హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : ఐమాక్స్, మల్టీప్లెక్స్‌ను తలదన్నే స్టైల్లో.. జగిత్యాల జిల్లాలో ఇగ్లు థియేటర్

Telangana : ఐమాక్స్, మల్టీప్లెక్స్‌ను తలదన్నే స్టైల్లో.. జగిత్యాల జిల్లాలో ఇగ్లు థియేటర్

ఇగ్లూ థియేటర్

ఇగ్లూ థియేటర్

Igloo Theater:అన్నీ సినిమాలు ఒకేలా ఉండవు. మరి సినిమా థియేటర్లు మాత్రం ఎందుకు ఒకేలా ఉండాలి. అందుకే జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారి డిఫరెంట్‌గా ఆలోచించారు. జిల్లాలో సినిమా థియేటర్‌ కట్టాలనే తన ఆలోచనకు క్రియేటివిటీని జోడించారు. నగరాలు,పట్టణాల్లో ఉండే మల్టీప్లెక్స్‌లు, సినీ మ్యాక్స్‌లను తలదన్నే విధంగా థియేటర్‌ని డిజైన్ చేశారు. ఇంతకీ ఆ థియేటర్‌ పేరేంటో తెలుసా.

ఇంకా చదవండి ...

(P.Srinivas,New18,Karimnagar)

డిఫరెంట్ సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు డిఫరెంట్‌ సినిమా థియేటర్‌ కట్టించి సర్‌ప్రైజ్ చేశారు అక్కడి వ్యాపారులు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబైలోని మల్టీ ప్లెక్స్‌లు, సినీ మ్యాక్స్‌లు, ఐనాక్స్ థియేటర్లను తలదన్నే విధంగా జగిత్యాల(jagityala)జిల్లాలో ఓ మినీ థియేటర్‌(Mini Theater) కట్టించారు. సినిమా హాలు ఇగ్లూ షేప్‌(Igloo shape)‌లో ఉండటం విశేషం. అందుకే దీనికి ఇగ్లు థియేటర్‌(Igloo Theater)‌ని పేరు పెట్టారు. రొటీన్‌కి భిన్నంగా ఆలోచించి కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. ఇలాంటి ఢిపరెంట్‌ సినిమా హాలు నిర్మించడం ఉత్తర తెలంగాణ(Telangana)లో ఇదే మొట్టమొదటిది కావడం విశేషం.

గ్రామానికి కొత్త సోకులు..

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామస్తులు సినిమా చూడాలంటే 50 కిలొమిటర్ల దూరంలో ఉన్న కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి పట్టణాలకు వెళ్లాలి. అలాంటి పల్లెటూరిలో ఉండే సినిమా అభిమానుల కోసం చుట్ట పక్కల గ్రామాల ప్రజల కోసం రాజశేఖర్ అనే వ్యక్తి ఇగ్లూ థియేటర్‌ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబైలో ఉండే మల్టీప్లెక్స్‌ థియేటర్‌ల కంటే వెరైటీ థియేటర్‌ని డిజైన్ చేయించారు. ఇగ్లూ షేప్‌లో ఉన్న ఈ థియేటర్ పేరు కూడా ఇగ్లుగానే పెట్టారు.

ఇగ్లు థియేటర్‌..

మంచు ప్రాంతాలలో అకర్షనీయంగా కనిపించే ఇగ్లు ఇళ్ల నిర్మాణంలో ఈ థియేటర్ ఉండటంతో నిర్మాణ దశలోనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అయింది. ముంబైకి చెందిన చోటు మహరాజ్‌ మినీ థియేటర్‌ సంస్థ ఈ మినీ థియేటర్‌ని నిర్మిస్తోంది. ఇప్పటికే సినిమా హాలు నిర్మాణం దాదాపుగా తొంభై శాతం పూర్తి అయ్యింది. ఇప్పటికే చొటు మహారాజ్ సంస్థ ఆంధ్రా, తెలంగాణలలో చాలా ప్రాంఛైజ్‌లు ఇవ్వగా ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా ఇగ్లు థియేటర్ ఇక్కడ రూపు దిద్దుకుంటుంది.


త్వరలోనే బొమ్మ పడుద్ది..

నెల రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి రానుంది ఇగ్లూ థియేటర్. రోజు ఐదు షోలు సినిమాలు నడపడానికి యజమాని సిద్ధంగా ఉన్నారు. ఈ మిని థియేటర్ లో వంద సీట్ల కెపాసిటి, పుల్ ఏసి,హై క్వాలిటీ సౌండ్‌ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఇరవై గుంటల స్థలంలో కోటి రూపాయలు ఖర్చు చేసి ఈ ఇగ్లు థియేటర్‌ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో నగరాలే కాదు పట్టణాలు, గ్రామాలు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి. ఆమధ్య కొమురంభీమ్‌ ఆసిఫాబాద్ జిల్లాలో బెలున్‌ థియేటర్‌ నిర్మించారు అక్కడి స్థానిక మహిళసంఘాలు. ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఇగ్లూ థియేటర్‌ నిర్మించారు. అభివృద్ధి పరిణామక్రమంలో భాగంగా తెలంగాణలో ఇలాంటి మినీ థియేటర్ల సంఖ్య పెరుగుతాయంటున్నారు.

First published:

Tags: Jagityal, Telangana

ఉత్తమ కథలు