హోమ్ /వార్తలు /తెలంగాణ /

Corona effect: మా ఊరికి రావొద్దు.. స్వీయ నిర్బంధంలో ఆ గ్రామం.. ఎక్కడో తెలుసా..

Corona effect: మా ఊరికి రావొద్దు.. స్వీయ నిర్బంధంలో ఆ గ్రామం.. ఎక్కడో తెలుసా..

ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Corona Effect: రోజు రోజుకు కరోనా విలయతాండవానికి గ్రామాల్లో ప్రజలు వణికిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు స్వచ్ఛంద లాక్ డౌన్‌ విధించుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని పెద్దకురుమపల్లి గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ గ్రామ ప్రజలు స్వీయ నిర్బంధం పాటించనున్నట్లు ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  Corona Effect: కరోనా మహమ్మారి గత సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరినీ అతలా కుతలం చేస్తుంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో విలయతాండవం చేస్తోంది. దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడంతో స్వచ్ఛందంగా తమకు తామే లాక్ డౌన్ అమలు చేసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని పెద్దకురుమపల్లి గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ గ్రామ ప్రజలు స్వీయ నిర్బంధం పాటించనున్నట్లు ప్రకటించారు. ఒకేసారి 53 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా  గ్రామంలో లాక్డౌన్ విధించినట్లు సర్పంచ్ గంగమల్లయ్య మీడియాకు వెల్లడించారు.

  కొన్ని గ్రామాల్లో కరోనాతో చనిపోయిన వారు కూడా ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.  వీరి బాటలోనే పక్కనే ఉన్న  కొన్ని గ్రామాలు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయి. మరోవైపు కరోనా జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరిచేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జనసమ్మర్ధ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడకుండా అవగాహన కల్పిస్తున్నారు.

  ప్రతీకాత్మక చిత్రం

  మాస్క్ ధరించని వారికి రూ. 1000 జరిమానా కూడా విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద మరోసారి కరోనా ఉధృతి తీవ్రం కావడంతో అధికారులతోపాటు గ్రామ ప్రజలు అప్రమత్తమై మహమ్మారి కట్టడికి ప్రయత్నాలు చేపట్టారు. ఎక్కడకు వెళ్లినా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని.. ప్రతీ ఒక్కరు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని వైద్య అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Choppadandi mandal, Corona cases, Covid-19, Karimnagar, Lock down, Lock down impossed

  ఉత్తమ కథలు