టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) కు సీబీఐ (Central Burew Of Investigation) అనూహ్య షాక్ ఇచ్చింది. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ (Central Burew Of Investigation) నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. గతంలో విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ సీబీఐ (Central Burew Of Investigation) పేరుతో అక్రమాలకు పాల్పడ్డాడు. తాను సిబిఐ (Central Burew Of Investigation) అధికారిని అంటూ చెలామణి అయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ (Central Burew Of Investigation) ఇటీవల కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) తో దిగిన ఫోటోలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మంత్రి గంగుల (Minister Gangula Kamalakar)ను సాక్షిగా విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగులకు (Minister Gangula Kamalakar), శ్రీనివాస్ కు మధ్య సంబంధాలపై అధికారులు విచారించనున్నట్టు తెలుస్తుంది.
స్పందించిన గంగుల కమలాకర్ ..ఏమన్నారంటే?
కాగా తన ఇంటికి సీబీఐ అధికారుల రాకపై గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) స్పందించారు. తన ఇంటికి సిబిఐ (Central Burew Of Investigation) అధికారులు రావడం నిజమే. 4 రోజుల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ ఆఫీసర్ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత నాతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ విషయం తెలుసుకున్న సిబిఐ (Central Burew Of Investigation) అధికారులు ఆ కేసులో నన్ను సాక్షిగా పరిగణించి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. నేను రేపు ఢిల్లీకి వెళతాను. జరిగింది ఏంటో సీబీఐ (Central Burew Of Investigation)కి వివరిస్తానని గంగుల (Minister Gangula Kamalakar) చెప్పుకొచ్చారు.
గతంలో దాడులు..
తెలంగాణలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ(ఐటీ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు...అందులో భాగంగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ ఈ సంస్థల అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి మరీ అధికారులు ఆయన ఇంటిలోకి ప్రవేశించారు.
కరీంనగర్ లోని గంగుల ఇంటితో పాటు మంకమ్మతోటలోని కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్స్, కమాన్ ప్రాంతంలోని మహావీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్ లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. గ్రానైట్ ఎగుమతుల్లో భాగంగా ఆయా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో ఇదివరకే తెలంగాణకు చెందిన 8 సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆదాయపన్ను శాఖ అధికారులతో కలిసి ఈడీ దాడులు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBI, Gangula kamalakar, Hyderabad, Karimnagar, Telangana