KARIMNAGAR DISABLED MAN HAS BEEN ARRESTED FOR HARASSING WOMEN ON SOCIAL MEDIA UNDER THE NAME OF SI IN KARIMNAGAR DISTRICT SNR
Karimnagar:సరిగ్గా కదల్లేని వాడు ఎస్ఐ ఏంటీ..ఆడవాళ్లను ఆ విధంగా టార్చర్ పెట్టడం ఏమిటి..
(అమ్మో వీడో దేశముదురు)
Karimnagar:కదల్లేని స్థితిలో ఉన్న ఓ యువకుడు ఆడవాళ్ల పాలిట అరాచకుడిగా మారాడు. సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని ఎస్ఐనంటూ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వాడి టార్చర్‌ని తట్టుకోలేకపోయిన ఓ యువతి అతని నిజస్వరూపాన్ని బయటపెట్టింది.
పని లేని ప్రతివాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. సోషల్ మీడియా(Social media)లో ఏదో ఫేక్ ఐడీ క్రియేట్ చేయడం సెలబ్రిటీ, ఆఫీసర్, పోలీస్ అంటూ బిల్డప్‌లు ఇచ్చి అమాయకుల్ని చీట్ చేయడం పోకిరి వెదవలు, కాలేజీ కుర్రాళ్లు ఇలాంటి వెదవ వేషాలు, సైబర్ నేరాలకు పాల్పడ్డారంటే ఓ అర్ధం ఉంది. కరీంనగర్ (Karimnagar) జిల్లాకు చెందిన ఓ వికలాంగుడు(Disabled man)సైతం అలాంటి పోకిరీలకు తానేం తక్కువ కాదని నిరూపించాడు. ఖానాపూర్(Khanapur)కి చెందిన జాటోతు మహేష్Jatotu Mahesh అనే వికలాంగుడు చేసిన నిర్వాకం తెలిసి పోలీసు(Police)లే షాక్ అయ్యారు. ఎందుకంటే అతను వాడుకుంది పోలీస్ డిపార్ట్మెంట్(Police Department)నే కాబట్టి ఆశ్చర్యపోయారు. ఖానాపూర్ మండలం కోడిమ్యాట్ తండా(Kodimat Tanda)కు చెందిన జాటోతు మహేష్(Jatotu Mahesh)అంగవైకల్యం కారణంగా కాళ్లు, చేతులు సరిగా పని చేయవు. అందరిలా చురుగ్గా కదల్లేని స్థితిలో ఉండి కూడ అమ్మాయిలు, ఆడవాళ్లను ఆటపట్టించాలనే దుర్భుద్దితో ఏకంగా నకిలీ ఎస్ఐ(Fake SI)అవతారమెత్తాడు. ఫేస్బుక్Facebook, ఇన్స్టాగ్రామ్Instagram, ట్విట్టర్Twitter, వాట్సాప్WhatsAppతో పాటు మిగిలిన అన్ని సోషల్ మీడియా గ్రూప్‌లో ఖాతాలు ఓపెన్ చేసి తాను కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ(Karimnagar 2Town SI)గా పనిచేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. పోలీస్ గెటప్‌తో ఉన్న ఓ ఫోటోని ప్రొఫైల్ పిక్(Profile Pic)గా పెట్టుకొని నిజంగా తానో పోలీస్ ఆఫీసర్ని అనే విధంగా అమ్మాయిలతో వాట్సాప్ చాటింగ్(Whatsapp Chatting)చేశాడు. ఆడవాళ్లు, అమ్మాయిలు, యువతులు అయితే చాలు వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం, అభ్యంతరకమైన రీతిలో చాటింగ్ చేయడం, వాళ్ల పర్సనల్ విషయాలపై పదే పదే గుచ్చి గుచ్చి అడగటం వంటివి చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాడు.
ఎస్ఐనంటూ మహిళలకు టార్చర్..
ఎస్ఐ పేరుతో ఓ పోకిరీ చేష్టలను భరించలేకపోయిన వాళ్లలో ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో మనోడు గుట్టు రట్టైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కరీంనగర్ టూటౌన్ ఎస్ఐగా చెలామణి అవుతూ ఆడవాళ్లతో మహేష్ చేసిన చాటింగ్, ఫోన్ కాల్స్ డిటెయిల్స్ సేకరించారు. నిందితుడు మహేష్ ఈ తరహా చీటింగ్ చేయడానికి చనిపోయిన ఓ ఎస్ఐ ఫోటోని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడని నిర్ధారించారు. మరో అకౌంట్‌పై తన పేరు దేవేందర్ కరీంనగర్ టూటౌన్ ఎస్‌గా తప్పుడు అకౌంట్స్ క్రియేట్ చేసి ఇదంతా చేస్తున్నట్లుగా రాబట్టారు.
సోషల్ మీడియాలో వికలాంగుడి అరాచకం..
బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మహేష్‌ని అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. నిందితుడు వికలాంగుడు కావడం అతను గతంలో కూడా పోలీసులను ఇబ్బంది పెట్టినట్లుగా తేల్చారు. డయల్ 100నెంబర్‌కి ఫేక్ కాల్స్ చేసి వందలాది మంది పోలీసుల సమయాన్ని వృధా చేసినట్లుగా తేల్చారు. గతంలో పలుమార్లు మహేష్‌కి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటి మార్పు రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ఇలాంటి వెకిలి చేష్టలు,వేధింపులకు పాల్పడే వారు వికలాంగులైనా, మానసీక రోగులైనా ఊపేక్షేంది లేదని.. అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వార్నింగ్ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.