హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : ఇంటర్‌ ఫలితాల్లో అంధ విద్యార్ధి రికార్డ్ .. కరీంనగర్ జిల్లా కాలేజీ టాపర్‌గా సాయిగణేష్

Karimnagar : ఇంటర్‌ ఫలితాల్లో అంధ విద్యార్ధి రికార్డ్ .. కరీంనగర్ జిల్లా కాలేజీ టాపర్‌గా సాయిగణేష్

(అంధ ర్యాంకర్)

(అంధ ర్యాంకర్)

Karimnagar: పిల్లలకు చదువు చెప్పించే తల్లిదండ్రులను మాత్రమే చూశాం. లేదంటే వారి పైచదువుల కోసం డబ్బులు ఖర్చు పెట్టే పేరెంట్స్‌ గురించి విన్నాం. కాని కరీంనగర్‌లో ఒక అంధ కొడుకును కాలేజీ టాపర్‌గా చేశారు ఆ తల్లిదండ్రులు.

(P.Srinivas,New18,Karimnagar)

కళ్లు ఉన్నవాడు ముందు మాత్రమే చూస్తాడు..దిమాక్ ఉన్నాడో దునియా మొత్తం చూస్తాడనే దూకుడు సినిమాలో డైలాగ్‌ని నిజం చేసి చూపించాడు సాయిగణేష్ (Saiganesh) . ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం నిలబడదని..పట్టుదల ముందు అవయవలోపాలు అణగిమణిగి ఉంటాయని రుజువు చేశాడు. అంధుడి(Blind)గా పుట్టిన యువకుడు..ఇంటర్‌ ఫలితాల్లో (Inter‌ results)సాధారణ స్టూడెంట్స్‌ని పక్కకు నెట్టి కాలేజీ టాపర్‌(College topper)గా నిలిచాడు. అన్నీ అవయవాలు ఉండి ర్యాంకులు సాధించలేక వంకలు వెదుక్కునే వాళ్లకు రోల్‌ మోడల్‌(Role model)గా నిలిచాడు.

కళ్లు లేకపోతోనేం..

కరీంనగర్ టవర్ సర్కిల్‌లో నివాసముంటున్న సాయిగణేష్‌ పేరు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మారుమోగిపోతోంది. టౌన్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ మీడియట్ పూర్తి చేసిన సాయిగణేష్ ..మంగళవారం విడుదలైన ఫలితాల్లో సీఈసీ గ్రూప్‌లో 920 మార్కులతో కాలేజీ టాపర్‌గా నిలిచాడు. సాధారణంగా ఈవిధంగా ఉత్తీర్ణత సాధించడంలో గొప్ప ఏమి కాదని అందరూ అనుకుంటారు. కాని అంధత్వంతో పుట్టిన సాయిగణేష్ ..క్లాసులోని సాధారణ స్టూడెంట్స్‌ కంటే అధికంగా మార్కులు సాధించడం నిజంగా గొప్ప విషయమంటున్నారు అధ్యాపకులు.


కాలేజీ టాపర్‌ అతనే..

పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీకి చెందిన శ్రీనివాస్, శ్రీలక్ష్మీ దంపతులు కొద్ది కాలం క్రితమే కరీంనగర్‌కు వచ్చారు. టౌన్‌లోని టవర్ సర్కిల్‌లో నివాసముంటున్నారు. సాయిగణేష్‌ తండ్రి శ్రీనివాస్‌ జువెలరీ వ్యాపారం చేస్తుండగా ...తల్లి శ్రీలక్ష్మి కరీంనగర్ కోర్టులో అడ్వకేట్ ప్రాక్టీసు చేస్తున్నారు. సాయిగణేష్‌ సాధించిన విజయంలో తల్లి పాత్ర ఎక్కువగా ఉంది. అంధుడిగా పుట్టిన సాయిగణేష్‌ను చూసి నిరాశపడకుండా అతడ్ని ఉన్నతశిఖరాలకు చేర్చేందుకు కృషి చేశారు శ్రీలక్ష్మి. బిడ్డ కోసం తాను బ్రెయిలీ లిపి నేర్చుకుని సాయి గణేష్‌కు మూడో తరగతి వరకు తానే చదువు చెప్పారు. ఆ తర్వాత తరగతుల్లోని పాఠాలను ఐ ప్యాడ్లో పాఠాలు , ప్రశ్నలు , జవాబులు రికార్డు చేసి వినిపించేవారు. ప్రకాశం జిల్లా గంజాంలో లలిత స్కూల్లో 10 వ తరగతి చదువుకున్న సాయి .. ఇంటర్ శ్రీ చైతన్య కాలేజీలో పూర్తి చేశాడు . స్మార్ట్ ఫోన్‌లో వాయిస్ స్కానర్ యాప్ ద్వారా ప్రింటెడ్ మ్యాటర్‌ని ఆడియోగా కన్వర్ట్ చేసుకుని పాఠ్యాంశాలు విని ఇంటర్ ఫలితలలో 920 మార్కులు సాధించాడు.

ఇది చదవండి: తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదేతల్లి తీర్చిదిద్దిన బిడ్డ..

సాయి గణేష్‌ని తీర్చిదిద్దడంలో తల్లి శ్రీలక్ష్మి సక్సెస్ అయ్యారు. కొడుకు కోసం విద్యార్థిగా మారి శ్రీలక్ష్మి ఇల్లాలిగా ఇంటి పనులు చక్కబెడ్తూనే తానూ చదువుకున్నారు. జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. బిడ్డను తీర్చిదిద్దాలన్న ఆ తల్లి కోరికను వమ్ము చేయకుండా సాయిగణేష్‌ అంతే పట్టుదలతో మంచి మార్కులు సాధించి కాలేజీ టాపర్‌గా నిలిచాడు.

ఇది చదవండి: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్.. రీ కౌంటింగ్ కావాలంటే ఇలా చేయండి


First published:

Tags: Karimnagar, TS Inter Results 2022

ఉత్తమ కథలు