Home /News /telangana /

KARIMNAGAR BROTHER WHO KILLED HIS YOUNGER BROTHER IN A PROPERTY DISPUTE JAGITYALA DISTRICT SNR KNR

Jagityala: తల్లి ముందే తమ్ముడ్ని గొడ్డలితో నరికి చంపిన అన్న..ఎందుకో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

(అన్నా ఎంత పని చేశావురా)

(అన్నా ఎంత పని చేశావురా)

Jagityala:ఆరు కుంటల భూమి కోసం తమ్ముడ్ని గొడ్డలితో నరికి చంపాడో అన్నయ్య. జగిత్యాల జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఆస్తి వివాదం పరిష్కరించుకునేందుకు కుటుంబ సభ్యుల మధ్యలో గొడవపడ్డారు అన్నదమ్ములు. తమ్ముడి భూమి వేరే వాళ్లకు అమ్మడం ఇష్టం లేని అన్నయ్య ఇంట్లో ఉన్న గొడ్డలితో తలపై నరికి చంపాడు.

ఇంకా చదవండి ...
    ఒకే తల్లి బిడ్డలు. భూమి దగ్గర వచ్చిన గొడవ. రక్తం పంచుకుపుట్టాడనే కనికరం తోడబుట్టిన అన్నకు లేదు. పెద్దొడు కదా గొడవ ఎందుకని తమ్ముడు తగ్గలేదు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ కారణంగా సొంత అన్న క్షణికావేశంలో తల్లి, తమ్ముడిపై గొడ్డలితో నరికేశాడు. చూస్తుండగానే తల్లి, సోదరి కళ్ల ముందే తన కంటే చిన్నవాడు రక్తపు మడుగులో పడి చనిపోయాడు. అత్యంత దారుణమైన ఈఘటన జగిత్యాల (Jagityala)జిల్లాలో చోటుచేసుకుంది. గొల్లపల్లి(Gollapalli)మండలం రంగధామునిపల్లి(Rangadhamunipalli)గ్రామంలో ఈ హత్య జరిగింది. తిర్మాలాపూర్‌ (Thirmalapur)గ్రామానికి చెందిన రాజవ్వRajavvaకు ముగ్గురు కొడుకులు ఓ కుమార్తె ఉంది. ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు నర్సయ్య (Narsayya)బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లాడు. రెండో వాడు గోపాల్‌(Gopal‌)మనస్పర్ధల కారణంగా భార్యను వదిలి తన అన్నయ్య ఉంటున్న రంగధామునిపల్లెలో ఉంటున్నాడు. మూడో కొడుకు శ్రీకాంత్(Srikanth). పెళ్లి కాలేదు. హైదరాబాద్‌(Hyderabad)లో పని చేసుకుంటే అప్పుడప్పుడు తిర్మాలాపూర్‌(Thirmalapur)కి వచ్చిపోతు ఉంటున్నాడు. కుమార్తె కూడా భర్తతో గొడవపడి తల్లి దగ్గర ఉంటోంది. రాజవ్వ, పోషయ్య దంపతులకు చెందిన 20కుంటల భూమిని నలుగురికి సమానంగా పంచారు. శ్రీకాంత్‌ వాటా కింద వచ్చిన 6కుంటల భూమిని అమ్ముకొని ఊళ్లోనే ఏదైనా వ్యాపారం పెట్టుకుందామనుకున్నాడు. ఆ భూమిని బయట వాళ్లకు అమ్మడానికి ఇష్టపడని శ్రీకాంత్ అన్న గోపాల్ అడ్డుపడుతూ వచ్చాడు. ఆ భూమిని తనకే అమ్మాలని పట్టుబట్టాడు. ఈక్రమంలోనే అన్నదమ్ములిద్దరి మధ్య తల్లి, సోదరి కళ్ల ముందే గొడవ జరిగింది.

    అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవ..
    నెల రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి వచ్చిన శ్రీకాంత్‌ వాటాగా తనకు వచ్చిన భూమిని అమ్మేందుకు తిరుగుతున్నాడు. గోపాల్‌ పదే పదే భూమి అమ్మకుండా అడ్డుపడుతుండటంతో తల్లి రాజవ్వతో కలిసి పెద్ద అన్నయ్య ఉంటున్న రంగధామునిపల్లికి వెళ్లాడు శ్రీకాంత్. అక్కడ ఉంటున్న రెండో అన్న గోపాల్‌తో తన వాటాగా వచ్చిన భూమిని అమ్ముకుంటానని తెగేసి చెప్పాడు. అంతే తమ్ముడు మాటలతో కోపోద్రేకుడైన గోపాల్‌ క్షణికావేశంలో ఇంట్లో ఉన్న గొడ్డలితో శ్రీకాంత్ తలపై నరికి చంపాడు.

    గొడ్డలితో తమ్ముడ్ని నరికిన అన్నయ్య..
    కన్నతల్లి కళ్ల ముందే రెండే కొడుకు చిన్న కొడుకుని గొడ్డలితో నరకడం, అతని రక్తపు మడుగులో పడి గిలగిలి కొట్టుకోవడం చూసిన రాజవ్వ సొమ్మసిల్లి పడిపోయింది. కాసేపటికి తేరుకున్న తల్లి, సోదరి బోరున విలపించారు. ఈ హత్య గ్రామంలో కలకలం రేపింది . ఆస్తి వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం ఏకంగా ఒకరిని ప్రాణాలు తీసేందుకు పురి కోల్పడం చూసి ఆశ్చర్యపోయారు. జరిగిన దారుణంపై పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కి చేరుకున్న సీఐ కోటేశ్వర్, ఎస్‌ఐ శ్రీధర్రెడ్డి మృతుని బంధువుల ద్వారా వివరాలు సేకరించారు. శ్రీకాంత్‌ని హత్య చేసింది తన రెండో కొడుకు గోపాల్‌ అని తల్లి రాజవ్వ చెప్పడంతో కేసు నమోదు చేసే...అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Crime news, Jagityal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు