హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi sanjay: గంగులను కాదు దమ్ముంటే కేసీఆర్​ను రమ్మను.. మంత్రి కేటీఆర్​ సవాల్​కు బండి సంజయ్​ కౌంటర్​

Bandi sanjay: గంగులను కాదు దమ్ముంటే కేసీఆర్​ను రమ్మను.. మంత్రి కేటీఆర్​ సవాల్​కు బండి సంజయ్​ కౌంటర్​

 కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్ మీద పోటీ చేసి గెలవాలని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్​కు బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. గంగుల కమలాకర్ కాదు . దమ్ముంటే కేసీఆర్​ను పోటీ చెయ్యమనాలని కౌంటరిచ్చారు.

 కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్ మీద పోటీ చేసి గెలవాలని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్​కు బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. గంగుల కమలాకర్ కాదు . దమ్ముంటే కేసీఆర్​ను పోటీ చెయ్యమనాలని కౌంటరిచ్చారు.

 కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్ మీద పోటీ చేసి గెలవాలని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్​కు బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. గంగుల కమలాకర్ కాదు . దమ్ముంటే కేసీఆర్​ను పోటీ చెయ్యమనాలని కౌంటరిచ్చారు.

  (న్యూస్ 18 తెలుగు, కరస్పాండెంట్​, శ్రీనివాస్. పి.)

  కరీంనగర్​ (Karimnagar)లో మంత్రి గంగుల కమలాకర్ మీద పోటీ చేసి గెలవాలని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్​కు బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ (BJP Bandi Sanjay) కౌంటర్ ఇచ్చారు. గంగుల కమలాకర్ కాదు . దమ్ముంటే కేసీఆర్​(KCR)ను పోటీ చెయ్యమనాలని కౌంటరిచ్చారు (Counter to KTR). కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చారని , ఇక్కడ ఎంపీగా పని చేసిన మేధావి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తాను ఏం చేశానో ప్రజలకు తెలుసన్నారు. స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్ లో ప్రారంభోత్సవాలు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా మళ్లీ కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని విమర్శలు చేస్తున్నదని బండి ఆరోపించారు . డీపీఆర్ పంపకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఏది పడితే అది మొరిగితే జనం కోడతారనే విషయం గుర్తుంచు కోవాలని బండి హెచ్చరించారు .

  కరీనంగర్లో (Karimnagar) ఆయన మాట్లాడుతూ..  వేములవాడ ఆలయానికి ప్రసాదం  స్కీం కింద ప్రతిపాదనలు పంపితే దానిని తిరస్కరించిన ఘనత కూడ టీఆర్​ఎస్​ ప్రభుత్వనీదే అని బండి పేర్కొన్నారు. కరీంనగర్లో రోడ్ల నిర్మాణానికి రూ . 205 కోట్లు తెచ్చానని , తాము కేంద్రం నుంచి వేలాది కోట్లు తెస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు . ఎన్ని నిధులు ఇచ్చినా ఏమీ ఇవ్వలేదని చెప్పడం టీఆర్ఎస్ (TRS) కు అలవాటేనని సంజయ్​ విమర్శించారు .

  ఓడించాలని లేకుంటే గుడ్డలుడదీసి కొడతా..

  ఎంపీగా అడ్డిమార్ గుడ్డిదెబ్బలో గెలిచానని ఆరోపణలు చేస్తున్న వాళ్లు తనను కరీంనగర్  (Karimnagar) లో ఓడించాలని లేకుంటే గుడ్డలుడదీసి కొడతానన్నారు బండి సంజయ్​. భూములు కోల్పోతున్న రైతులకు అందించాల్సిన పరిహారంలో సీఎం కేసీఆర్ సొంత జిల్లాకు ఒక పాలసీ , మిగతా జిల్లాలకు ఒక పాలసీని అమలు చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు.

  కేటీఆర్ కు సిగ్గు ఉండాలని..

  కాల్వ నిర్మాణంలో భూమి కోల్పోతామనే మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఎందరో  రైతులు భూములు కోల్పోతున్న రైతులకు అందించాల్సిన పరిహారంలో సీఎం కేసీఆర్ సొంత జిల్లాకు ఒక పాలసీ , మిగతా జిల్లాలకు ఒక పాలసీని అమలు చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు . కాల్వ నిర్మాణంలో భూమి కోల్పోతామనే మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న రైతులు ఉన్నారు.. ఇవన్నీ మర్చిపోయి సొంత డబ్బా కొట్టుకోవడానికి కేటీఆర్ కు సిగ్గు ఉండాలని బండిసంజయ్  విమర్శలు చేశారు.

  కేటీఆర్​ ఏం అన్నారంటే..?

  కరీంనగర్​లో జరిగిన సభలో మంత్రి కేటీఆర్ (Minister KTR) బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ (Challenged to bandi sanjay) విసిరారు. మంత్రి గంగుల కమలాకర్ పై MLA గా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. బండి సంజయ్ పై లక్ష ఓట్ల మెజారిటీతో గంగుల విజయం సాధిస్తారని మంత్రి కేటీఆర్ (Minister KTR) ధీమాను వ్యక్తం చేశారు. మూడేళ్లలో కరీంనగర్ (Karimnagar)​ కు బండి సంజయ్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం వల్ల తెలంగాణకు ఏమైనా ఒరిగిందా అని ఆయన ప్రశ్నించారు.ముస్లింలంతా దేశ ద్రోహులన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆయన బీజేపీపై మండిపడ్డారు.

  First published:

  Tags: Bandi sanjay, CM KCR, Gangula kamalakar, Karimangar, KTR, Telangana bjp

  ఉత్తమ కథలు