Huzurabad By Elections: హుజురాబాద్ లో ఊపందుకోనున్న ప్రచారం.. అభ్యర్థుల బలాలు.. బహీనతలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad By Elections: ఎట్టకేలకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నగా రా మోగింది . కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మూడు పార్లమెంటు , 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్ని కల షెడ్యూలును ప్రకటించింది . ఉప ఎన్నికల షెడ్యూలులో హుజురాబాదు స్థానం కల్పించడంతో మరింత ఆలస్య మవుతుందనుకున్న ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి .

 • Share this:
  (P.Srinivas,News18,Karimnagar)

  ఎట్టకేలకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ (Huzurabad) అసెంబ్లీ ఉప ఎన్నిక నగా రా మోగింది . కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మూడు పార్లమెంటు , 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్ని కల షెడ్యూలును ప్రకటించింది . ఉప ఎన్నికల షెడ్యూలులో హుజురాబాదు స్థానం కల్పించడంతో మరింత ఆలస్య మవుతుందనుకున్న ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి . ఇప్పటికే హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తుండగా షెడ్యూలు ప్రకటనతో ప్రచారం మరింత ఉపందుకోనుంది . టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశా ఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయగా ఈటల రాజేందర్ జూన్ మొదటి వారంలో ఎమ్మెల్యే పదవికి , పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు .

  Minister KTR: మరోసారి ట్విట్టర్ లో పొరపాటు పోస్టు చేసిన మంత్రి కేటీఆర్..! అదేంటంటే..


  ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదిం చడంతో ఎన్నిక అనివార్యమైంది . తద నంతరం ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ లో చేరారు . ఈ స్థాన్నాన్ని అత్యంత ప్రతి ష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆరెఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటనకు ముందే హుజురాబాద్ నియోజవర్గంలో ప్రచారం విస్తృతం చేసింది . టీఆర్ఎస్వి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న వీణ వంక మండలానికి చెందిన గెల్లు శ్రీని వాస్ ను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం మరింత పెంచింది . గత నెల 16 న రాష్ట్ర ముఖ్యమంత్రి హుజురాబాద్ లో పర్యటించి దళిత బంధు పథకాన్ని ప్రారంభిం చడంతో పాటు హుజురాబాద్ నియోజక వర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నా రు .

  హుజురాబాద్ నియోజకవర్గ పరిధి లోని 5 మండలాల్లోని 21 వేల మంది దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు . ఎన్నికల షెడ్యూల్ ప్రటించిన మంగళవారం నాటికి 17 వేల కుటుంబాల దళిత బంధు అకౌంట్లలో ఆర్థిక సహాయం జమ అయింది . దళిత బంధుతో పాటు అనేక వరాలు హుజు రాబాద్ పై కురిపించడంతో పాటు సంక్షే మ పథకాల అమలు వేగాన్ని పెంచారు . ఈటెలను ఢీ కొట్టేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు . వీరితో పాటు మంత్రులు గంగుల కమలాకర్ , కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్సీ బాల్క సుమన్ , తదితరులు ఇంచార్జిలుగా విస్తృత పర్యటనలు చేపట్టారు .

  రైల్వేస్టేషన్ వద్ద వారిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.. వారిని ప్రేమికులు అనుకున్నారు.. కానీ ఇంతలోనే..


  కుల సంఘాల వారిగా భవన నిర్మాణాలకు నిధుల కేటాయింపు , కుల సంఘాల సమావేశాలను కూడా పూర్తి చేశారు . హుజురాబాద్ నియోజక వర్గంలో ఈటల రాజేందర్ కు ఉన్న పట్టును తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఎన్నికల నోటిఫికేష న్ వచ్చింది . ఈటెల రాజేందర్ బిజెపి అభ్యర్థిగా భరిలో నిలుస్తుండడంతో బిజెపి కూడా ఈ ఎన్నికను సవాల్ గా తీసు కుంది . ఇటీవల నిర్మల్ లో పర్యటించిన అమిత్ షా ఈటెల రాజేందర్ భుజం తట్టి ధైర్యం చెప్పడంతో ఆయన మరింత దూకుడు పెంచారు .

  మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బిజెపి ఎన్నికల ఇంచార్జిగా పని చేస్తు న్నారు . బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఇప్పటికే పర్యటించారు . బండి సంజయ్ అక్టోబర్ 2 న తన మొదటి దఫా పాదయాత్రను హుజురాబాద్లో ముగుస్తుండడం ప్రాధాన్యతను సంత రించుకుంది . ఏది ఏమైనా ఈ ఎన్నిక ఇరు పార్టీలకు సవాల్ అని చెప్పవచ్చు .

  Huzurabad By Elections: టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ ఇదేనా.. అందుకే వాళ్లతో ఇలా చేస్తున్నారా..?


  ఇంకా అభ్యర్థి వేటలోనే కాంగ్రెస్
  రాష్ట్రంతో పాటు దేశంలో ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికి కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థి పేరును ప్రకటించలేకపోయింది . టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశంతో ఆశా వాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు . మొత్తం 18 మంది హుజురాబాద్ కాంగ్రెస్ టికెట్ తమకు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు .

  తొలుత మాజీ మంత్రి కొండ సురేఖ పేరును కూడా పరిశీలించారు . ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది . టిపిసిసి హుజురాబాద్ నియోజకవర్గానికి ఇంచార్జిలను ప్రకటించింది . " కానీ అభ్యర్థి ఎంపిక విషయంలో జాప్యం చేస్తుండడంతో కార్యకర్తల్లో నిరాశ నెలకొంది .
  Published by:Veera Babu
  First published: