంత వాళ్లకు ఆత్మష్టైర్యం ఇచ్చిన వాళ్ళము అవుతామని ప్రజలు అంటున్నారు.

First published:

Tags: Cancer, Karimnagar, Telangana

ఉత్తమ కథలు