హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: నాన్న కోసం డిప్లమా..నాలెడ్జ్‌ కోసం ఎలక్ట్రిక్ బైక్ తయారీ!

Karimnagar: నాన్న కోసం డిప్లమా..నాలెడ్జ్‌ కోసం ఎలక్ట్రిక్ బైక్ తయారీ!

elec bike

elec bike

వ్యవసాయ కుటుంభానికి చెందినా అఖిల్ తన తండ్రి ఇంటికి దూరంగా ఉన్న వ్యవసాయ పొలాలకి వెళ్ళడానికి పెట్రోల్ రేట్లతో పడుతున్న ఇబ్బందులు చూసి తన తండ్రి బైక్ ని ఎలక్ట్రిక్ బ్యాటరితో నడిచేలా మార్చాలని ఆలోచన వచ్చింది.

  • Local18
  • Last Updated :
  • Karimnagar, India

(P.Srinivas,New18,Karimnagar)

ఐదు అంటే ఐదు గంటలు చార్జింగ్ పెట్టండి రయ్..రయ్ మంటూ 180 కిలోమీటర్లు రైడ్ చేయండి. పెట్రోల్ రెట్లు విపరీతంగా పెరిగిన నేపధ్యంలో వాహనదారులు సతమతం అవుతుంటే కరీంనగర్ జిల్లాకి చెందిన ఓ యువకుడు అద్భుతం సృష్టించి ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇంతకీ ఆ ఎలక్ట్రిక్ బైక్ గొప్పతనం ఏందో మనం ఓ సారి చూద్దాం రండి..

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లికి చెందిన కాసం అఖిల్ రెడ్డి.. పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యునివర్సిటిలో ఆటో మొబైల్ లో ఇంజనీరింగ్ పూర్తీ చేశాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన అఖిల్ తన తండ్రి ఇంటికి దూరంగా ఉన్న వ్యవసాయ పొలాలకి వెళ్ళడానికి పెట్రోల్ రేట్లతో పడుతున్న ఇబ్బందులు చూసి తన తండ్రి బైక్ ని ఎలక్ట్రిక్ బ్యాటరితో నడిచేలా మార్చాలని ఆలోచన వచ్చింది.

తన తెలివితేటలకి పదునుపెట్టి తమ వద్దనున్న పాత హీరో హోండా మోటార్ బైక్ ని మార్చాలని అనుకొన్నాడు. తనకున్న డిప్లమా నాలెడ్జ్ తో లక్ష రూపాయలు వెచ్చించి 4.8 కిలోవాట్ కరెంట్ మోటార్, కంట్రోలర్, కన్వర్టర్ ను అమర్చి స్పీడో మీటర్ ను సైతం పెట్టి అనుసంధానం చేశాడు. తనకున్న డిప్లమా నాలెడ్జ్ తో సెంటర్ అఫ్ గ్రావిటి తో బైక్ తయ్యారు చెయ్యడంతో రోడ్డుపై నడిపేటప్పుడు డెబ్బై కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా బండికి బ్యాలెన్స్ తప్పకుండ ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇటివల విద్యుత్ బైక్ లు తరచూ వేడికి పేలిపోతుండడంతో గ్రామంలో ఉన్న ఓ గుట్ట సమీపంలో మూడు రోజుల పాటు ఎండలో ఉంచాడు. ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో బ్యాటరీ నుండి ఎక్కువ కరెంట్ వచ్చేలా మోటార్ కి సమస్యలు రాకుండా ఎంసిబి (మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ) ని అమర్చాడు.

ఇప్పటివరకి 18 నెలల నుండి టెస్టింగ్ పూర్తీ చేసుకున్నట్లు, ఇంకా రెండేళ్లలో ఇంకా టెస్టింగ్ చేసి సామాన్యులకి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అంటున్నారు అఖిల్. ఇప్పటివరకి తనకి ఒక లక్ష ముప్పై వేలు ఖర్చు అవగా.. ఎక్కువ మొత్తంలో ఇలాంటి బైక్ లకి తయ్యారు చేస్తే తక్కువ రేటుకే సామాన్యులకి అందించవచ్చని, తానూ తయ్యారు చేసే బైక్ లో రెండు ఆప్షన్లు ఉన్నాయన్నాడు. ఐదు గంటలు చార్జింగ్ పెడితే 180 కిలోమీటర్లు, 8 గంటలు చార్జింగ్ పెడితే 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని దీనికి కేవలం 5 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుందని చెబుతున్నాడు అఖిల్.

First published:

Tags: Karimnagar, Local News, Telangana

ఉత్తమ కథలు