Smriti Irani : కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

Smriti Irani : కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

Smriti Irani : హుస్నాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభ కొనసాగుతోంది.. మొదటి దశ ముగింపు సభకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిధిగా హజరయ్యారు.

  • Share this:
    ఈ సంధర్భంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ( Smriti Irani ) ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను వివరించారు...ఇందులో భాగంగానే రామగుండం (Ramagundam ) ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కరోనా సమయంలో ప్రభుత్వం 80 కోట్ల మందికి రేషన్ బియ్యం అందించిందని , మరోవైపు మహిళలకు డబ్బులు కూడా ఇచ్చిందని చెప్పారు. ప్రతి మహిళతో పాటు ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా భారతీయ జనత పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు.. పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు మేలు కల్పిస్తున్నామని చెప్పారు. కాని సీఎం సీఎం కేసీఆర్ ( cm kcr ) సహకరించడం లేదని ఆమె దుయ్యబట్టారు.. భారతీయ జనత పార్టీకి తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీ మద్దతు పలికితే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ది చేసి చూపిస్తామని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బీజేపీలోకి అధికారంలోకి రాబోతుందని చెప్పారు.

    ఇక తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె పండిపడ్డారు. నీళ్లు ,నిధులు నియామాకాల పేరుతో అధికారంలోకి వచ్చిన హామీ తుంగలో తొక్కారని చెప్పారు. ఇక ఉద్యోగాలన్ని కేసీఆర్ కుటుంబానికి దక్కాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగాలను కూడా భర్తి చేయడం లేదని ఆమె విమర్శించారు. ఇక తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న సీఎం కేసీఆర్ ఎమ్ఐఎం ( mim ) చేతిలో కీలుబొమ్మగా మారరాని ఆమె విమర్శించారు. ఎమ్‌ఐఎమ్‌కు భయపడే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదని మండిపడ్డారు. ఇక సీఎం కేసీఆర్ ఇస్తానని 3000 రూపాలయ ప్రకటించిన నిరుద్యోగ భృతిలో కనీసం వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడం లేదని ఆమె దుయ్యబట్టారు.

    కాగా బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నేటికి 438 కిలోమీటర్ల పాటు కొనసాగింది. మొత్తం 38 రోజుల  పాటు పలు పార్లమెంట్ నియోజవర్గాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. కాగా పాదయాత్రలో ప్రజలు అనేక వినతులు ఇచ్చారు.
    Published by:yveerash yveerash
    First published: