(P.Srinivas,New18,Karimnagar)
చైనా(China)సహా పలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న బీఎఫ్-7 కరోనా వేరియంట్ (BF-7 Corona variant)మన దేశంలోకి రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తూ సూచనలిస్తున్నాయి. ఈ వేరియంట్కు బలమైన ఇన్ఫెక్షన్ (Infection)కలిగించే సామర్థ్యం ఉండడంతోపాటు ఇంక్యుబేషన్ (Incubation)వ్యవధి కూడా తక్కువ ఉండడంతో రీఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం ఉంది. వివిధ దేశాల నుంచి హైదరాబాద్(Hyderabad)కు ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు ద్వారా పలువురు ప్రయాణిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోకి కూడా ఈ వేరియంట్ విస్తరించే ప్రమాదం లేకపోలేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ (Karimnagar)జిల్లా అప్రమత్తమైంది.
కరీంనగర్లో కలవరం..
దేశంలోని పలు ప్రాం తాల్లో ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఎఫ్-7 ప్రవేశంతో కోవిడ్ కేసులు పెరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో జిల్లాలోని జనరల్, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడానికి వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. ఐతే తాజాగా పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం సెంటినరీకాలనీలో సోమవారం ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. సింగరేణి అడ్రియాల ప్రాజెక్టుకు చెందిన జనరల్ మద్దూర్ కార్మికుడు , అతడి తల్లి రెండు, మూడు రోజులుగా జలుబు, జ్వరంతో బాధ పడుతున్నారు. అనుమానం వచ్చిన కార్మికుడు స్థానిక డిస్పెన్సరీలో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. వైద్యులు కార్మికుడి తల్లికి సైతం పరీక్షలు నిర్వహించగా ఆమెకు కూడా పాజిటివ్ గా వచ్చింది. ఇద్దరికీ మందులు అందించి క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు.
కోవిడ్ కొత్త వేరియంట్ కేసులతో గుబులు..
ఇటీవల వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన కార్మికుడు అక్కడ కొవిడ్ బాధితులను కలవడం వల్లే అతడికి సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. కాగా చైనాలో కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో తాజాగా సెంటినరీకాలనీలో రెండు కేసులు వెలుగుచూడటంపై కార్మిక కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఐతే వీరికి సోకిన కరోనా కొత్త Bf-7వెరియంట్ లేక నార్మల్ కరోనా అనేది తెలియాల్సి ఉంది.
మొదటి వేవ్ తొలికేసు కరీంనగర్లోనే..
2020 మార్చి 16న కరీంనగర్లో తొలి కరోనా కేసు నిర్ధారణ అయింది. ముస్లిం మత ప్రవచనాలు బోధి0చేందుకు కరీంనగర్ లో పర్యటించిన ఇండోనేషియా పర్యాటకుల్లో ఒకరికి జ్వరం రావడం, అతన్ని హైదరాబాద్ గాంధీకి తరలించడంతో పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. తదనంతరం 8 మందికి పాజిటీవ్ రావడం తో ఒక్కసారిగా రాష్ట్రమే కాదు దేశం ఉలిక్కిపడింది. కరోనా వైరస్ కరీంనగర్కు తాకడం అందరిని ఆందోళ నకు గురిచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి అత్యావసర సమావేశాన్ని ప్రగతి భవన్ లో నిర్వహించి కలెక్టర్లు, ఎస్పీలు, మేయర్లతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశనం చేశారు.
అప్రమత్తమైన వైద్య సిబ్బంది..
ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన 10 మంది బృందంలో 8 మందికి కరోనా పాజిటీవ్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కరీంనగర్లో హై అలర్ట్ విధించారు. కలెక్టరేట్కు మూడు కిలోమీటర్ల పరిధిలో అంక్షలు విధించారు. హోటళ్లు, దుకాణాలు మూసివేశారు. కరోనా వైరస్ సోకిన ఇండోనేషియా సభ్యులు పర్యటించిన ప్రాంతంలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధక మందును స్ప్రే చేయించారు. కరీంనగర్లో 100 ప్రత్యేక వైద్య బృందాలను 16 టీమ్ లుగా ఏర్పాటు చేసి టీంకు ఒక డాక్టర్ ను నియమించారు. ఆనాడు ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో కరీంనగర్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. ప్రధాని మోడీ నుంచి సీఎణ కేసీఆర్ వరకు అందరూ ప్రశంసించారు.
ప్రజల్లో కలవరం..
ప్రస్తుతం కొత్త వేరియంట్ చైనా తదితర దేశాలను కలవ రపరుస్తుండగా అది మన దేశానికి కూడా విస్తరించిం దని, గుజురాత్లో ముగ్గురు, ఒడిస్సాలో మరొకరు ఈ వేరియంట్తో చికిత్స పొందుతున్నారన్న వార్తలు ప్రజలను కలవరపరుస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coron cases, Karimangar, Telangana News