హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం..గుండెపోటుతో కౌన్సిలర్ భర్త మృతి

Telangana: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం..గుండెపోటుతో కౌన్సిలర్ భర్త మృతి

బండారి నరేందర్ (ఫైల్ ఫోటో)

బండారి నరేందర్ (ఫైల్ ఫోటో)

జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తెలంగాణతల్లి  విగ్రహం వద్ద BRS నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే?

  • News18 Telugu
  • Last Updated :
  • Jagtial, India

జగిత్యాల జిల్లా గాంధీనగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తెలంగాణతల్లి  విగ్రహం వద్ద BRS నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలో BRS కౌన్సిలర్ భర్త బండారి సురేందర్ ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీనితో ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చేశారు. దీనితో ఆత్మీయ సమ్మేళనంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా నృత్యకారులు నృత్యం చేస్తున్నారు . వారంతా రౌండ్ గా ఉండి నృత్యం చేస్తుండగా..బండారి నరేందర్ మధ్యలో ఉండి డ్యాన్స్ చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. ఈ క్రమంలో ఆయన డ్యాన్స్ వేస్తూనే కుప్పకూలారు. ఇది గమనించిన బీఆర్ఎస్ నేతలు ఆయనకు సీపీఆర్ చేశారు. అలాగే నీళ్లను మొహంపై చల్లారు. అనంతరం వెహికల్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్న క్రమంలో మృతి చెందినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే..జగిత్యాలలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ , కవిత టార్గెట్ గా ఫ్లెక్సీలు వెలవడం కలకలం రేపుతోంది. మెట్ పల్లి ప్రధాన కూడళ్లలో పోస్టర్లు వెలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫ్లెక్సీలలో 'నిరుపేదలకు కేసీఆర్ ఇచ్చిన 120 గజాల డబుల్ బెడ్ రూం ఇళ్లు' అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. అలాగే '500 కోట్లతో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన NRI కిసాన్ సెల్..సీఎం గారు మాట ఇస్తే తల నరుక్కుంటాడు గాని మాట తప్పడని' బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్ లో పేర్కొన్నారు.

Ys Sharmila: రేవంత్, బండి సంజయ్ లకు షర్మిల ఫోన్..ఎందుకంటే?

ఇక 'చెప్పినట్టు 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించి మా నాన్న అన్నలతో సెల్ఫీ'..అని కవిత చేబుతున్నట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత పర్యటన వేళ అది ఆమెకు స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పక్కనే ఈ కటౌట్లు ఏర్పాటు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఫ్లెక్సీలను బీజేపీ వారే ఏర్పాటు చేసి ఉంటారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో ఫ్లెక్సీల వార్ ఎటు దారి తీస్తుందో చూడాలి.

First published:

Tags: BRS, Jagtial, Karimnagar, Telangana

ఉత్తమ కథలు