హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆ కాంగ్రెస్‌ నేత గాడిదను ఎత్తుకెళ్లాడంట.. ఛీ ఆ పని చేసినందుకే పోలీసులు కేసు పెట్టారంట

ఆ కాంగ్రెస్‌ నేత గాడిదను ఎత్తుకెళ్లాడంట.. ఛీ ఆ పని చేసినందుకే పోలీసులు కేసు పెట్టారంట

కాంగ్రెస్ నేతపై కేసు నమోదు

కాంగ్రెస్ నేతపై కేసు నమోదు

Shamefull Incident: కాంగ్రెస్‌ నేత వెంకట్‌ బల్మూర్‌పై కేసు నమోదైంది. నిన్న కరీంనగర్ జిల్లాలో గాడిదను ఎత్తుకొచ్చి దానికి కేసీఆర్‌ ఫోటో తగిలించారు. జంతువును హింసించారన్న ఫిర్యాదుతో పోలీసులు వెంకట్‌ బల్మూర్‌పై కేసు నమోదు చేశారు.

చోటా, మోటా రాజకీయ నాయకులు విచక్షణ కోల్పోతున్నారు. నిరసనలు, ఆందోళనల రూపంలో ప్రత్యర్ది పార్టీల నాయకుల్ని అవమానించడానికి చివరకు దొంగతనాలు, మూగజీవుల్ని హించే హీనస్థితికి దిగజారుతున్నారు. కరీంనగర్‌ (Karimnagar)జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర నాయకుడు వెంకట్‌ బల్మూర్‌(Venkat Balmoor)పై కేసు నమోదైంది. హుజురాబాద్‌ కాంగ్రెస్‌ (Huzurabad congress) పార్టీ తరపున ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాంగ్రెస్‌ నాయకుడు వెంకట్‌ బల్మూర్ చేసిన ఘనకార్యం ఏమిటంటే..ఒక గాడిదను ఎత్తుకొచ్చి(Stealing a donkey)దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోటో తగిలించి ఒక మూగజీవిని హింసించారు. ఇదంతా గురువారం జరిగింది. కేసీఆర్‌ (CM KCR)జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్‌ నేత వెంకట్‌ బల్మూర్ చేపల వ్యాన్ లో గాడిదను తీసుకొచ్చి, గాడిద మొహానికి సీఎం కేసీఆర్ ఫోటో పెట్టి మూగజీవితో అమానుషంగా ప్రవర్తించారు. ఈ తరహా ఘటనను వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లాకు చెందిన సతీష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి పోలీసు స్టేషన్‌లో వెంకట్ బల్మూర్‌పై కేసు నమోదైంది. నోరులేని మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ జంతు హింసకు పాల్పడ్డారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు కరీంనగర్ అదనపు డిసిపి లా అండ్ ఆర్డర్ శ్రీనివాస్ తెలిపారు.

గాడిదను ఎత్తుకొచ్చిన అడ్డగాడిదలు..

ప్రజాస్వామ్య పద్దతిలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాని దాన్ని వ్యక్తపరిచే విధానం సరైన పద్దతిలో ఉండాలని పోలీసులు రాజకీయ నాయకులకు సూచిస్తున్నారు. ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీయకుండా..ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా నిరసనలు, ఆందోళనలు చేస్తే కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉండదని అదనపు డీసీసీ శ్రీనివాస్ తెలిపారు. పోలీసు కమిషనరేట్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అదనపు డీసీపీ కాంగ్రెస్‌ నేతలు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

నిరసన తెలిపే విధానం ఇదేనా..

గతంలో రాజకీయ నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు మాత్రమే చేసుకునే వారు. కాని ప్రస్తుతం నిరసనల పేరుతో ప్రత్యర్దుల్ని కవ్విస్తూ ఆందోళనలు చేపట్టడంపై ప్రజల కూడా అసహ్యించుకుంటున్నారు. రాజకీయ ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Huzurabad, TS Congress

ఉత్తమ కథలు