హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rising suicides: చిన్న కారణాలు.. పెరుగుతున్న ఆత్మహత్యలు.. క్షణికావేశ నిర్ణయాలతో రోడ్డున పడుతున్న కుటుంబాలు..

Rising suicides: చిన్న కారణాలు.. పెరుగుతున్న ఆత్మహత్యలు.. క్షణికావేశ నిర్ణయాలతో రోడ్డున పడుతున్న కుటుంబాలు..

Rising suicides: చిన్న చిన్న కారణాలతో ఈ మధ్యన చాలా మంది క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. దానికోసం ప్రయత్నించాలి కానీ ఇలా ఆత్మహత్యలకు పాల్పడితే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని దీని వల్ల జరిగే నష్టాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఘటనలే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్నాయి.

ఇంకా చదవండి ...

  తల్లిదండ్రులకు తరచూ గొడవ . ఇది చూసిన కుమార్తె ( 21 ) మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి కన్నీరు మిగిల్చగా.. వివాహం జరిగి ఎనిమిదేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో మనస్థాపం చెంది మరొకరు ఆత్మహత్యకు పాల్పడగా.. కుమార్తెతో గొడవ పెట్టుకొని తల్లి ఆత్మహత్య చేసుకోవడం.. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు. వారికి చిన్న గొడవ పెద్ద కారణంగా కనిపించింది . అర్ధం చేసుకుని సర్దుకుపోతే కుటుంబంతో సంతోషంగా జీవించొచ్చని గుర్తించలేదు . క్షణికావేశంలో తనువు చాలించి కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చారు . కారణాలు ఏవైనా జిల్లాలో ఆత్మహత్యలు ఎక్కువే . ఇందులో బాల , బాలికలు ఉన్నారు . ఏదో ఒక వర్గం కాకుండా అన్ని వయసుల వారిలో క్షణికావేశం ఇప్పటికే 20 మంది ఆత్మ హత్య చేసుకున్నరు. అనాలోచిత నిర్ణయం ప్రాణాలు తీస్తోంది. సమస్య ఏదైనా పరిష్కారం లభిస్తుందనే సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలి. ఇందుకు అనుకూలంగా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలి. అప్పుడే బతుకు పై ఆశ కుటుంబంపై బాధ్యత పెరుగుతుంది.

  పిల్లలు లేరనే సమస్య కొందరిలో ఉంటుంది. దత్తతకు తీసుకుని అనాథలకు కొత్త జీవితాన్ని ఇచ్చి సమాజానికి ఆదర్శంగా నిలవొచ్చు. తల్లిదండ్రుల అభిప్రాయాలు పిల్లలపై రుద్ద కూడదు . వారి అభిరుచిని గుర్తించి ప్రోత్సహించే ప్రయత్నం అవసరం. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటి పిల్లల ముందు చర్చించకుండా ఉండటం అవసరం. అంతకు మించి భార్యాభర్తలు పిల్లల ఎదుట గొడవలకు దిగితే అది వారి చిన్ని మనస్సులను కలచి వేస్తుంది. ప్రవర్తనలో మార్పునకు కారణం అవుతుంది. భాగస్వామితో సమస్య వస్తే పిల్లలకు తెలియకుండా ఇరు కుటుంబాలతో చర్చించి పరిష్కారం చూసుకోవడం ఉత్తమం. ఆధునిక జీవన విధానంలో చిన్నారుల మనస్సు సున్నితం. అది గుర్తించి మెదలడం తల్లిదండ్రులకు అవసరం. అతి గారాబం , మితిమీరిన ఆంక్షలు.. రెండూ ప్రమాదకరమే . ఒకరిపై ఒకరికి గౌరవం భార్యాభర్తలు ఒకరికొకరి అభిప్రాయాలకు విలువనివ్వాలి. కుటుంబ సభ్యులపై అందరికీ గౌరవం ఉండాలి. భయం, ఒత్తిడి వంటివి లేకుండా చూసుకోవడం అందరి బాధ్యత .

  నేను చెప్పినట్టే చేయాలి.. ఇలాగే ఉండాలి.. ఇదే చేయాలనే ధోరణి పూర్తిగా తగ్గాలి. కొన్ని సందర్భాల్లో పిల్లలు మంచి సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివి తల్లిదండ్రులతో పంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలి . ఒక వేళ నచ్చక పోతే సున్నితంగా ఇలా కాదేమో.. అన్నట్టుగా వివరించడం ఉత్తమం.  సమస్య ఏదైనా వివాదానికి చోటు లేకుండా పరిష్కారం దిశగా ఆలోచిస్తే ఫలితం ఉంటుంది . ఇంటి సమస్యలకు ఒకరంటే ఒకరు కారణమనే దిశగా వాదన జరగకుండా చూడాలి. ఎవరితో సమస్య అనే విషయం కాకుండా దానికి పరిష్కారం ఏమిటో ఆలోచించే ప్రయత్నం చేయడం అవసరం. ఏదైనా సమస్యతో ఎప్పుడూ లేని విధంగా ప్రవర్తించడం , మాట్లాడటం గుర్తిస్తే వెంటనే వారికి చికిత్స అందించే ప్రయత్నం చేయాలి. లేదంటే భవిష్యత్తు పై ఆశలు కల్పించే విధంగా కుటుంబ సభ్యుల్లో మార్పు చూపిస్తే ఆత్మహత్య అనే ఆలోచన రాదు. అని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.

  First published:

  Tags: Attempt to suicide, Crime news, Karimnagar, Rising commit to suicides, Suicides, Telangana crime

  ఉత్తమ కథలు