Srinivas Ponnam, Karimnagar, News18
గత కొద్దిరోజులుగా భానుడి(Summer ) ప్రతాపానికి ప్రజలతో పాటుగా, పక్షులు జంతువులు, విలవిల లాడుతున్నాయి. కరీంనగర్ (Karim Nagar) శివారులోని డీర్ పార్కులో వన్యప్రాణులు ఎండవేడిమితట్టుకోలేక పొతున్నాయి. పార్క్ లో వందల సంఖ్యలో పక్షులతో పాటుగా జంతువులు, జింకల కొసం ప్రత్యేకమైన షెడ్డులు నిర్మించి పళ్ళు కూరగాయలతో పాటుగా ప్రత్యేకమైన అహారాన్ని అందిస్తున్నారు.
ఇక అవి నివసించే షెడ్ లో క్రింద ఇసుక చుట్టూ గోనెసంచులుఏర్పాటు చేసి నీటితో తడుపుతూ రోజుకి మూడు సార్లు చల్లబరుస్తు ఉపశమనం కలిగిస్తున్నారు. ఇలా చేయడం వలన ఎండ వేడిని తట్టుకోవడమే కాకుండా ఎలాంటి అనారోగ్యానికి గురికావని డిప్యూటీ డి వో ఆఫీసర్ ఆనంద్ తెలిపారు.
ఇక వాటి అహారం విషయంలోకి వస్తే డాక్టర్ల సలహాలు, సూచనలు చెప్పినట్లుగా పండ్లు కూరగాయలు తీసుకొని వాటికి ఆహారంగా ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకైతే ఈ ఎండాకాలంలో ఒక్క వన్యప్రాణి ప్రమాదానికి గురి కాలేదని తెలిపారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత (Temperature) నమోదు అవుతున్న నేపథ్యంలో చాలా చోట్ల ప్రజలు ఎండ వేడి తాళలేక ప్రజలు ఇంటి నుండి బయటకు వచ్చిన పరిస్థితి కనబడటం లేదని.. మరి కొన్ని రోజులు ఇలాగే ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. చాలా చోట్ల ఇప్పటికే వన్యప్రాణులకు సరియైన సదుపాయాలు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High temperature, Karimangar, Local News, Summer, Telangana