హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: హిందుగాళ్లు బొందుగాళ్లు అంటావా?  కేసీఆర్​.. నువ్వు హిందువా? ముస్లిమా?.. సీఎం కేసీఆర్​కు విజయశాంతి సూటి ప్రశ్న

Karimnagar: హిందుగాళ్లు బొందుగాళ్లు అంటావా?  కేసీఆర్​.. నువ్వు హిందువా? ముస్లిమా?.. సీఎం కేసీఆర్​కు విజయశాంతి సూటి ప్రశ్న

విజయశాంతి (ఫైల్​)

విజయశాంతి (ఫైల్​)

ముఖ్యమంత్రి కేసీఆర్​పై బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. వేములవాడ ఆలయానికి నిధులు అందిస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు

(న్యూస్ 18 తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి)

ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)​పై బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి (BJP Leader Vijaya Shanti) మండిపడ్డారు. వేములవాడ ఆలయానికి (Vemula Vada temple) నిధులు అందిస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. వేములవాడ గుడి చాలా చిన్నదిగా ఉందని పెద్దగా చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఇక ఏదో చేస్తాడని ఇక్కడ టీఆర్ఎస్​ ఎమ్మెల్యే (TRS MLA)ను గెలిపిస్తే విదేశాలకు పోయాడని విజయశాంతి విమర్శించారు. బీజేపీ (BJP) హిందూ ధర్మం కాపాడటానికి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్​ హిందువులపై వాడిన పదజాలం సరికాదని ఇంతకీ కేసీఆర్​ హిందువా..? ముస్లిమా? (Hindu or Muslim?) అని విజయశాంతి ప్రశ్నించారు. శనివారం వేములవాడ రాజన్న సన్నిధిని దర్శించుకున్నారు..

ఉమ్మడి కరీంనగర్​లోని (Karimnagar) వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వార్లను శనివారం విజయశాంతి దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు,వేదపండితులు వేదోక్త ఆశీర్వచనంతో పాటు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపి అధ్యక్షుడు రామకృష్ణ, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్,బిజెపి నాయకులు,కౌన్సిలర్లు స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. రాజన్న దర్శనార్థం వెళ్తున్న క్రమంలో ఆలయ సమీపంలో శివపార్వతులను బిజెపి నాయకురాలు,ఎంపీ విజయశాంతి శాలువాతో సత్కరించి వారిని సన్మానించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ కేసీఆర్ రాజన్న ఆలయానికి ఏడాదికి 100 కోట్ల చొప్పున ఇస్తా అన్నాడు. 700 కోట్లు ఇవ్వాలి. కేసీఆర్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. సంస్కారం లేదు. కేసీఆర్ దేవుడి విషయంలో అబద్ధం ఆడాడు. మీరు అని నేను అనను. నీవు అని పిలుస్తాను. భక్తుల కు ఇక్కడ ఎం సదుపాయాలు లేవు. చిన్నగా గుడి ఉంది. భక్తులు (Devotes) ఎక్కువగా వస్తున్నారు. చిన్న పిల్లలు, ముసలివాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.

అభివృద్ధి చేయండి అంటే అరెస్ట్ (Arrests) లు చేయడం ఆయన నైజం. వేములవాడ ఎమ్యెల్యే (Vemula vada MLA) ను గెలిపించారు..కానీ ఎం చేశాడు. జిల్లా మంత్రి ఉన్నాడు ఎం లాభం.. సీఎం దృష్టికి తీసుకెళ్లడం లేదు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు కేసీర్​. కేసీఆర్ (KCR) నీవు హిందువా లేక ముస్లిం వా. కేసీఆర్ తప్పులను మోదీ గారి పై నెట్టడం ఆయన అలవాటు.  నరేంద్ర మోదీ (Narednra modi) రాముడి గుడి కడుతున్నాం మీకు తోచిన సహాయం చేయండి అన్నాడు తప్పా?.

ప్రపంచం మొత్తం మోదీ (Modi) ​గారిని మెచ్చుకుంటున్నారు. కానీ కేసీఆర్ కి నచ్చడం లేదు  శివుడు ఉరుకొడు. మూడో కన్ను తెరుస్తాడు. కేసీఆర్ (KCR) సంగతి తెలుస్తాడు. బీజేపీ  హిందు ధర్మం కాపాడడానికి ఉంది. తెలంగాణ ప్రజలకు బీజేపీ రక్షణ గా ఉంటుంది. కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయానికి ఇస్తా అన్న 700 కోట్లు ఇవ్వు, లేకపోతే మేం ఉరుకొం. సిగ్గు, శరం ఉంటే మాట నిలబెట్టుకో కేసీఆర్’’ అని అన్నారు.

First published:

Tags: Karimnagar, Vijayashanthi

ఉత్తమ కథలు