వానలు కురుస్తున్నాయి, మరోవైపు ఎండలు మండుతున్నాయి, ఇంకోవైపు కరోనా ..వీటితో రాష్ట్ర్ర ప్రజలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని ఆయా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు వాతవరణ పరిస్థితులు సైతం ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. అకాల వర్షలతో పంటలు దెబ్బతింటుంటే...పండిన పంటలు తీసుకువస్తున్న వాహానాలు ఎండల భారిన పడి అగ్నికి ఆహుతున్నాయి.
ఉమ్మడి కరీనగర్ జిల్లాలో రోడ్డుపై వెలుతున్న వాహనానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఎండకాలం కావడంతో మంటలు వెంటనే వ్యాప్తించి పూర్తిగా వాహనం దగ్థమైంది. వివరాల్లోకి వెళితే... చిగురుమామిడి మండలం చిన్న ములుకనూర్ గ్రామం లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద గడ్డి లోడ్ తో వెళుతున్న DCM వ్యాన్‌కు కరెంటు తీగలు తగలడంతో మంటలు లేచాయి. ఎండకాలం కావడంతో డ్రైవర్ అప్రమత్తయ్యో లోపే గడ్డిగా పూర్తిగా మంటలతో నిండిపోయింది. గడ్డితో పాటు డీసీఎం వ్యాను పూర్తిగా దగ్ధమైంది. కాగా స్థానికుల సమాచారం మేరకు చిగురుమామిడి ఎస్సై మధుకర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటాలార్పుతున్నారు. అయితే గడ్డికి మంటలంటున్న వెంటనే డ్రైవర్, క్లీనర్లు బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Karimangar