Home /News /telangana /

KARIMNAGAR CONSUMERS SHOCKED BY RISING LEMON PRICES SINGLE LEMON COST IS 25 RUPEES IN KARIMNAGAR MARKET KNR PRV

Lemon Price: తగ్గేదేలే అంటున్న నిమ్మకాయ.. ఒక్కో కాయ ధర రూ.25.. గగ్గోలు పెడుతున్న వినియోగదారులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మార్కెట్ లో కిలో చికెన్.. తో కిలో నిమ్మకాల ధర సమానం.. ఎండలు ముదరడంతో నిమ్మకాయలకి గిరాకీ పెరిగింది . దీంతో ధరలు ఆకాశా న్నంటుతున్నాయి . వాస్తవానికి నిమ్మ కాయలకి ఇంత ధర ఎప్పుడు లేదని అమ్మకందారులు చెబుతున్నారు .

    (P.srinivas,News18,Karimnagar)

    ఇప్పుడు మార్కెట్ లో కిలో చికెన్.. తో కిలో నిమ్మకాల ధర (Lemon Price) సమానం.. ఎండలు ముదరడంతో నిమ్మకాయలకి గిరాకీ పెరిగింది . దీంతో ధరలు ఆకాశా న్నంటుతున్నాయి . వాస్తవానికి నిమ్మ కాయలకి ఇంత ధర ఎప్పుడు లేదని అమ్మకందారులు చెబుతున్నారు . కరీంనగర్లోనే (Karimnagar) కాదు ఉమ్మడి జిల్లాలలో మార్కెట్లో ఒక్క నిమ్మకాయను 20 నుంచి 25 రూపాయలకు విక్రయిస్తున్నా రు . ప్రస్తుతం కరీంనగర్ (Karimnagar) మార్కెట్లలో కిలో నిమ్మకాయ ధర (Lemon Price) నాణ్యతను బట్టి రూ .200 నుంచి 300 వరకు పలుకుతోంది . అసలు మార్కెట్లో నాణ్యమైన నిమ్మకాయలు కనిపించే పరిస్థితి లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేసున్నారు . సాధారణంగా వేసవిలో నిమ్మ కాయలకు డిమాండ్ పెరుగుతుంది . కానీ మరీ ఇంతగా ఎప్పుడు లేదని చెబుతున్నారు. ఒక నిమ్మకాయ ధర 5 కోడుగుడ్లకు , కిలో నిమ్మకాయ ధర కిలో చికెన్ ధరకు సమానంగా ఉంది.

    ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో నిమ్మకాయలు వాడటం తప్పనిసరి . ఆహారంలో తీసుకున్నా .. ఉదయాన్నే నిమ్మకాయ షర్బత్ తాగినా రోగ నిరోధ క శక్తి పెరుగుతుంది . ఇక వేసవిలో నిమ్మ కాయ షర్బత్ తాగితే వడదెబ్బ ప్రభావం పడదు . కానీ ఇప్పుడు సామాన్యుడు కొనలేని స్థాయికి నిమ్మకాయ ధర పెరిగి పోయింది . దేశవ్యాప్తంగా ఒక నిమ్మ కాయ ధర రూ.20-25 మధ్య పలుకుతుంది . నెల రోజుల క్రితం రూ.70-80 లకు లభించిన కిలో నిమ్మకాయ కోసం ఇప్పుడు రూ . 200 నుంచి 300 రూపాయలు పలుకుతుంది .

    గత కొన్ని వారాలుగా నిమ్మకాయ ధరలు అమాంతం పెరిగాయి . దేశవ్యాప్తంగా కలిపి 3.17 లక్షల హెక్టార్లలో నిమ్మతోటలను సాగు చేస్తున్నారు . ఏడాదికి మూడుసార్లు పంట వస్తుంది . 45,000 హెక్టార్లలో నిమ్మతోటలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి . మహారాష్ట్ర , గుజరాత్ , ఒడిశా , తమిళనాడు రాష్ట్రాల్లోనూ నిమ్మకాయ తోటలను సాగుచేస్తారు. అయితే ఈ నిమ్మకాయలు రెండు రకాలుగా ఉంటా యి . లెమన్ అండ్ లైమ్ . చిన్నగా గుండ్రగా ఉండే నిమ్మకాయలు కాగ్ని దేశంలోశాలు ఉన్నాయి .

    బస్తా మూడు వేలకు తెస్తున్నాం ..

    నిమ్మకాయల వ్యాపారి గట్టమ్మ మాట్లాడుతూ .. ‘‘కరీంనగర్ రైతు మార్కెట్ ఎండకాలం నిమ్మకాయ మార్కెట్కు తెస్తే గంటలో సంచి ఖాళీ అయ్యేది . గతంలో పది రూపాయలకు మూడు నుంచి నాలుగు నిమ్మకాయలు అమ్మే వారం . ఇప్పుడు 25 నుండి 30కి అమ్మాల్సి వస్తుంది. మూడు వేలకు బ్యాగ్ తెచ్చాం, 300 రూపాయలకు కిలో అమ్ముతున్నాం . అయితే గతంలో లాగా అమ్మకాలు లేవు, అమ్మ కుంటే మిగిలిపోతే మాకు నష్టమే’’ అంటుంది.

    గిట్ల రేట్లు ఎప్పుడు పెరగలే..

    ‘‘కరీంనగర్ మార్కెట్ మిర్చి ధర పెరిగే , నిమ్మ కాయ ధర పెరిగే , మామిడి కూడా పెరిగేటట్లు ఉంది . గతంలో లాగా అమ్మకాలు లేవు , ధర పెరిగినా పెద్దగా లాభం ఉండటంలేదు . నిమ్మకాయల వ్యాపారం పది సంవత్స రాలుగా చేస్తున్నా , గిట్ల రేట్లు ఎప్పుడు పెరగలే , ఏం చేద్దాం సారు కాలం గట్లయింది . నిమ్మకాయ పచ్చడి పెట్టుకునే వారు కరువయ్యారు. కిలోకు మించి ఎవరూ కొనడంలేదు’’ అంటూ మరో నిమ్మకాయ వ్యాపారి రాధా అంటున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Jagityal, Lemon, Price Hike

    తదుపరి వార్తలు