సీఎస్‌ను కలిసి కరీంనగర్ కలెక్టర్... ఆ అంశంపై వివరణ

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికల అఫిడవిట్ వివాదంపై తనకూ, బండి సంజయ్‌కు మధ్య జరిగిన సంభాషణ ఆడియో బయటకు రావడంతో సీఎస్‌కు కలెక్టర్ వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 18, 2019, 6:42 PM IST
సీఎస్‌ను కలిసి కరీంనగర్ కలెక్టర్... ఆ అంశంపై వివరణ
కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్(ఫైల్ ఫోటో)
  • Share this:
కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సీఎస్ ఎస్కే జోషిని కలుసుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికల అఫిడవిట్ వివాదంపై తనకూ, బండి సంజయ్కు మధ్య జరిగిన సంభాషణ ఆడియో బయటకు రావడంతో సీఎస్‌కు కలెక్టర్ వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్, ఎంపీ బండి సంజయ్ కలిసి తన ఓటమికి కుట్ర పన్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై చారు. ఈ విషయంపై తాను సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని గంగుల కమలాకర్ తెలిపారు. కలెక్టర్‌ సర్పరాజ్‌కు బండి సంజయ్‌కు మధ్య జరిగిన ఫోన్‌కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో దీనిపై కలెక్టర్ సర్ఫరాజ్ సీఎస్‌ను కలిసి వివరణ ఇచ్చారు.

ఎన్నికల కమిషన్ విధించిన పరిమితికి మించి అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల ఖర్చు చేశారని, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ ఆ ఎన్నికల్లో ఓడిపోయిన సంజయ్ హైకోర్టులో కేసు వేశారు. అది ప్రస్తుతం విచారణలో వుంది. దీంతో ఈ అంశంపై తానేమీ మాట్లాడబోనని...తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని బండి సంజయ్ తెలిపారు.
Published by: Kishore Akkaladevi
First published: November 18, 2019, 6:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading