Dalita Bandhu : దళిత బంధు అకౌంట్‌లో డబ్బులు మాయం..? ఏం జరుగుతుందో తెలియక అయోమయం..?

సీఎం కేసీఆర్

Dalita Bandhu : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన దళిత బంధు అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. ఒకేసారి వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో లక్షల రుపాయాలు జమ చేసిన అధికారులు .. తిరిగి వాటిని వెనక్కి తీసుకుంటున్నారా.. మరి అకౌంట్లలో నుండి డబ్బులు ఎందుకు వాపస్ వెళుతున్నాయి.

  • Share this:
    కరీంనగర్ జిల్లా..
    న్యూస్ 18 తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి

    అయితే గత రెండు మూడు రోజులు అబ్ధిదారుల ఖాతాల్లో జమ అయిన దళిత బంధు డబ్బులు, 10 లక్షల రూపాయలు తిరిగి ప్రభుత్వ ఖాతాకే(account) క్రెడిట్ అవుతున్నాయి. ఇలా నెల 6 నుంచే ఒంటరి మహిళలు , వృద్ధుల అకౌంట్లలోని అమౌంట్ డెబిట్ అవుతున్నట్లు సెల్ ఫోన్లకు మెసేజ్(message) లు వస్తున్నాయి . ఈ క్రమంలోనే బుధవారం కొందరు లబ్ధిదారుల ఖాతాల్లోంచి కూడా డబ్బులు(money) కట్ కావడంతో విషయం బయటకు వచ్చింది .

    ఇలా.. ఒక్క కమలాపూర్(kamalapur) మండలంలోనే 156 మంది అకౌంట్లు ఖాళీ కావడంతో ఆయా దళిత కుటుంబాల్లో ఆందోళన మొదలైంది . ఏం జరుగుతోందో తెలియక బాధితులంతా బ్యాంకులు , ఆఫీసర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు . అయితే బ్యాంకు ఆఫీసర్ల వద్ద కూడా డబ్బుల డెబిట్‌కు సంబంధించి సరైన సమధానం లభించడం లేదు.. దీంతో అసలైన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు(bank) అధికారులు సమాధానం చెప్పకపోవడంతో తిరిగి ప్రభుత్వ అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అక్కడ కూడా వారికి సరైన సమాధానం లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు లబ్ధిదారులు.

    ఇది చదవండి : నగర నడిబొడ్డులో గంజాయి కేఫ్‌లు.. ఇన్‌‌స్టాలో వల..


    లబ్ధిదారుల అకౌంట్స్‌లలో(accounts) డబ్బులు జమ అయిన తర్వాత తిరిగి ఖాతాలు ఖాలీ కావడం వెనక మతలబు ఏమిటనేది అంతుపట్టకుండా ఉంది. లబ్ధిదారుల ఎంపికలో ఎవైనా తప్పులు దొర్లాయా లేక బ్యాంకు లావాదేవిల్లోనే ఇబ్బందులు ఉన్నాయా అనేది అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది.

    ఇది చదవండి : మరో మహిళా అధికారిపై పెట్రోల్ దాడి... కారణం ఇదే.. !


    ఇక సీఎం కేసీఆర్(cm kcr) ఆగస్టు 16 న హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు . స్కీమ్ ప్రారంభించిన రోజే 15 మందికి దళిత బంధు ఇచ్చారు . ఆ తర్వాత నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇంటింటి సర్వే (servey)చేసి , మొత్తం 20,900 దళిత కుటుంబాలు ఉన్నట్లు తేల్చారు . దీని ఆధారంగా ఒక్కొక్కరి అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నారు. దళిత బంధు రక్షణ నిధికి రూ .10 వేలు పోను మిగతా రూ .9.90 లక్షలను లబ్ధిదారుల పేరున తీసిన ప్రత్యేక అకౌంట్ లో వేస్తున్నారు . ఇలా ఇప్పటి వరకు 14,400 మంది అకౌంట్లలో డబ్బులు జమ చేశారు.

    ఇది చదవండి : పెళ్లి చేసుకోనంటూ ఏకంగా సీఎంకు లేఖ రాసిన యువతి.. కారణం ఇదేనంటూ ఆవేదన...!

    Published by:yveerash yveerash
    First published: