Home /News /telangana /

KARIMNAGAR DALIT BANDHU AMOUNTS IS BEING DEPOSITED IN BANK ACCOUNTS OF BENEFICIARIES VB

Telangana Dalit Bandhu: లబ్ధిదారుల ఖాతాల్లో దళితబంధు డబ్బులు జమ.. క్రెడిట్ కాని వారికి..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana Dalit Bandhu: దళిత సంఘాల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 10 లక్షల సహాయంతో 24,000 మంది లబ్ధిదారులలో 13,000 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే దళితబంధు డబ్బులను క్రెడిట్ అయ్యాయి.

ఇంకా చదవండి ...
    దళిత సంఘాల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 10 లక్షల సహాయంతో 24,000 మంది లబ్ధిదారులలో 13,000 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే దళితబంధు డబ్బులను క్రెడిట్ అయ్యాయి. నియోజకవర్గంలో అర్హులైన కుటుంబాల సర్వే పూర్తవడంతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడం ఊపందుకుంది. దీనిపై జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ మాట్లాడుతూ.. 13,000 మంది దళితుల ఖాతాల్లో డబ్బుల జమ చేశామని.. తర్వాల మిగతా వారికి కూడా జమ చేస్తామన్నారు.

    Huzurabad By Election: హుజురాబాద్ లో ఆగిన ప్రచారం.. అటువైపు కన్నెత్తి చూడని నాయకులు.. కారణం అదేనా..


    తెలంగాణ దళిత బంధు పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 3 వరకు లబ్ధిదారుల సర్వేను నిర్వహించింది. కుటుంబ వివరాలతో పాటు.. లబ్ధిదారుల నుండి వారు పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేస్తున్న వ్యాపార ప్రాంతాన్ని కూడా సర్వేలో తెలుసుకున్నారు. ఈ పథకానికి అర్హులైన కొంత మంది దళితులకు బ్యాంక్ ఖాతాలు లేవు. దీనిపై కూడా బ్యాంకులు అబ్ధిదారులు ఎవరు.. ఎవరికీ బ్యాంక్ ఖాతా అవసమనే సర్వే చేస్తున్న నేపథ్యంలో మరికొంత ఆలస్యం అయింది. అందుకే అర్హులైన అందరికీ ఖాతాల్లో రూ.10 లక్షలు జమ కాలేదు.

    Work From Office: హైదరాబాద్ లో వర్క్ ఫ్రం హోంకు స్వస్తి.. ఆ తేదీ నుంచి ఆఫీస్ లకు రావాల్సిందే.. !


    హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 2,200 కోట్లలో కేవలం రూ .1,300 కోట్లు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. "బ్యాంకు ఖాతాలు తెరవడానికి తీసుకున్న సమయం కారణంగా ఆలస్యం జరిగింది" అని జిల్లా అధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా.. అధికారులు సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలామంది లబ్ధిదారులు తమకు వచ్చిన ఆ డబ్బులను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో స్ఫష్టంగా చెప్పలేకపోయారు. అందులో 3,500 మంది దళితులు ట్రాక్టర్లను పొందడానికి ఆసక్తి చూపుతుండగా.. 3,500 మంది లబ్ధిదారులు కార్ల కొనుగోలులో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు.

    PM Kisan Credit Card: రైతులకు శుభవార్త.. ఇక నుంచి వాటి కోసం బ్యాంక్ కు వెళ్లకుండానే.. పూర్తి వివరాలివే..


    కానీ ఆ డబ్బులను వ్యాపార కార్యకలాపాల్లో పెట్టుబడి పెట్టి ఉపాధి పొందాలనేది ప్రభుత్వ లక్ష్యం కానీ.. వివిధ రాకల పెట్టుబడి రంగాలను ఎంచుకోవడంతో కూడా ఆలస్యం జరిగిందంటూ కలెక్టర్ పేర్కొన్నారు. వీటిపై కూడా మరికొంత మంది లబ్ధిదారులతో మాట్లాడాల్సి ఉంటుందని.. దాని తర్వాతనే వారికి డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. దళితబంధు డబ్బులను ఉపాధి కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని.. ఏ రంగంలో అయినా పెట్టుబడి పెట్టి.. వాటి ద్వారా ఎక్కువ ఇన్ కమ్ తెచ్చుకోవాలనేది ప్రభుత్వం ఉద్దేశ్యం అన్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Huzurabad, Huzurabad By-election 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు