Home /News /telangana /

KARIMNAGAR BREAK FOR DIRECT TRAIN SERVICE FROM KARIMNAGAR TO DELHI HYDERABAD SNR KNR

Telangana:నత్తనడకన కరీంనగర్  రైల్వేలైన్‌ పనులు..దశాబ్దాల కల నెరవేరక విలవిల

(మోక్షమెప్పుడో ..?)

(మోక్షమెప్పుడో ..?)

Karimnagar:కరీంనగర్ జిల్లా ప్రజల దశాబ్ధాల కల. పదిహేనుళ్ల క్రితం పనులు మొదలుపెట్టినప్పటికి నేటి మోక్షం దక్కడం లేదు. అనేక కారణాలతో అడుగడుగున రైల్వే లైన్‌ పనులకు బ్రేక్‌లు పడుతూనే ఉన్నాయి. పూర్తయ్యేది ఎప్పటికోనంటున్న కరీంనగర్‌ జిల్లా ప్రజలు.

ఇంకా చదవండి ...
  (P.Srinivas,New18,Karimnagar)
  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు కావస్తున్నా.. కరీంనగర్‌(Karimnagar)జిల్లా కేంద్రాన్ని కలుపుతూ నేరుగా ఢిల్లీ వెళ్లే రైల్వే కనెక్టివిటీకి మాత్రం మోక్షం కలగడం లేదు. ఉమ్మడి జిల్లాకు తూర్పు ప్రాంతాలైన రామగుండం(Ramagundam), పెద్దపల్లి (Peddapalli), జమ్మికుంట(Jammikunta)నుంచి దేశ రాజధాని ఢిల్లీ , రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad)ని కలిపే రైలు(Train)కనెక్టివిటీ(Connectivity)ఉన్నప్పటికీ .. జిల్లా కేంద్రానికి ఆ సౌకర్యం ఇప్పటి వరకు లేదు. భూసేకరణ, నిధుల కొరత వంటి సూష్మ కారణాలను చూపిస్తూ ఎప్పటికప్పుడు ఈ మెయిన్‌ రైల్వే కనెక్టివిటీని సైడ్ ట్రాక్‌ పట్టిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు కాచిగూడ- పెద్దపల్లి (Kachiguda- Peddapalli)ట్రైన్ ఉంది. అయితే ఇది డైరెక్టుగా హైదరాబాద్ వెళ్లే వారికంటే జగిత్యాల(Jagityala),కామారెడ్డి(Kamareddy)వెళ్లే వారికి బాగుంటుందనే విమర్శలు ఉన్నాయి. కరీంనగర్ నుంచి నిజామాబాద్‌ సుమారు 200 కిలోమీటర్ల దూరం. అక్కడ నుంచి కాచిగూడకు మరో 150 కి.మీ. మొత్తం 350 కిమీ ప్రయాణించి రాత్రి 9.45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది . ఇంత లాంగ్ జర్నీలా ఉండే ట్రైన్‌లో వెళ్లే వారు నిజామాబాద్ వరకే వెళ్తున్నారు. అక్కడి నుండి మళ్లీ హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి రావడం ఒకింత కష్టమంటున్నారు.

  ఆ ట్రైన్‌కి మోక్షమెప్పుడు..
  కరీంనగర్ రైల్వే లైన్‌కి బ్రేకులు పడటానికి ప్రధాన కారణం భూసేకర. ఉమ్మడి జిల్లాలోని వేములవాడ , సిరిసిల్ల , సిద్దిపేట ప్రాంతవాసులకు రైలు ప్రయాణం అందుబాటులోకి తేవాలన్నది ప్రధాన ఆలోచన. ఇందుకోసం 2006-07లో 151 కి.మీల దూరం కలిగిన కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్‌కు రూ. 1167 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అప్పటి కేంద్రం దీన్ని పక్కనపెట్టింది. అలా మొదటి ప్రయత్నంలో ఆగిపోయిన రైల్వే లైన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పూర్తవుతుందని భావించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో 1/3 వంతు చెల్లించడంతో పాటు 100 శాతం భూమిని సేకరించి ఇవ్వాలని..ఈ రూట్‌లో వచ్చే నష్టాలను ఐదేళ్ల పాటు భరించేందుకు కూడా తెలంగాణ సర్కారు ముందుకొచ్చింది. దీంతో 2016లో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది.

  పనులు చకచక జరిగేదెలా..
  పనుల్లో భాగంగానే ప్రస్తుతానికి మనోహరాబాద్- గజ్వేల్ మధ్య 32 కిమీ వరకు ట్రాక్‌ పూర్తైంది. ట్రయల్‌ రన్స్‌ కూడా నడుస్తోంది. మిగిలిన 119 కిమీ మేర ట్రాక్ పనులు పూర్తి కావాలి. కాని ఇప్పుడు కూడా జాప్యం జరుగుతుండటంతో అధికారులు భూసేకరణ విషయంలో ఇబ్బందులొస్తున్నాయంటున్నారు. కొత్తపల్లి, సిరిసిల్లలో సమస్యల్ని పరిష్కరించినప్పటికి వేములవాడలో రైతులు పరిహారం సరిపోదంటూ కోర్టుకు వెళ్లడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అడుగడుగున బ్రేక్‌లు పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ఎప్పటికి పూర్తవుతుందోనని సిరిసిల్ల , వేములవాడ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

  ఇప్పట్లో అయ్యే పనేనా..
  కరీంనగర్‌ టు హైదరాబాద్ మెయిన్‌ లైన్‌ పనులపై రైల్వే అధికారులు చెబుతున్న మాట ఏమిటంటే 1119.5 హెక్టార్ల భూసేకరణకు.. ఇప్పటి వరకు 777 హెక్టార్లు పూర్తైంది. వీటికి పరిహారం కోసం గతేడాది రూ .325 కోట్లు విడుదలైనట్లుగా తెలిపారు. తాజాగా మరో రూ .60 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా కేంద్ర బడ్జెట్లో పేర్కొంది. చెబుతున్న లెక్కలు పక్కన పెడితే జరుగుతున్న పనులు మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. ఒక్క రైల్వే లైన్‌ పూర్తికాకపోవడం వల్ల తీగలగుట్టపల్లిలో రైల్వే లైన్ క్రాసింగ్ చేయడం ఇబ్బందిక రంగా మారుతోందంటున్నారు కరీంనగర్ జిల్లా ప్రజలు. రైలు వచ్చి గేటు పడినప్పుడల్లా నిమిషాల పాటు జనం నిల్చోవడమే కాదు అంబులెన్స్‌లు వచ్చిన వెళ్లలేని పరిస్థితి ఉందంటున్నారు. పాలకులు ఈవిషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకొని రైల్వే ఓవర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని కోరుతున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimnagar, Railways

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు