Home /News /telangana /

KARIMNAGAR COME TO AMBEDKAR CHOWRASTA I WILL MAKE ALL THE ARRANGEMENTS WHATS THE POINT OF ETALA KNR VB

Etala Rajender: అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు రా.. నేనే అన్ని ఏర్పాట్లు చేస్తానన్న ఈటల వెనుక అంతర్యం ఏమిటి..?

హరీశ్ రావు, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

హరీశ్ రావు, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Etala Rajender: సీఎం పోటీకి వస్తున్నా .. అని నన్ను తొలగించారా .. ? లేక భూముల కబ్జా చేశాడనా .. ? అని హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై హరీశ్ రావు చర్చకు సిద్ధమా ? అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు . ఇలా ఈ వ్యాఖ్యలు చేయడానికి వెనుక అతర్యమేమిటి..? పూర్తివివరాలను తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

  హుజురాబాద్ (Huzurabad) అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు రా .. అన్ని ఏర్పాట్లు నేనే చేస్తా అంటూ ఈటల సవాల్ విసిరారు . ' హరీష్ రావు ఏమైనా తోపా , తురుముఖాన్ ఆ .. ? హరీష్ రావు (Harish Rao) ఒక నీచుడు .. ఆయన నిర్వాకంపై ప్రజలు ఉమ్మేస్తున్నారు . బిడ్డా హరీష్ ... హుజురాబాద్లో నువ్వు నడిచే రోడ్లు ఎవరు వేశారు ? నీకు కేసీఆర్ మంత్రి ఇవ్వను అన్నది నిజం కాదా .. ? హరీష్ రావు సీఎం సీటుకే ఎసరు పెట్టాడు . సీఎం పోటీకి వస్తున్నా .. అని నన్ను తొలగించారా .. ? లేక భూముల కబ్జా చేశాడనా .. ? అని హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై హరీశ్ రావు చర్చకు సిద్ధమా ? అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etala Rajender) సవాల్ విసిరారు . హుజురాబాద్లోని మధువని గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్ రావు ఓ రబ్బరు స్టాంప్ అని.. ఆయనకు సిద్దిపేట (Siddipeta) నియోజకవర్గంలోనే స్వేచ్ఛ లేదన్నారు .

  Newborn Baby: చెత్త కుప్పలో మగ శిశువు.. బావిలో దూకిన మైనర్ బాలిక.. అసలేమైందంటే..

  అర్థరాత్రి తమ నాయకుల ఇండ్లలోకి దొంగలా జొరబడి బెదిరించే నీచానికి ఆయన దిగజారారన్నా రు . హరీశ్ రావు , ఆయన మామ కేసీఆర్ ఇద్దరు వచ్చి పబ్బతిపట్టినా హుజురాబాద్లో టీఆర్ఎస్కు గోరీ కట్టడం ఖాయమన్నారు . తాను కుంకుమ భరణిలు పంచినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని , లేదంటే ఆయన ముక్కు నేలకు రాయాలని ? సవాల్ విసిరారు ..

  Organ Donation: అవయవదానంలో కూడా వీడని స్నేహం.. చనిపోయి కూడా 13 మందిని బతికించారు.. ఎక్కడంటే..

  హరీష్ రావు అంబేద్కర్ చౌరస్తాకు రా .. ఉద్యమకారుడువని , ట్రబుల్ షూటర్ అని హరీశ్ కు ప్రజల్లో కొంత ప్రేముండేదని , ఇప్పుడు.. అది పోయిందని అన్నారు . ఆయన మామ మాయలో పడి తన మీద ఆరోపణలు చేస్తే రాజకీయ జీవితాన్ని బొంద పెట్టడం ఖాయమన్నారు . హరీష్ రావ్ హుజూరాబాద్లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారని.. వాళ్ళు డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడని అన్నారు . తనపై ఆరోపణలన్నీ నిరూపించాలని సవాల్ విసిరారు . హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా లో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు .

  Minor Girl: ఆన్‌లైన్‌ క్లాసులు పక్కనపెట్టి.. నగ్న వీడియోలను వెబ్ సైట్ లో పోస్టు చేసిన బాలిక.. చివరకు..

  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉనప్పుడు ఏసీడీపి నిధులు తీసుకొని అన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకున్నాం కదా ? మరి ఎందుకు ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వరని ప్రశ్నించారు . 5 కోట్ల ఏసీడీపీ నిధులు మంత్రి దగ్గర పెట్టి ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేసింది ఆయన కాదా అని ప్రశ్నించారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిధులెందుకు ఇవ్వరని , అబ్బ సొమ్మ అని అడిగింది మనం కాదా అని ప్రశ్నించారు .

  Income Source: ప్రతీ నెల రూ.200 పొదుపుతో.. రూ.28 లక్షల వరకు పొందొచ్చు.. వివరాలిలా..

  మరి ఇప్పుడు వాళ్లు చేస్తున్నదేంటని ప్రశ్నించారు . తెలంగాణ ప్రజలారా హరీష్ ఇక్కడ చేస్తున్న పనులు గమనించాలన్నారు . నిత్యం సొంత పార్టీ వారిని అంగట్లో సరుకు లాగా వెలగట్టి కొంటున్న నీచుడు హరీష్ రావు అన్నారు .

  వాళ్లది ప్రేమ వివాహం.. హైదరాబాద్ కు వలస వచ్చారు.. పక్కింట్లో రొట్టెలు ఇవ్వడానికి వెళ్లిన మహిళ.. తిరిగి రాలేదు.. అసలేమైందంటే..

  ఈటలకు అనుకూలంగా ఎవరెవరు ఉన్నారని సమాచారం తెచ్చుకొని వారిని బెదిరించి , మభ్య పెట్టి చేర్చుకుంటున్నారన్నారు . ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తాను తన నియోజక వర్గానికి నిధులు తెచ్చుకున్నానని , రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో ఎమ్మెల్యేకి మీరు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రూ. 1400 మాత్రమే , కానీ తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నా నియోజకవర్గం అంతా సర్వే చేసి 3900 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అవసరం అని మంజూరు తెచ్చుకున్నానని , అందులో 500 హుజూరాబాద్ లో , 500 జమ్మికుంటలో కట్టించిన.. మరో 500 ఇల్లు ఇల్లంతకుంటలో పూర్తి కావచ్చాయని తెలిపారు .

  Smart Air-purifier: భారతీయుల ప్రతిభ.. మొక్కతో ఎయిర్‌ ప్యూరిఫయర్‌ తయారీ.. ఎలా పని చేస్తుందంటే? 

  చినకోమటి పల్లి , కల్లుపల్లి , కోరుకల్ లో మొత్తం 2000 ఇల్లు కట్టించామని , కానీ రోడ్లకు , స్తంభాలకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అవి ఇంకా ప్రారంబించుకోలేదని అన్నారు . హరీశ్ రావు తిరుగుతున్న 4 లైన్స్ రోడ్డు తానే వేయించానని , రాష్ట్రంలో అత్యధికంగా చెక్ డ్యాంలు కట్టించామని తెలిపారు . కాంట్రాక్ట్ లేక్షరర్లకు ఇస్తానన్న డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు .

  Telangana Crime News: పొలం విషయంలో గొడవ.. చివరకు భార్య కట్టుకున్న భర్తను ఏం చేసిందో తెలుసా..

  2015 లో కేసీఆర్ నిరంకుశ వ్యవహారం మొదలయ్యిందని , మొదటి అవమానం గురి అయ్యింది హరీశ్ కాదా అని ప్రశ్నించారు . రెండో సారి ఆయనకు మంత్రి పదవి తాను మాట్లాడడం వల్ల వచ్చిందని మర్చిపోతే ఎలా అని అన్నారు . 2004 లో ఎన్నికల ఆఫీడవిట్ తీద్దామని , ఎవరు దిక్కు లేకుండా ఉన్నారో తెలుస్తుందన్నారు .

  Airlines: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉచితంగానే విమాన టికెట్.. ఎలా పొందాలంటే..

  తాను వ్యాపారం చేసుకొని సంపాదిస్తున్నానని , మరి హరీశ్ కు సంపద ఎలా పోగైందని ప్రశ్నించారు . హైదరాబాద్ భూముల కన్వర్షన్ చేయడానికి ఎన్ని డబ్బులు చేతులు మారుతున్నాయో తన వద్ద సమాచారం ఉందని , త్వరలో అన్ని బయటికి వస్తాయని అన్నారు . హుజూరాబాద్ మీ పతనానికి నాంది పలుకుతుందన్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Eetala rajender, Harish Rao, Huzurabad By-election 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు