(P.Srinivas, Karimnagar, News18)
గత సంవత్సరం ఆగస్టు నెలలో పైలెట్ ప్రాజెక్టు కింద దళిత బందు (Dalitha bandhu) పథకం హుజురాబాద్ (Huzurabad) లో సీఎం కెసిఆర్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. చిన్న చిన్న అటు పోటుల మధ్య ఇప్పటివరకు అర్హులైన దళితులకు దళిత బంధు (Dalitha bandhu) అందరికి చేరే దిశగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి అర్హులైన దళితులకు దళిత బందు (Dalitha bandhu) రాకపోవడంతో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తునే ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు అసలు కథ మొదలైంది. దళితబంధు పథకం ద్వారా లబ్దిపొంది యూనిట్ ప్రారంభించని వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్జన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధు (Dalitha bandhu) యూనిట్ల మంజూరీపై సంబంధిత క్లస్టర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కర్జన్ మాట్లాడుతూ..జిల్లాలో దళితబంధు (Dalitha bandhu) పథకం ద్వారా లబ్ధిని పొంది యూనిట్లను స్థాపించడంలో నిర్లక్ష్యంగా వ్యవహిరించేవారికి నోటీసులను జారీ చేయాలని, అప్పటికీ స్పందించకపోతే దళితబంధును రద్దు చేయాలని తెలిపారు. యూనిట్ల మంజూరులో అధికారులు పరిశీలించిన తరువాతే తదుపరి అనుమతులు ఇవ్వాలని, యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్ కెఎస్ సర్వేలో ఉండి ప్రస్తుతం కూడా ఉన్నవారికి, రేషన్ కార్డు ఉన్నవారికి పథకం మంజూరుకు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారులుగా జీవించేవారికి, వృద్ధులకు, మనవండ్లు, మనవరాళ్లకు పథకం మంజూరు చేయరాదని సూచించారు.
తక్కువ ఆదాయం ఉన్న రిటైర్డు ఉద్యోగులకు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వారికి పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. సరైన పత్రాలను, ఆధారాలను చూపించనివారి దరఖాస్తు తిరస్కరించే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. దళిత బంధు (Dalitha bandhu) పథకం స్టార్ట్ అయి సంవత్సర పూర్తయిన కూడా..దళిత బందు (Dalitha bandhu) తీసుకున్న లబ్ధిదారులు చాలామంది వారికి కేటాయించిన యూనిట్లను ప్రారంభించకపోవడంతో అలాంటి వారిపై యాక్షన్ తీసుకొని కేసులు పెట్టాలని..జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. చాలా మంది దళిత బందు లబ్ధిదారులు డబ్బులను సొంత అవసరాలకు వినియోగించుకుంటూ..దళిత బంధు (Dalitha bandhu) డబ్బులను పక్కదోవ పట్టిస్తున్నారని..పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
వీటిపైన స్పందించిన జిల్లా కలెక్టర్ ఎవరైతే లబ్ధిదారులు యూనిట్లను ప్రారంభించలేదో వారి పైన తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Telangana